గుండెనిండా గుడిగంటలు జూన్ 20 ఎపిసోడ్
శృతికి నల్లపూసలు గుచ్చే ఫంక్షన్ పేరుతో ఆ ఫ్యామిలీ నుంచి అల్లుడిని ఏకంగా మనింటించి తెచ్చేసుకుందాం అంటుంది శ్రుతి తల్లి. అది సాధ్యం కాదేమో అంటాడు శ్రుతి తండ్రి. ఆ ఫంక్షన్ గ్రాండ్ గా చేసి మళ్లీ శ్రుతి, రవిని తిరిగి వెళ్లనివ్వను అంటుంది. ఏం చేస్తావో చేయి కానీ అంతా సవ్యంగా జరగాలి అంటాడు. బాలుని రెచ్చగొడితే గొడవ జరిగితీరుతుంది ఆ సిట్యుయేషన్ అడ్డుపెట్టుకుని మన అమ్మాయి అల్లుడిని తీసుకెళ్లిపోదాం అంటుంది.
హాల్లోకి వెళ్లాలంటుంది ప్రభావతి. వాళ్ల రూమ్ మనకు ఇచ్చేసి ఇద్దరూ హాల్లో ఉంటున్నారు. నువ్వు ఇప్పుడు వెళ్లడం కరెక్ట్ కాదంటాడు సత్యం. అందుకే ఈ విజిల్ అంటూ గట్టిగా విజిల్ వేసుకుంటూ వెళుతుంది. ఇల్లంతా విజిల్ వేసుకుంటూ హడావడి చేస్తుంటుంది. మనోజ్-రోహిణి, రవి-శ్రుతి ఇద్దరూ కంగారుపడతారు. అర్థరాత్రి ఏంటీ గోల అనుకుంటూ తిట్టుకుంటారు. హాల్లోకి వచ్చి మీనా-బాలుకి క్లాస్ వేస్తుంది. ఇంట్లో పని చేశావా అని అడుగుతుంటే..మిగిలినవాళ్లకు కూడా పనులు అప్పగించొచ్చు కదా అంటాడు బాలు. వాళ్లంతా నౌకర్లు ఉన్న ఇంట్లో పుట్టారు అంటుంది.. నువ్వు కూడా నౌకర్లు ఉన్న ఇంట్లోనే పుట్టావా అని ఫైర్ అవుతాడు. మళ్లీ విజిల్ వేసుకుంటూ వెళ్లిపోతుంది ప్రభావతి.
మీనాకోసం స్వీట్స్, పూలు తీసుకొస్తాడు. తనకు స్వీట్ తినిపిద్దాం అనుకునేలోగా ప్రభావతి, శృతి, మనోజ్, రోహిణిలు ఒకరి తర్వాత ఒకరు వరుసగా హాల్లోకి వస్తుంటారు. ప్రభావతి వచ్చి వెళ్లిన తర్వాత శ్రుతి వచ్చి బిర్యానీ ఆర్డర్ పెట్టాను అంటుంది. అదే టైమ్ కి మళ్లీ వచ్చిన ప్రభావతి శ్రుతితో కూర్చుని బిర్యానీ తింటుంది. మీనాకు స్వీట్స్ తినిపిద్దాం అనుకునోలోగా మనోజ్, రోహిణి వస్తారు. స్వీట్ అక్కడే పెట్టి పడుకున్నట్టు నటిస్తాడు బాలు. కిచెన్ వైపు వెళుతూ స్వీట్స్ వాసన రావడంతో చూసి తినేస్తాడు. మీనా కోసం తీసుకొచ్చిన స్వీట్స్ మనోజ్ తినడంతో అప్సెట్ అవుతాడు బాలు. ఈ రోజు మనశ్సాంతి లేకుండా చేస్తున్నారని బాధపడతాడు బాలు.
శ్రుతి తెచ్చిన బిర్యానీ తినేసిన ప్రభావతి అర్థరాత్రి ఇబ్బందిపడుతుంటుంది. అర్థరాత్రి దయ్యంలా తిరుగుతున్నావేంటని అడుగుతాడు సత్యం. రాళ్లు తిన్నా అరిగిపోతాయని బిల్డప్ ఇచ్చాను కానీ ఇప్పుడు ఇలా అయింది అంటుంది. చిన్న పిల్లలా అర్థరాత్రి ఈ రేంజ్ లో తింటే అరుగుతుందా అని ఫైర్ అవుతాడు. అటు ఇటు తిరుగు అంటాడు. ఇదేమైనా మనోజ్ తిరిగే పార్కా చిన్న రూమ్..నేను హాల్లోకి వెళ్లి తిరుగుతానంటూ మళ్లీ విజిల్ వేస్తూ వెళుతుంది ప్రభావతి. మరోసారి మీనాను నిద్రలేపిన బాలు..కాసేపు కబుర్లు చెప్పు అంటాడు..ఇంతలో ప్రభావతి మళ్లీ రానేవస్తుంది.
ప్రభావతిని పిలిచిన శ్రుతి తల్లి ఫంక్షన్ కి బాలు రాకూడదు అనే కండిషన్ పెడుతుంది. బాలు ఫంక్షన్ కి రాకుండా చూసుకునే బాధ్యత మీదే అంటుంది. ఇంటికి వచ్చిన ప్రభావతి బాలు ఫంక్షన్ కి రాకూడదు అంటుంది. వాడు వస్తే గొడవ చేస్తాడని అడ్డుపడుతుంది. సరే అయితే నా కొడుకుని రావద్దన్న చోటుకి నేను కూడా రాను అంటాడు సత్యం. నా భర్తని వద్దన్నచోటుకి సిగ్గులేకుండా ఎలా వస్తాను నేను కూడా రానంటుంది మీనా. ఇంతలో అక్కడకు వచ్చిన శ్రుతి..బాలుమీనా కూడా వస్తేనే ఫంక్షన్ జరుగుతుందని మెలికపెడుతుంది. ప్రభావతి షాక్ అవుతుంది.