డాక్టర్ బాబు దూకుడును మిగతా సీరియల్ ఇప్పట్లో అందుకోవడం చాలా కష్టం ఏమో!? 'స్టార్ మా' ఛానల్ సీరియల్స్ మాత్రమే కాదు... తెలుగు టీవీ ఎంటర్టైన్మెంట్ ఛానళ్లలో మిగతా సీరియల్స్ కూడా 'కార్తీక దీపం 2' నవ వసంతం టీఆర్పీని అందుకోవడం కష్టం అనిపిస్తుంది. టీఆర్పీ రేటింగ్స్ లిస్టులో ప్రతి వారం మొదటి స్థానంలో నిలిచే నిరుపమ్ పరిటాల 'కార్తీక దీపం 2' సీరియల్ ఈ వారం కూడా ఫస్ట్ ప్లేస్ ఎవరికీ ఇవ్వకుండా తన దగ్గర ఉంచుకుంది. దానికి 13.16 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. మరి, మిగతా స్థానాలలో ఏయే సీరియల్స్ ఉన్నాయి? స్టార్ మా, జీ తెలుగు ఛానళ్లలో సీరియల్స్ రేటింగ్స్ ఎలా ఉన్నాయి? అనేది చూస్తే...

అన్‌స్టాపబుల్ డాక్టర్ బాబు...మొదటి స్థానంలో 'కార్తీక దీపం 2'!'స్టార్ మా' ఛానల్‌లో సూపర్ డూపర్ హిట్ సీరియల్ 'కార్తీక దీపం ‌2‌ నవ వసంతం' ఈ వారం 13.16 టీఆర్పీ రేటింగ్ సాధించింది. దాని తర్వాత స్థానంలో బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్, సీనియర్ హీరోయిన్ ఆమని నటించిన 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' నిలిచింది ఆ సీరియల్ టీఆర్పీ 12.16. ఇక, మూడో స్థానంలో 12.02 టీఆర్పీతో 'ఇంటింటి రామాయణం', నాలుగో స్థానంలో 11.76 టీఆర్పీతో 'గుండె నిండా గుడిగంటలు' నిలిచాయి‌. ఇక 5వ స్థానంలో 8.42 టీఆర్పీతో 'చిన్ని' సీరియల్ ఉంది.

'స్టార్ మా'లో టీఆర్పీ రేటింగ్స్ పరంగా టాప్ 5 సీరియల్స్‌ను పక్కన పెట్టి... మిగతా ఐదు స్థానాల్లో ఏం ఉన్నాయనేది చూస్తే? 'నువ్వుంటే నా జతగా' (8.36), 'బ్రహ్మముడి' (7.23), 'పలుకే బంగారమాయెనా‌' (6.39), 'నిన్ను కోరి' (6.05), 'మామ గారు' (5.98) టీఆర్పీ సాధించాయి. 'పాపే మా జీవనజ్యోతి' సీరియల్ 5.31 టీఆర్పీ రాబట్టింది. 

మళ్లీ మొదటికి వచ్చిన మేఘ సందేశం...మూడో స్థానానికి పడిన చామంతి - మరి మధ్యలో!?జీ తెలుగులో సీరియల్స్ టీఆర్పీ విషయానికి వస్తే... మొదటి మూడు స్థానాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉన్నాయి. గత వారం ఒక సీరియల్ ఉంటే ఈ వారానికి మరొక సీరియల్ మొదటికి వస్తుంది. మరుసటి వారానికి మరో సీరియల్ ఉంటుంది.

Also Readపవన్ సన్నిహితులే టార్గెట్... జగన్ కోసం సినిమా ఇండస్ట్రీనీ వదల్లేదు..‌. ఆ సెలబ్రిటీలు ఫోన్ ట్యాపింగ్ బాధితులే!?

'జీ తెలుగు'లో ఈ వారం 6.68 టీఆర్పీతో 'మేఘ సందేశం' మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత 6.75 టీఆర్పీతో 'జగద్ధాత్రి' నిలిచింది. మూడో స్థానంలో 6.59 టీఆర్పీతో 'చామంతి' ఉంది. మొదటి మధ్య వ్యత్యాసం చాలా తక్కువ ఉండడం గమనార్హం.‌ 

'జీ తెలుగు'లో టాప్ 3 పక్కన పెట్టి ఆ తర్వాత ఏమున్నాయి? అనేది చూస్తే... 'లక్ష్మీ నివాసం' (5.61), 'అమ్మాయి గారు' (4.59), 'గుండమ్మ కథ' (4.30), 'ఉమ్మడి కుటుంబం' (4.09), 'కలవారి కోడలు కనకమహాలక్ష్మి' (3.99), 'దీర్ఘ సుమంగళీభవ' (3.84) టీఆర్పీ సాధించాయి. ప్రతి వారం తరహాలో ఈ వారం కూడా ఈటీవీ, జెమినీ టీవీ సీరియల్స్ స్టార్ మా, జీ తెలుగు కింద ఉన్నాయి. ఐదు కంటే ఎక్కువ టీఆర్పీ సాధించిన సీరియల్స్ ఆ రెండు ఛానళ్లలో లేవు.

Also Readపవన్ సినిమాలకు సోలో రిలీజ్ దక్కకుండా చేస్తున్నారా? ఛాంబర్ ఎందుకు సైలెంట్‌గా ఉంటోంది?