దర్శకుడు శేఖర్ కమ్ముల (Sekhar Kammula) అంటే ఫీల్ గుడ్ ఫిలిమ్స్ తీస్తారని పేరు ఉంది. 'ఆనంద్', 'గోదావరి' నుంచి మొదలు పెడితే 'హ్యాపీ డేస్', 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్', 'ఫిదా', 'లవ్ స్టోరీ' వరకు పాతికేళ్ల ప్రయాణంలో ఆయన హ్యాండిల్ చేసిన సబ్జెక్ట్స్ అన్ని ఫ్యామిలీ అండ్ ప్రేమ కథలే. అటువంటి శేఖర్ కమ్ముల తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి తీసిన సినిమా 'కుబేర'. కింగ్ అక్కినేని నాగార్జున, తమిళ స్టార్ ధనుష్ నటించారు. జూన్ 20న విడుదల. థియేటర్లలో విడుదలకు ముందు డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ అమ్మేశారు. ఈ సినిమా ఏ ఓటీటీలోకి వస్తుందో తెలుసా?

అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'కుబేర'Kuberaa OTT Release Date And Platform: 'కుబేర' ఓటీటీ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో సినిమాను విడుదల చేశారు. అన్ని భాషల డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ అమెజాన్ దగ్గర ఉన్నాయి. 

థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాలకు ఓటీటీలోకి కుబేర సినిమా వస్తుందని యూనిట్ సన్నిహిత వర్గాల కథనం. ఈ డీల్ విలువ సుమారు రూ. 47 కోట్లు అని తెలిసింది. తమిళంతో పాటు దేశ వ్యాప్తంగా ధనుష్ ఇమేజ్‌కు తోడు నాగర్జున స్టార్‌డమ్ యాడ్‌ కావడం సినిమాకు కలిసి వచ్చింది.

ప్రభుత్వాన్ని చిక్కుల్లో పెట్టిన బిచ్చగాడు!'కుబేర' సినిమాలో బిచ్చగాడు దేవా పాత్రలో ధనుష్ నటించగా... ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన సిబిఐ ఆఫీసర్ దీపక్ పాత్రలో అక్కినేని నాగార్జున కనిపించనున్నారు. వాళ్ళిద్దరి చుట్టూ తిరిగే ఈ కథలో ఒక భారీ స్కామ్ కీలక పాత్ర పోషించనుంది.

Also Read'8 వసంతాలు' రివ్యూ: ఎనిమిదేళ్లు గుర్తుంటుందా? 8 రోజులకు మర్చిపోతామా? ఫణీంద్ర నర్సెట్టి సినిమా హిట్టా? ఫట్టా?

ప్రభుత్వంలోని కొందరు పెద్దలు కలిసి భారీ స్కామ్ చేయడానికి ప్లాన్ చేస్తారు. 14 ట్రిలియన్ క్యూబిక్ ఫీట్ ఫ్యూయల్ స్కామ్ అది. ఆ కుట్రలోకి సిబిఐ ఆఫీసర్ దీపక్ ఎలా వచ్చాడు? బిచ్చగాడు దేవాను ఎలా ఈ ఊబిలోకి లాగాడు? దేవా చేసిన పని వల్ల ప్రభుత్వం ఏ విధమైన చిక్కుల్లో పడింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. దేవా ప్రేమ కథ ఏమిటి? రష్మిక క్యారెక్టర్ ఏమిటి? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ధనుష్ నాగార్జున రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో జిమ్ సర్బ్ కీలక పాత్ర పోషించారు.

Also Read'రానా నాయుడు 2' రివ్యూ: డోస్ తగ్గించిన వెంకీ, రానా... రొమాంటిక్ సీన్స్, లిప్ లాక్స్‌ లేవు... మరి సిరీస్ ఎలా ఉంది? నెట్‌ఫ్లిక్స్‌లో సీజన్ 2 ఆకట్టుకుంటుందా?

'కుబేర'కు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం చాలా కీలకంగా నిలిచిందని, ఈ సినిమాలో పాటలు అన్నీ పర్ఫెక్ట్ ప్లేస్మెంట్‌లో వచ్చాయని, పాటల కంటే ముఖ్యంగా నేపథ్య సంగీతం చాలా బాగుందని ప్రేక్షకులతో పాటు విమర్శకులు తెలిపారు. ఈ సినిమాను సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మించారు.