యష్, వేద ఇంటికి తిరిగి రావడంతో ఖుషి సంతోషంగా వాళ్ళ దగ్గరకి వెళ్తుంది. కూతుర్ని చూసి ఇద్దరూ చాలా హ్యపీగా ఉంటారు. వేద పుట్టింటి నుంచి ఒడి బియ్యం తీసుకొచ్చింది, వాటితో వంట చేసుకుని తినాలని సులోచన అంటుంది. కూతుర్ని చూసి సులోచన ఎమోషనల్ అవుతుంది. మేము అమ్మమ్మ ఊరు వెళ్ళిన తర్వాత మా మధ్య సఖ్యత కుదురిందని అనుకున్నారు, కానీ ఏం కాలేదని ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి మాది అని వేద మనసులో అనుకుంటుంది. కార్యం బాగానే జరిగిందా మీరు హ్యపీగానే ఉన్నారు కదా అని సులోచన ఆత్రంగా అడుగుతుంది. వేద ఏం చెప్పాలో అర్థం కాక తల ఊపుతుంది. అప్పుడే ఖుషి వచ్చి వేదని తీసుకెళ్తుంది.
Also Read: దివ్య మీద ఫైర్ అయిన తులసి- అంకిత, శ్రుతి మధ్య చిచ్చు పెట్టిన లాస్య
బెడ్ మీద వేద చీర చూసి ఇవి ఏంటి ఇక్కడ ఉన్నాయని అడుగుతుంది. ఊరు వెళ్లారు కదా మీరు పక్కన ఉన్నట్టు అనిపించడం కోసం మీ డ్రెస్లు ఇలా పెట్టుకుని పడుకున్నా అని ఖుషి అంటుంది. తన మీద ఖుషి చూపిస్తున్న ప్రేమ చూసి మురిసిపోతుంది. మాళవిక తనకి జరిగిన అవమానం తలుచుకుని రగిలిపోతూ ఉంటుంది. అప్పుడే అభి వస్తాడు. జరిగిన విషయం మొత్తం అభికి చెప్పగా తను చాలా లైట్ గా తీసుకుంటాడు. ఆవిడ పైకి ఒకలా లోపల ఒకలా ఉంటుందని మాళవిక అంటుంది. తన దగ్గరకి వెళ్ళి మన విషయం చెప్పేయ్, లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నామని చెప్పు అని అంటుంది. వద్దు ఆ పని చెయ్యకు, తను నిన్ను టెస్ట్ చేస్తుంది. కాస్త ఓపిక పట్టు నువ్వు తనని ఇంప్రెస్ చేస్తే ఆస్తి మొత్తం నీకే రాసిస్తుందని అభి అంటాడు.
ఇన్నాళ్ళూ ఓర్చుకున్నావ్ కదా ఇంకొన్ని రోజులు ఓర్చుకోమని బతిమలాడతాడు. కానీ మాళవిక మాత్రం అందుకు ఒప్పుకోదు. వాళ్ళ మాటలు ఖైలాష్ వింటాడు. భ్రమరాంబికకి విషయం చెప్పి తన ఆస్తి కొట్టేయాలని ఖైలాష్ ప్లాన్ వేస్తాడు. ఖుషి వేద, యష్ తో కూర్చుని కబుర్లు చెప్తుంది. పల్లెటూరిలో బాగా ఎంజాయ్ చేశారా అని అడుగుతుంది. అక్కడ ఇద్దరు చేసిన పనుల గురించి చెప్తుంటే ఖుషి సంతోషంగా ఫీల్ అవుతుంది. యష్ వేదకి థాంక్స్ చెప్తాడు. బాగా నటిస్తున్నందుకా అని వేద బాధగా అంటుంది. వేద కూడా యష్ కి తిరిగి థాంక్స్ చెప్పి తనకంటే బాగా నటిస్తున్నారని అంటుంది. ఇలా సంతోషంగా ఉన్నట్టు నటించడం ఎన్ని రోజులని వేద అడుగుతుంది.
యష్: నీ మనసులో ఏముందో నాకు తెలుసు, నా మనసులో ఏముందో నీకు తెలుసు
Also Read: భ్రమరాంబిక కాళ్ళ దగ్గర మాళవిక, ఘోరమైన అవమానం- ఇంటికి చేరుకున్న వేద, యష్
వేద: ఏం తెలుసు
యష్: ఏం చేసినా ఖుషి కోసమే చేస్తావ్ కదా. మనం మనంగానే ఉండాలి
వేద: మనం మనంగా కాదు ఎవరికి వాళ్ళుగా
యష్: ఖుషికి తల్లిగానే వచ్చావ్ కానీ ఇప్పుడు అలా లేదు అని మనసులో అనుకుంటాడు
వేద; ఎవరైనా భార్య తర్వాత తల్లి స్థానం ఫీలవుతారు. కానీ నేను తల్లి స్థానం నుంచి భార్య స్థానం కోసం ఫీలవుతుంది. ఇది ఎవరికి చెప్పుకోవాలి అని మనసులో అనుకోగానే ఎవరికి చెప్పుకోలేము అని యష్ బయటకి అంటాడు. మనకి కష్టాలు, బాధలు లేవు అయినా అందరి సంతోషం కోసం మనం సంతోషంగా ఉన్నట్టు గడపటం కొత్తగా, బాధగా ఉందో అర్థం కావడం లేదని అంటాడు. ఇద్దరూ తమ మనసులో ప్రేమ బయటకి చెప్పుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు.