Dhanush and Nagarjuna movie Kuberaa twitter talk: కింగ్ అక్కినేని నాగార్జున, కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన మూవీ 'కుబేర'. నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్. అమెరికాలో ప్రీమియర్ షోలు పడ్డాయి. మరి సోషల్ మీడియాలో టాక్ ఏంటి? ఓవర్సీస్ నుంచి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఎటువంటి రిపోర్ట్స్ వస్తున్నాయి? అనేది ఒకసారి చూడండి. 

Continues below advertisement

అదరగొట్టిన ధనుష్... ఏం చేశారు సార్!'కుబేర' ఓవర్సీస్ ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ నుంచి వినిపించే మొదటి మాట ధనుష్ గురించి! ఇండియాలో ఆయన తప్ప మరో స్టార్ హీరో ఎవరు కూడా ఆ రోల్ చేయలేరని చెబుతున్నారు. నటుడిగా ధనుష్ టాలెంట్ ఏమిటనేది ఇంతకు ముందు చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి. ఈ సినిమాతో అతడు మరొక మెట్టు పైకి ఎక్కుతాడని అంటున్నారు. బిచ్చగాడిగా, ప్రభుత్వాన్ని ఢీ కొట్టే దృఢ సంకల్పం ఉన్న మనిషిగా ఆయన ఇరగదీశారట. 

కింగ్ ఫ్యాన్స్ మీసం తిప్పేలా... యూనీక్‌గా!కింగ్ అక్కినేని నాగార్జున అభిమానులు ఆశించే భారీ విజయం ఇటీవల రాలేదు. ఆ లోటు 'కుబేర'తో తీరుతుందని అమెరికాలో ప్రీమియర్స్ చూసిన జనాలు అంటున్నారు. నాగార్జున ఫ్యాన్స్ మీసం మేలేసేలా సినిమా ఉందట. సీబీఐ ఆఫీసర్ దీపక్ పాత్రలో నాగార్జున చాలా సహజంగా నటించారట. ఆయన కెరీర్‌లో ఇదొక యూనీక్ రోల్ అవుతుందని చెబుతున్నారు. రష్మిక తన పాత్ర వరకు న్యాయం చేసిందట.

Also Read: '8 వసంతాలు' రివ్యూ: ఎనిమిదేళ్లు గుర్తుంటుందా? 8 రోజులకు మర్చిపోతామా? ఫణీంద్ర నర్సెట్టి సినిమా హిట్టా? ఫట్టా?

స్టార్టింగ్ స్లో... కానీ హై ఇచ్చిన శేఖర్ కమ్ముల!సాధారణంగా సినిమా విడుదల తర్వాత వినిపించే ప్రధాన విమర్శలలో ల్యాగ్ ఒకటి. ఆయన సినిమాలు నిదానంగా ఉంటాయని. 'కుబేర' కూడా స్టార్టింగ్ స్లోగా ఉందట. అయితే... ధనుష్ క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమా ఒక 'హై' ఇచ్చిందని ప్రీమియర్స్ రిపోర్ట్స్ బట్టి తెలుస్తున్నాయి. కథ నుంచి బయటకు వెళ్లకుండా శేఖర్ కమ్ముల చాలా నిజాయతీగా సినిమా తీశారట.

ఇంటర్వెల్ తర్వాత వచ్చే నాలుగైదు ఎమోషనల్ సీన్లు మన టికెట్ డబ్బులకు సరిపడా కంటెంట్ ఇస్తాయని ఎన్నారై ఆడియన్స్ అంటున్నారు. ఆపైన సినిమా అంతా బోనస్ అట. రాబోయే రోజుల్లో శేఖర్ కమ్ముల ఈ సినిమా తీసిన తీరు గురించి జనాలు మాట్లాడుకుంటారట. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సైతం సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ అంటున్నారు. సినిమా గురించి ట్విట్టర్‌లో కొంత మంది ఆడియన్స్ ఏం అన్నారో ట్వీట్లలో చూడండి.

Also Read'రానా నాయుడు 2' రివ్యూ: డోస్ తగ్గించిన వెంకీ, రానా... రొమాంటిక్ సీన్స్, లిప్ లాక్స్‌ లేవు... మరి సిరీస్ ఎలా ఉంది? నెట్‌ఫ్లిక్స్‌లో సీజన్ 2 ఆకట్టుకుంటుందా?