Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode అఖిల్ మర్డర్ కేసులో కనక మహాలక్ష్మీని పోలీసులు అరెస్ట్ చేస్తారు. విహారి, కనకం తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌కి వెళ్తారు. లక్ష్మీని వదిలేయమని ఆదికేశవ్ పోలీస్ అధికారిణి కాళ్లు కూడా పట్టుకుంటారు. లక్ష్మీ నేనేం తప్పు చేయలేదు అని అరవడంతో విహారి ఎదురుగానే ఎస్‌ఐ లక్ష్మీని కొడుతుంది. విహారి ప్రశ్నించడంతో మళ్లీ కొడుతుంది. దాంతో విహారి ఎస్‌ఐ మీద చేయి ఎత్తుతాడు.

ఎస్‌ఐ విహారి కాలర్‌ పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్లి ఎక్కువ చేస్తే మక్కెలు ఇరుస్తా అంటుంది. లక్ష్మీని తీసుకెళ్లి జైలులో వేస్తారు. నా బిడ్డని మేమే ఎప్పుడు కొట్టలేదు మా ఎదురుగానే కొట్టారని ఆదికేశవ్, గౌరీ ఏడుస్తారు. విహారి ఆదికేశవ్, గౌరీలను బలవంతంగా ఆటోలో హోటల్‌కి పంపిస్తాడు. తన మీద నమ్మకం ఉంచమని చెప్పి పంపుతాడు. ఆదికేశవ్, గౌరీలు తమ కూతుర్ని కాపాడమని విహారిని రెండు చేతులు జోడించి దండం పెడతారు. ఎస్ఐకి అంబిక కాల్ చేస్తుంది. తనని తాను పరిచయం చేసి మీకు ఎంత కావాలి అంటే అంత ఇస్తా అని అంటుంది. ఎస్‌ ఐ అంబికను తిడుతుంది. 

అంబిక ఎస్‌ఐని కూల్ చేసి 60 లక్షలకు భేరం పెట్టుకుంటుంది. లక్ష్మీని చంపేయమని చెప్తుంది. ఎస్‌ఐ అడ్వాన్స్ పంపమని అంటుంది. విహారి ఇంటికి వచ్చి లక్ష్మీ మీద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని చెప్తాడు. అంబిక అందరితో అది మామూలుది కాదు మీరు దాని కోసం ఎందుకు అంత బాధ పడిపోతున్నారు అని అంటుంది. ఇక పద్మాక్షి ఇంతకు ముందు దాని గదికి వాడిని రప్పించుకుంది. దొరికిపోయాడు. ఇప్పుడు మళ్లీ రప్పించుకుంది ఇప్పుడు ఇద్దరి మధ్య ఏం జరిగిందో వాడిని ఏసేసింది అని అంటుంది. విహారి పద్మాక్షి మీద అరచి మీకు ఓ కూతురు ఉంది ఆలోచించి మాట్లాడండి అంటాడు. నా కూతురికి దానికి పోలికా అని పద్మాక్షి అంటుంది. దానికి అంబిక సహస్ర చక్కగా పెళ్లి చేసుకొని భర్తతో ఉంటుంది. కానీ ఆ లక్ష్మీ భర్తని వదిలేసి ఊర్ల మీద తిరుగుతుంది అని అంటుంది. ఇప్పటి వరకు ఈ ఇంటికి పోలీస్‌లు వచ్చారా. కానీ మర్డర్ జరిగింది అవేమీ మీకు అర్థం కాదు అని అంటుంది. 

విహారి మీరు మానవత్వం మర్చిపోయి మాట్లాడుతున్నారని అంటాడు. సహస్ర ఆ గొడవని ఆపుతుంది. విహారి గదికి వెళ్లి డబ్బు తీసుకొని ఓ లాయర్‌కి కాల్ చేస్తాడు. అతన్ని పోలీస్‌ స్టేషన్‌కి రమ్మని పిలుస్తాడు. సహస్ర విహారిని అడ్డుకుంటే నాకు పని ఉంది నేనే వెళ్లాలి అని అరిచి వెళ్లిపోతాడు. లక్ష్మీకి ఎలా అయినా శిక్ష పడుతుంది వెళ్లు బావ వెళ్లు అని సహస్ర అంటుంది. రాత్రి లక్ష్మీకి పోలీసులు అన్నం ఇస్తారు. నాకేం వద్దు అని లక్ష్మీ ప్లేట్ తోసేస్తుంది. కానిస్టేబుల్ లక్ష్మీతో ఎంత పొగరే నీకు అని లక్ష్మీని కొడుతుంది. ఇలా కొట్టడం నేరం అని లక్ష్మీ అంటే కానిస్టేబుల్ మళ్లీ కొడుతుంది. ఎస్‌ఐ వచ్చి ఇలా కొడితే అన్నం తింటారా అని చందమామ రావే జాబిల్లి రావే అని పాటలు పాడుతూ లక్ష్మీ నోట్లో కుక్కేస్తుంది. కారం అన్నం కావడంతో లక్ష్మీ నీరు నీరు అని ఏడుస్తుంది. మంచి నీరు ఇవ్వమని బతిమాలుతుంది. 

ఎస్‌ఐ నీటిని లక్ష్మీ మొఖం మీద కొడుతుంది. ఎస్‌ఐ కూడా లక్ష్మీని కొడుతుంది. విహారి, లాయర్ పోలీస్ స్టేషన్‌కి వస్తారు. లక్ష్మీని కలవాలి అని విహారి అంటే అమెను ఎవరూ కలడానికి వీల్లేదు అంటుంది. లాయర్ వచ్చి న క్లైంట్‌ని కలవాలి అంటారు. ఎస్‌ఐ ఒప్పుకోకపోతే లాయర్‌ తన క్లైంట్‌ని ఎప్పుడైనా కలవొచ్చు అని ఎస్ఐని రిక్వెస్ట్ చేస్తారు. దాంతో ఎస్‌ఐ లక్ష్మీని వాళ్లని కలవనిస్తుంది. లక్ష్మీ విహారిగారు అంటూ విహారిని హగ్ చేసుకొని ఏడుస్తుంది. తర్వాత విహారిని హగ్ చేసున్నాంటి అని భయపడి దూరంగా జరుగుంది. ఏంటి వీళ్లు నిన్ను కొట్టారా ఆ ఎస్‌ఐ పని చెప్తా అని విహారి కోపంగా వెళ్తే లాయర్‌ ఆపి ఇప్పుడు మీర ఇష్యూ చేస్తే ఇంకా ఇబ్బంది పెడగారు అని అంటారు. లక్ష్మీకి విషయం అడిగి లాయర్ ఆ రోజు జరిగింది మొత్తం మళ్లీ తెలుసుకుంటారు. 

లాయర్‌ విహారితో ఆ రోజు అతనితో పాటు మరెవరో వచ్చారు. వాళ్లు అతన్ని పొడిచారు. ఎంత పెద్ద వ్యక్తి అయినా ఏదో పొరపాటు చేస్తారు అది తెలుసుకుంటే మనం లక్ష్మీని బయటకు తీసుకురావొచ్చు అంటారు. టైం అయిపోయిందని లాయర్‌, విహారి వెనక్కి వచ్చేస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: రాఘవని కలిసి ఎమోషనలైన ఆనంద్.. లొకేషన్‌కి చేరుకున్న రాజు, రూపలు.. ఏం జరుగుతుంది?