నందు కారులో ఉద్యోగం కోసం వెళ్లబోతుంటే బ్యాంక్ వాళ్ళు వచ్చి కారు అడ్డంగా ఆపుతాడు. నాలుగు నెలలుగా ఈఎంఐ కట్టకుండా తప్పించుకుని తిరుగుతున్నావ్ అని బ్యాంక్ వాళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడతారు. రోడ్డుమీద నలుగురు చుట్టూ ముట్టడంతో పరువు పోయినట్టుగా ఫీల్ అవుతాడు. నందు రెండు రోజుల గడువు ఇస్తే కడతానని చెప్తాడు కానీ బ్యాంక్ వాళ్ళు మాత్రం నందుని తోసేసి కారు తీసుకుని వెళ్లిపోతారు. ఆటోలో వెళ్ళడానికి కూడా డబ్బులు లేవని నందు నడుచుకుంటూనే వెళ్ళిపోతాడు.
సామ్రాట్ బోర్డు మీటింగ్ పెట్టి రాలేదని తులసి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే సామ్రాట్ వీడియో కాల్ చేసి తులసిని చూసి నవ్వుతాడు. మీటింగ్ లో ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో చెప్తాడు. మీటింగ్ స్టార్ అయిన తర్వాత సామ్రాట్ వీడియో కాల్ లో మాట్లాడి మీకు కావాల్సిన వివరాలు తులసి చెప్తుందని అంటాడు. మీటింగ్ లో కూర్చుని ఉన్న వాళ్ళు తులసినిఇంగ్లీషులో ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు. అవి వింటూ తులసి నవ్వుతుంది. ఏమి మాట్లాడకపోయేసరికి వాళ్ళు ఏంటి మేము ఇంతగా అడుగుతుంటే ఏమి మాట్లాడకుండా ఉంటారు అని తెలుగులో అడుగుతారు. దీంతో తులసి వాళ్ళకి తెలుగు భాష మీద కాసేపు క్లాస్ తీసుకుంటుంది. అది విని సామ్రాట్ చప్పట్లు కొట్టేస్తాడు. ఆ తర్వాత ప్రాజెక్ట్ గురించి తులసి చక్కగా చెప్తుంది. అది విని అందరూ తులసిని మెచ్చుకుంటారు. కొత్త ప్రాజెక్ట్ కు ఒకే చెప్పి పనులు మొదలుపెట్టమని చెప్పి వాళ్ళు వెళ్లిపోతారు.
Also Read: ప్రేమని బయటకి చెప్పుకోలేక నలిగిపోతున్న యష్, వేద- మాళవికకి చుక్కలు చూపిస్తున్న భ్రమరాంబిక
దివ్య బాధగా కూర్చుని ఉంటే లాస్య వచ్చి పలకరిస్తుంది. తులసి మీద దివ్య పీకల దాకా కోపంతో ఉంది తనకి దగ్గర అవడానికి ఇదే మంచి అవకాశం అని లాస్య అనుకుని తనతో కూల్ గా మాట్లాడేందుకు చూస్తుంది. తులసికి వ్యతిరేకంగా దివ్యని రెచ్చగొడుతుంది. లాస్య మాటలకి దివ్య కరిగిపోయి మాట్లాడుతుంది. నేనంటే పడని మీరు కూడా నా బాధని అర్థం చేసుకున్నారు కానీ మామ్ మాత్రం నా బాధ అర్థం చేసుకోలేదని దివ్య అంటుంది. నేను మారిపోయాను మీరు గుర్తించడం లేదని లాస్య అంటుంది.
లాస్య: నీకు కావాల్సిన కొత్త ల్యాప్ టాప్ నేను కొనిస్తాను కాస్ట్ ఎంత
దివ్య: ఎంత జస్ట్ రూ.1.5 లక్షలే
అది విని లాస్య బిత్తరపోతుంది. అంత డబ్బులు ఎక్కడ నుంచి తీసుకురావాలని అని బిక్క మొహం వేస్తుంది. తులసి ఇంటికి వచ్చి మీటింగ్ లో జరిగిన విషయం మొత్తం చెప్పి సంబరపడుతుంది. అది విని ఇంట్లో వాళ్ళు అందరూ కూడా తులసిని ఆకాశానికి ఎత్తుతారు. అందరూ తులసిని పొగిడితే క్రెడిట్ మాత్రం సామ్రాట్ కి ఇస్తానని ప్రేమ్ అంటాడు. సామ్రాట్ నమ్మకమే తన బలం అని తులసి అంటుంది. అందరూ సంతోషంగా మాట్లాడుకుంటుంటే నందు డల్ గా వస్తాడు.
Also Read: దివ్య మీద ఫైర్ అయిన తులసి- అంకిత, శ్రుతి మధ్య చిచ్చు పెట్టిన లాస్య