Chinni Serial Today Episode బాలరాజుకి 14 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. కావేరి, చిన్నిని తీసుకొని సరళ ఇంటికి వస్తుంది. ఇంట్లో ఉండనివ్వమని బతిమాలుతారు. పీటీ ఉషనే కావేరి అని తనకు తెలుసు అని సరళ చెప్పి మా ముగ్గురిని చంపే వరకు వదలరా.. ప్రపంచం దృష్టిలో కావేరి చనిపోయింది ఇప్పుడు మా దృష్టిలో చనిపోయింది. దాని మొగుడు జైలుకి పోయి చచ్చాడు. దాని కూతురు ఎక్కడ చచ్చిందో మాకు కూడా తెలీదు. ఇంక జీవితంలో మేం మీకు కనిపించం మీ ముఖాలు కూడా మాకు కనిపించవు గుర్తుంచుకోండి అని సరళ పిల్లల్ని తీసుకొని వెళ్లిపోతుంది. 

చందు వెళ్తూ వెనక్కి తిరిగి చిన్నిని చూసి ఏడుస్తూ వచ్చి హగ్ చేసుకుంటాడు. చిన్ని కూడా చందుని హగ్ చేసుకొని ఏడుస్తుంది. కావేరి ఏడుస్తుంది. సరళ కోపంగా వచ్చి చందుని విడిపించుకొని లాక్కొని తీసుకెళ్లిపోతుంది. పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్లిపోతుంది. కావేరి చిన్ని ఏడుస్తారు. పోలీస్‌ స్టేషన్‌ దగ్గరకు దేవా వస్తాడు. పోలీసులతో నేను నా మిత్రడు కాసేపు మాట్లాడుకోవాలి అని అంటాడు. అందరూ పక్కకి వెళ్తారు.

 దేవా బాలరాజుతో ఎలా ఉంది నా దెబ్బ.. నా పెళ్లి ఆపి నన్ను అత్తారింటికి పంపిస్తా అన్నావ్ ఇప్పుడు నువ్వు నీ అత్తారింటిలో 14 ఏళ్లు ఉంటావ్ అంటాడు. ఖర్మ వదలదు అని బాలరాజు అంటే నీకు నీ పెళ్లానికి నీ కూతురికి నేనేంటో చూపిస్తా. అతి తొందర్లోనే వాళ్లిద్దరినీ ఒకేసారి చంపి ఒకే చితిలో మంట పెడతా అని దేవా అంటాడు. దాంతో బాలరాజు నా భార్య పిల్లలకు ఏమైనా అయితే జైలు నుంచి పారి పోయి అయినా ముక్కలు ముక్కలు నరుకుతా అని చెప్తాడు. ఇక బాలరాజుని సెల్‌లో వేస్తారు. 

దేవా తనలో తాను బాలరాజు సాక్ష్యాలు చూపించలేదు అంటే వాడి దగ్గర లేవన్నమాట. వాడు ఇంకా సాక్ష్యాలు సంపాదించే పనిలో ఉన్నాడన్నమాట. వీడిని చంపేస్తే నాకు ఏ ప్రాబ్లమ్ ఉండదు అనుకొని సీఐని పిలిచి బాలరాజుని జైలుకి మార్చుతారు అని అడిగి రేపే అని సీఐ చెప్పడంతో తన ప్లాన్ చెప్తాడు. బాలరాజు మనసులో చిన్ని, కావేరిలను చివరి సారి చూడాలని ఉందని అనుకుంటాడు. చిన్ని తల్లితో అమ్మ నాన్నని పోలీస్ స్టేషన్ నుంచి జైలులో వేస్తారు కదా ఈ లోపు ఒకసారి చూద్దాం అమ్మా అని కావేరితో చెప్తుంది. ఇద్దరూ పోలీస్ స్టేషన్‌కి వెళ్తారు. 

బాలరాజుని సెంట్రల్ జైలుకి తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేస్తారు. బాలరాజుని ఫారెస్ట్‌కి తీసుకెళ్తున్నాం అని సీఐ వేరే పోలీస్‌తో చెప్తుంటే కానిస్టేబుల్ శంకరం వింటాడు. ఏదో ప్లాన్ చేశారని అనుకుంటాడు. బాలరాజుని తీసుకెళ్లడం చూసి అనుమానమే లేదు బాలరాజు మీద ఏదో ప్లాన్ చేశారని అనుకుంటాడు. ఇంతలో కావేరి, చిన్ని వచ్చి బాలరాజుని కలవాలి అంటే సెంట్రల్ జైలుకి తరలిస్తున్నారని చెప్తాడు. కావేరి వాళ్లు సెంట్రల్ జైలుకి వెళ్లాలి అనుకుంటే బాలరాజుని ఫారెస్ట్‌కి తీసుకెళ్తున్నారని ఏదో ప్లాన్ చేశారని అనుమానంగా ఉందని విషయం చెప్తాడు. కావేరి, చిన్ని బయల్దేరుతారు. 

మహి ఇంటికి డల్‌గా వస్తాడు. లంచ్ కూడా తినడు. ఏమైందని ప్రమీల అడిగితే చిన్ని రాలేదని చెప్తాడు. దేవా వచ్చి మహి మీద సీరియస్ అయితే నాగవల్లి ప్రేమగా ఓదార్చి తినేలా చేస్తుంది. దేవా నాగవల్లితో చిన్ని కోసం ఎలా అయిపోతున్నాడో చూశావా చిన్ని పిచ్చి వీడికి పెరగక ముందే వాళ్ల స్నేహం కట్ చేయాలి అంటాడు. అంతా నేను చూసుకుంటానని నాగవల్లి అంటుంది. బాలరాజుని పోలీసులు ఫారెస్ట్‌కి తీసుకెళ్తారు. బాలరాజుకి అనుమానం వస్తుంది. పోలీసులు బలవంతంగా బాలరాజుని దింపుతారు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని బాలరాజు అడుగుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: లక్ష్మీకి జైలులో చిత్రహింసలు.. సూపర్ ఉమెన్‌తో అంబిక 60 లక్షల డీల్!