Trinayani August 12th: విక్రాంత్ సుమనతో అసలు నిజానికి నీ కడుపులో ఉన్న బిడ్డకు నేను తండ్రిని కాదు.. అసలు కడుపులో ఉన్నది అని చెప్పబోతుండగా వెంటనే విశాల్ ఆపుతాడు. ఇంకొక్క మాట మాట్లాడిన సుమన విధవరాలు అవుతుందని అంటాడు. వెంటనే సుమన ఇది వరస నిజం చెబితే చచ్చిపోతారని భయపెట్టి చివరకు నా బిడ్డను నేను అద్దంలో కూడా చూడలేకపోయాను దానికి కారణం నయని అని అంటుంది.
నువ్వు అపార్థం చేసుకుంటున్నావని మా అందరికీ తెలుసని నయని అంటూ.. ఇక ఏది ఏమైనా నెల తప్పితే ఆస్తి రాదు.. పుట్టిన బిడ్డకి ఆయుష్షు లేకుంటే ఆస్తి రాదు అని అంటుంది. దానితో సుమన అంటే ఇప్పుడు నా బిడ్డ పోతుందా అని అంటుంది. దాంతో విక్రాంతకు బాగా కోపం వస్తుంది. ఇక నయని బిడ్డ పుట్టాక సజీవంగా ఉంటేనే ఆస్తి వస్తుందని చెబుతుంది. విశాల్ కూడా డెలివరీ అయ్యాక ఆస్తి తీసుకోమని అంటాడు.
అయినా కూడా సుమన మొండి చేయటంతో ఇంట్లో వాళ్ళందరూ హెచ్చరిస్తూ ఉంటారు. ఇక విశాల్ ఆస్తి ఇవ్వనని అనుమానం ఏంటి అనటంతో.. బిడ్డ పుట్టాక నా ఒడిలో బిడ్డ ఉంటుంది అది గ్యారెంటీ.. కానీ ఆస్తి ఇవ్వాల్సిన మీరు ఉంటారా అని అనటంతో అందరూ షాక్ అవుతారు. ఏంటి బావగారు అర్థం కాలేదా ఆలోపే మీరు చచ్చిపోతే అని అనటంతో.. వెంటనే నయని లాగి సుమన చెంప పగలగొట్టి ఆ మాటలు మాట్లాడితే బాగుండదు అని వార్నింగ్ ఇస్తుంది.
దానితో సుమన బావ జాతకంలో అలాగే ఉంది కదా అని.. తాతనే కాకుండా గురువు కూడా చెప్పారు కదా అని అంటుంది. ఇక విశాల్ ఆ గొడవ ఆపి ఈ తొమ్మిది రోజులు నేను ఏమి పోను అని బిడ్డ పుట్టినరోజు ఆస్తి మీద సంతకాలు పెడతామని అంటాడు. ఇక ఈ తొమ్మిదే రోజులా కాదు 90 సంవత్సరాలు బతుకుతాను.. నా భార్య బిడ్డల కోసం ఉంటాను అని తనదైన స్టైల్ లో సమాధానం చెబుతాడు.
మధ్యలో తిలోత్తమా నీకు ఏదైనా అవుతుందేమో అని సుమనకు కూడా నమ్మకం ఉండొచ్చు కదా అనటంతో.. వెంటనే విక్రాంత్ వెటకారంగా వారి నోరు మూయిస్తాడు. కానీ సుమన మాత్రం విశాల్ కు ఏదో జరుగుతుందని నమ్మకంతోనే ఉండటంతో.. విశాల్ సుమన కోసం ఆస్తి పేపర్ల మీద సంతకం పెడతాను అని అంటాడు. కానీ గాయత్రి ఆ పేపర్లు చింపేయడంతో సుమన పాప దగ్గరికి కోపంగా వెళుతుండగా విక్రాంత్ అడ్డు ఆపి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు.
ఇక తిలోత్తమా సుమనను ఒక వారం రోజులు ఆగమని అంటుంది. దానికి సుమన సరే అంటుంది. ఆ తర్వాత సుమన తన గదిలో తన బట్టలు ప్యాక్ చేస్తూ ఉండగా విక్రాంత్ వచ్చి మీ పుట్టింటికి వెళ్తున్నావ్ సంతోషం అని అంటాడు. కానీ తను ఎక్కడికి వెళ్ళను అని తన అక్క తనపై కోపడినప్పుడల్లా ఇలా చేస్తానని అంటుంది. అదే సమయంలో అక్కడికి వల్లభ, తిలోత్తమా వాళ్ళు వచ్చి సుమనకు నయని గురించి చెబుతూ తన మాటలతో మరింత రెచ్చగొడుతుంది.
దానితో తల్లి, అన్న పై ఫైర్ అవుతూ ఉంటాడు విక్రాంత్. అలా కాసేవు అక్కడ మరోసారి ఆస్తి గురించి రచ్చ జరుగుతుంది. ఇక మరుసటి రోజు ఉదయాన్నే హాసిని పెళ్లి రోజు అని గ్రాండ్ గా డెకరేషన్ చేస్తూ ఉంటారు. ఇక హాసిని సింపుల్ గా ఉంటుందని నయని వాళ్ళు మాట్లాడటంతో అప్పుడే సుమన వచ్చి.. అన్ని కోట్లు ఉండి ఏం లాభం పోయే రోజు కట్టుకొని పోతారా అని అపశకనంగా మాట్లాడుతుంది. దాంతో విక్రాంత్ తిరిగి నువ్వు ఎప్పుడు పోతావు అంటూ ఫైర్ అవుతాడు.
ఇక అప్పుడే అందరూ హాల్ లోకి వస్తారు. హాసిని కూడా అందంగా రెడీ అయి రావటంతో చీర బాగుంది అని ఇంట్లో వాళ్ళు అంటారు. అది నేనే కొనిచ్చాను అని వల్లభ అనటంతో వెంటనే వల్లభ పై వెటకారం డైలాగులు కొడుతూ ఉంటుంది. ఇద్దరి మధ్య కాసేపు రచ్చ జరగటంతో ఇంట్లో వాళ్ళు కూల్ చేస్తుంటారు. ఆ తర్వాత కేక్ కటింగ్ ఏర్పాట్ల కోసం సిద్ధం చేస్తారు. తిలోత్తమా ఇంకా రాకపోయేసరికి తన గురించి చర్చ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే తిలోత్తమా అక్కడికి వస్తుంది. అందరూ తిలోత్తమా గెటప్ ని చూసి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే తను డోర్ కటన్ చుట్టుకొని వచ్చినట్లు కనిపిస్తుంది.
also read it : Prema Entha Madhuram August 11th: శోకసంద్రంలో అను.. డబ్బు కోసం ఆదిత్యను వదిలేస్తున్న రౌడీలు?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial