Nani Movie With Hi Nanna Director Shouryuv: 'హాయ్ నాన్న'.. ఈ మూవీ పేరు వింటనే మనకు మంచి ఎమోషన్‌తో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గుర్తొస్తుంది. 2023లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. శౌర్యువ్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా.. పలు అవార్డులనూ సొంతం చేసుకుంది.
హిట్ కాంబో రిపీట్?
ఇప్పుడు మళ్లీ అదే హిట్ కాంబో రిపీట్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. 'హాయ్ నాన్న' తర్వాత డైరెక్టర్ శౌర్యువ్ తన కొత్త ప్రాజెక్టును ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించేందుకు ప్లాన్ చేశారని టాక్. ఈ మూవీని నానితో చేయబోతున్నట్లు సమాచారం. 'హిట్ 3'తో ఫుల్ జోష్ మీదున్న నాని.. ప్రస్తుతం 'ప్యారడైజ్'తో బిజీగా ఉన్నారు. కాస్త బ్రేక్ తీసుకున్నా.. జులై నుంచి షూటింగ్ కంటిన్యూ కానుంది. ఈ మూవీ షూటింగ్ పూర్తైన తర్వాతే శౌర్యువ్ మూవీ ట్రాక్ ఎక్కనున్నట్లు సమాచారం.
రూట్ మార్చారా?
తండ్రీ కుమార్తెల సెంటిమెంట్‌తో రూపొందించిన ఎమోషనల్ ఎంటర్‌టైనర్ 'హాయ్ నాన్న' మూవీ. వైర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ మూవీని నిర్మించగా.. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించారు. 2023లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. తండ్రిగా నాని యాక్టింగ్‌కు ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా అయిపోయారు.
ఇప్పుడు ఈ కొత్త ప్రాజెక్ట్ ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. 'హాయ్ నాన్న' విపరీతమైన ఎమోషన్స్ చూపించిన శౌర్యువ్.. ఈ సారి కమర్షియల్ రూట్‌లో కొత్త తరహా స్టోరీని రెడీ చేసినట్లు సమాచారం. మరి ఇది ఎలాంటి జానర్ అనేది అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఎన్టీఆర్‌తో అనుకున్నారు కానీ..
ఈ ప్రాజెక్టును తొలుత ఎన్టీఆర్‌తో చేయాలని శౌర్యువ్ భావించినట్లు తెలుస్తోంది. స్టోరీపై ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదిరినా.. ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. బాలీవుడ్ ఎంట్రీ మూవీ 'వార్ 2'తో ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ప్రశాంత్ నీల్‌తో చేయబోయే ప్రాజెక్టులో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఆ తర్వాత కొరటాల శివ 'దేవర 2' ఇలా వరుస ప్రాజెక్టులు లైనప్‌లో ఉన్నాయి. దీంతో శౌర్యువ్ చెప్పిన ప్రాజెక్టు చాలా ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలోనే శౌర్యువ్.. నానికి కథ వినిపించారని.. త్వరలోనే వీరిద్దరి కాంబోలో మూవీ ఉంటుందని అంతా భావిస్తున్నారు.
'హాయ్ నాన్న'తో మంచి సక్సెస్ అందుకున్న శౌర్యువ్ తన రెండో ప్రాజెక్టుతో మళ్లీ హిట్ కొట్టాలని అనుకుంటున్నారు. తొలి మూవీ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించగా.. ఈ సినిమా పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఏ జానర్, ఇతర నటీనటులు ఎవరనేది త్వరలోనే తెలిసే ఛాన్స్ ఉంది.