Nani's HIT 3 Movie Faces Copyright Issue: నేచురల్ స్టార్ నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది 'హిట్ 3: ద థర్డ్ కేస్'. 'హిట్' ఫ్రాంచైజీలో భాగంగా శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ మూవీ మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చి.. బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ప్రస్తుతం 'నెట్ ఫ్లిక్స్' ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతుండగా ఇప్పుడు మేకర్స్‌కు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి.

'హిట్ 3'పై కేసు

ఈ సినిమా స్టోరీని కాపీ కొట్టారంటూ ఓ మహిళా రచయిత మద్రాస్ హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. తన స్టోరీని కాపీ చేశారంటూ రైటర్ విమల్ సోనీ కోర్టును ఆశ్రయించారు. గతంలో తాను రాసిన ఏజెంట్ 11, ఏజెంట్ V స్టోరీల నుంచి కాపీ కొట్టి 'హిట్ 3' తీశారంటూ మేకర్స్‌పై కాపీ రైట్ కేసు వేశారు. ఈ సందర్భంగా తాను రాసిన ఒరిజినల్ కాపీని కోర్టుకు సమర్పించారు.

నానికి బిగ్ ఫ్యాన్

తాను నానికి వీరాభిమానిని అని విమల్ చెప్పారు. అయితే, తాను రాసిన స్టోరీని డైరెక్టర్ శైలేష్ కాపీ కొట్టారని.. అందుకే పిటిషన్ వేసినట్లు చెప్పారు. మరి దీనిపై మూవీ టీం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. అయితే.. గతంలోనూ శైలేష్‌పై ఇలాంటి విమర్శలే వచ్చాయి. వెంకటేష్ సైంధవ్ సినిమా స్టోరీని కూడా ఆయన కాపీ కొట్టారనే ఆరోపణలు వచ్చాయి. 

Also Read: 'కుబేర' ఓటీటీ: ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేసిన బిచ్చగాడి కథ... ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?

నాని సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రశాంతి తిపిర్నేని 'హిట్ 3' నిర్మించారు. నాని సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించారు. అడివి శేష్ గెస్ట్ రోల్‌లో మెరిశారు. మూవీలో రావు రమేష్, కోమలీ ప్రసాద్, సూర్య శ్రీనివాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించారు.

మూవీలో వయలెన్స్ ఎక్కువగా ఉందని.. చిన్న పిల్లలు, ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకు దూరంగా ఉండాలని మూవీ టీం ప్రమోషన్లలోనే వార్నింగ్ ఇచ్చింది. అయితే.. థియేటర్లలో విడుదలైన రెండు రోజుల తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ సైతం మూవీ చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించారు. మాస్ లుక్‌లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్‌గా నాని అదరగొట్టారు. 

స్టోరీ ఏంటంటే?

అర్జున్ సర్కార్ (నాని) పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్. హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీంలో అధికారి కాగా.. జమ్ము కశ్మీర్‌లో దారుణ హత్య వెలుగుచూస్తుంది. దేశవ్యాప్తంగా అలాగే 13 హత్యలు జరుగుతాయి. సమాజంలో ఓ సైకో గ్రూప్ అలా హత్యలు చేయడాన్ని ప్రేరేపిస్తుంది. చీకటి నేరాలకు కేరాఫ్ అడ్రస్ 'డార్క్ వెబ్'లో చేరేందుకు ఆ హత్యలే ఎంట్రీ టికెట్. ఈ గ్రూప్ ఉందని తెలుసుకున్న అర్జున్ తన టీంతో ఏం చేశాడు?, అందులో ఎలా చేరాడు?, నిందితులను ఎలా పట్టుకున్నాడు?, పోలీస్ ఆఫీసర్‌గా ఉంటూ అసలు జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.