Prema Entha Madhuram August 11th: శారదమ్మ బాధపడుతూ అంజలితో భాను ఎంత బాధ పడుతుందో.. తనకు కాస్త ధైర్యాన్ని ఇద్దాం అని ఒకసారి తనకి ఫోన్ చేయమని అంజలితో చెబుతుంది. ఇక అను మాత్రం బాధతో బరువెక్కిన గుండెతో ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ప్రీతి ఫోన్ కి అంజలి ఫోన్ చేస్తుంది. అను పరిస్థితి ఎలా ఉంది అని అడగడంతో తను చాలా ఏడుస్తుంది అని ప్రీతి చెబుతుంది. ఇక శారదమ్మ ఫోన్ తీసుకొని మాట్లాడుతుండగా అను తట్టుకోలేకపోతుంది.


శారదమ్మ అనుకు ధైర్యం చెబుతుంది. బాబు కచ్చితంగా దొరుకుతాడు అని చెబుతుంది. ఆ తర్వాత ఆర్య జిండేతో బాబుని తీసుకొచ్చిన వాళ్లకు రెండు కోట్ల ఆఫర్ చేయమని చెప్పడంతో జిండే అంత డబ్బా అని ఆశ్చర్యపోతాడు. జిండే మాటలకూ ప్రతిస్పందిస్తూ ఆర్య కేవలం ఆదిత్యనే కాదు ఎంతోమంది చిన్న పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్లందర్నీ కాపాడాలి అని అంటాడు.


ఇక అను పాపని ఎత్తుకొని ఆదిత్య ఫోటో చూపిస్తూ అందరిని ఈ బాబుని చూశారా అని అడుగుతూ ఉంటుంది. ఇక ఆఫీసులో ఉన్న ఆర్య ఆదిత్యను తలుచుకుంటూ ఉంటాడు. తను గతంలో ఆదిత్యతో సరదాగా గడిపిన క్షణాలు తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. మరోవైపు రౌడీలు ఒక అడ్రస్ దగ్గరికి చేరుకుంటారు. అదే సమయంలో అను కూడా అక్కడ బాబు కోసం వెతుకుతూ ఉంటుంది.


బాబు అనుని చూసి బాగా ఏడుస్తాడు. కానీ అను బాబును చూడదు. ఇక అప్పుడే ఒక రౌడీ షాప్ దగ్గరికి వెళ్లగా అక్కడ న్యూస్ పేపర్ లో ఆదిత్య గురించి ఇచ్చిన ప్రకటన చూసి వెంటనే మరో రౌడీకి వచ్చి చెబుతాడు.  రెండు కోట్ల డబ్బులు ఆఫర్ చేశారు కాబట్టి భాయ్ దగ్గరికి వెళ్లి ఈ విషయాన్ని చెప్పాలి అని అక్కడి నుంచి బయలుదేరుతారు. ఆ తర్వాత అనుకూడా అదే షాప్ కి వెళ్ళగా అక్కడ పేపర్ చూసి ఆర్య సార్ కూడా చాలా బాధపడుతున్నాడు అని అనుకుంటుంది.


ఆ తర్వాత అను ఇంటికి వెళ్ళాక అంజలి దంపతులు వచ్చి అనును ఓదార్చుతూ ఉంటారు. జిండే అంజలి కి ఫోన్ చేసి అను పరిస్థితి గురించి తెలుసుకుంటాడు.  ఇక రౌడీలు తమ భాయ్ దగ్గరికి వెళ్లి పేపర్ చూపించటంతో అతడు ఇద్దరు మనుషుల ద్వారా అబ్బాయి దొరికాడని అబ్బాయిని అప్పజెప్పి డబ్బులు తీసుకోవాలని అనుకుంటాడు. ఇక అందులో ఒక వ్యక్తితో ఫోన్ చేయించడంతో వెంటనే జిండే కొత్త నెంబర్ అని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు.


ఇక అతడు ఈ బాబు ఒక గుడి దగ్గర దొరికాడు అని అంతేకాకుండా డబ్బు కూడా ఇవ్వమని ఆర్డర్ చేసినట్లు మాట్లాడటంతో అక్కడే ఉన్న ఆర్యకు వాళ్లపై డౌట్ వస్తుంది. జిండే డబ్బులు ఇస్తాము ముందు బాబుని ఇవ్వమని అడ్రస్ చెబుతాడు. ఇక జిండే నీరజ్ ఫోన్ కి ఫోన్ చేసి బాబు ఆచూకీ దొరికింది చెప్పటంతో అను సంతోషపడుతుంది. ఇక ఆర్య అనుతో బాబు ఆచూకీ దొరికిందని నేను చెప్పిన అడ్రస్ కి రండి అని ఫోన్ కట్ చేస్తాడు. ఇక ఆ రౌడీలు ఇద్దరు దంపతులకు ఆదిత్యనిచ్చి పంపిస్తారు. ఆర్య వాళ్ళు కూడా అదే అడ్రస్ కి చేరుకుంటారు. 


also read it : Trinayani August 10th: 'త్రినయని' సీరియల్: విశాల్ ను కాపాడిన నాగుపాము, దెబ్బకు షాక్ లో ఉన్న తిలోత్తమా?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial