ETV Dance Show Dhee 20 New Season Contestants: టీవీ ఆడియన్స్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించే షోల్లో కిరాక్ డ్యాన్స్ షో 'ఢీ' ఒకటి. యూత్‌లో డ్యాన్స్ టాలెంట్ ప్రపంచానికి చూపించే ఈ షో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తోంది. ప్రతీ బుధవారం, గురువారం రాత్రి 9:30 గంటలకు ఈ షో ప్రసారం అవుతుండగా.. గురువారం 19వ సీజన్ పూర్తైంది. ఇక 'ఢీ 20' కొత్త సీజన్ రెడీ అవుతోంది. తాజాగా.. 'ఇది సార్ మా బ్రాండ్' అంటూ 'డీ 20' కొత్త సీజన్ కంటెస్టెంట్స్ లిస్ట్ రిలీజ్ చేశారు.
పల్సర్ బైక్ ఝాన్సీతో పాటు..
నందు, విజయ్ బిన్నీ మాస్టర్, హీరోయిన్ రెజీనా కసాండ్రా హోస్ట్స్‌గా వ్యవహరించనున్న ఈ కొత్త సీజన్‌లో పల్సర్ బైక్ ఝాన్సీతో పాటు అన్షురెడ్డి, సుస్మిత, అభి, పండు, మణికంఠ, జాను లిరి, రాజ నందిని, రాజు, జతిన్, భూమిక పార్టిసిపేట్ చేయనున్నారు. ఎప్పటిలాగే ఈ సీజన్ కూడా ఫుల్ డ్యాన్స్ స్వింగ్‌తో పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ అందించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ప్రోమో ఆకట్టుకుంటోంది. ప్రతీ బుధ, గురువారాల్లో రాత్రి 9:30 గంటలకు ఈటీవీలో ఈ షో ప్రీమియర్ కానుంది.
Also Read: హిట్ కాంబో రిపీట్ - 'హాయ్ నాన్న' డైరెక్టర్‌తో నేచురల్ స్టార్ నాని?.. ఎన్టీఆర్‌తో అనుకున్నారు కానీ..
ఢీ జోడీ 19 విన్నర్ ఎవరంటే..
'ఢీ జోడీ 19' సీజన్ గ్రాండ్ ఫినాలే ఈవెంట్‌కు యంగ్ హీరో అడివి శేష్ (Adivi Sesh) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన టైటిల్ విన్నర్‌ను అనౌన్స్ చేసి విజేతకు టైటిల్ అందించారు. పైనల్ రౌండ్‌లో చంద్ అండ్ తులసి, సూర్యతేజ్ అండ్ హంస జోడీలు సూపర్ ఫెర్మార్మెన్స్ ఇచ్చాయి. డ్యాన్స్ విత్ ప్రాపర్టీతో స్టార్ట్ చేసి ఫోక్ హిపాప్, ట్రయో, సాల్సా ఫైనల్‌గా షూట్ అవుట్ రౌండ్‌లో రెండు జోడీలు అదిరే ఫెర్మార్మెన్స్ అందించారు. వీరి డ్యాన్స్‌కు శేష్ ఫిదా అయిపోయారు.
వారు ఫెర్మార్మ్ చేస్తున్నంత సేపు అడివి శేష్ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక విన్నర్‌ను అనౌన్స్ చేసేటప్పుడు కాస్త ఎగ్జైట్మెంట్‌కు గురయ్యారు. ఈ సీజన్‌లో సూర్యతేజ అండ్ హంస జోడీ విన్నర్‌గా నిలవగా వారికి ట్రోఫీ అందించారు. టైటిల్ గెలవాలన్న మనోజ్ మాస్టర్ 12 ఏళ్ల కల ఈ సీజన్‌తో నెరవేరింది. ఢీ జూనియర్స్ 1తో మొదలైన మనోజ్ మాస్టర్ జర్నీలో అన్నీ ఓటములే. 'ఢీ 13' సీజన్‌లో కాస్త దూరంలో టైటిల్ మిస్ అయ్యారు. ఆ టైంలో రన్నరప్‌గా నిలిచారు. చివరకు 19వ సీజన్‌లో టైటిల్ సాధించి తన కలను సాకారం చేసుకున్నారు. దీంతో ఆయన పేరెంట్స్, ఫ్యాన్స్, టీం ఆయన్ను ప్రశంసిస్తున్నారు. అటు.. రన్నరప్‌గా నిలిచిన చంద్ అండ్ తులసి జోడీకి అడివి శేష్ సపోర్ట్‌గా నిలిచారు. టైటిల్ కొద్దిలో మిస్ కావడంతో వారు ఎమోషన్ కావడాన్ని గమనించిన శేష్.. వారికి ధైర్యం చెబుతూనే తన లైఫ్‌లో జరిగిన స్టోరీని షేర్ చేసుకుంటూ వారిలో జోష్ నింపారు.