Meghasandesam Serial Today Episode: కేపీ కోసం మొక్కు తీర్చుకోవడానికి స్వామిజీ చెప్పిన అమ్మవారి గుడికి వెళ్లుంది శారద. మెట్ల దగ్గర కొబ్బరికాయ కొట్టబోతుంటే మీరా కూడా వచ్చి కొబ్బరికాయ కొడుతుంది. మీరాను చూసిన శారద షాక్ అవుతుంది. మీరా అదేమీ పట్టించుకోదు.
పంతులు: అమ్మా ఎంతో కష్టం వస్తే కానీ ఈ అమ్మవారి దగ్గరకు వచ్చి మొక్కులు తీర్చుకోరమ్మా భక్తులు. మరి మీకు వచ్చిన కష్టం ఏంటో నాకు తెలియదు కానీ ఆ అమ్మవారు మీ కష్టం తీర్చాలని మనఃస్పూర్తిగా ప్రార్థిస్తున్నాను అమ్మా.. అయితే ఈ అమ్మవారు అంత సులువుగా కష్టం తీర్చరు అమ్మా కళ్లకు గంతలు కట్టుకుని నైవేద్యాన్ని తలపై పెట్టుకుని కొండ ఎక్కాలమ్మా..? ఎక్కిన తర్వాత అమ్మవారి ఎదురుగా నిలబడి కళ్లకు గంతలు తీస్తే ఎదురుగా అమ్మవారు మాత్రమే కనబడాలి. అలా కాకుండా మీరు వెళుతున్న దారిలో తలపై ఉన్న నైవేద్యం చేజారినా.. కళ్లకు గంతలు ఊడినా మీరు మొక్కుకున్న మొక్కుకు విరుద్దంగా జరగొచ్చు అమ్మా..
మీరా: అమ్మో అంటే ప్రాణాలతో పోరాడుతున్న మా వారికి ప్రాణాపాయం జరగొచ్చా..?
పంతులు: ఆ మాట నా నోటితో నేను అనకూడదమ్మా..? కానీ మీ భయం నిజం అవుతుందమ్మా.. అంత భయపడుతున్న మీరు ఈ మొక్కు తీర్చకపోవడమే మంచిది అమ్మ
శారద: మీరా గారు ఇద్దరిలో ఎవరు మొక్కు తీర్చుకున్న ఆయన క్షేమం కోసమే కదా..? నేను ఆ మొక్కు తీర్చుకుంటాను మీరు ఆ అమ్మవారిని దర్శించుకోండి చాలు.
మీరా: దీని ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు శారద గారు. మీకే దైవ భక్తి ఉంది. మాకు లేదా..? మీకు తాళి కట్టిన భర్తే నాకు తాళి కడితే మీరు ప్రాణాలకు తెగించి మొక్కు తీర్చుకుంటారా..? నేను ఆయన ప్రాణాన్ని లెక్క చేయలేదని చెప్పాలనుకుంటున్నారా..?
చెర్రి: అమ్మా..?
భూమి: అది కాదు అత్తయ్యా
మీరా: నువ్వు ఆగు భూమి ఈ మేనత్త కంటే ఆ కానత్త అంటేనే నీకు మమకారం. నువ్వు ఎక్కువగా గుర్తు పెట్టుకో భూమి మీ మామయ్యను ఆవిడ కంటే నేనే ఎక్కువగా ప్రేమించాను. ఆయన కోసం నేను ఈ మొక్కు తీర్చుకుని తీరతాను.
శారద: ఇద్దరం ఆయన క్షేమం కోసమే కదా భూమి ఇద్దరం మొక్కు తీర్చుకుంటే మరీ మంచిది కదా..?
మీరా: నాకు ఎవరి సలహాలు, సహకారాలు అవసరం లేదు. పంతులు గారు ఆ మొక్కు విధానాలేంటో కొంచెం పూర్తిగా వివరంగా చెప్పరా..?
పంతులు: మీ సమస్యేంటో నాకు పూర్తిగా అర్తం అయింది. పైన ఉన్న అమ్మవారికి మనఃస్పూర్తిగా దండం పెట్టుకోండి అమ్మా
అని చెప్పి ఇద్దరిని చేత మొక్కు తీర్చుకోమని చెప్తాడు పంతులు. ఇద్దరూ కళ్లకు గంతలు కట్టి కొండమీదకు తీసుకెళ్తుంటాడు. ఇంతలో మధ్యలో పెద్ద పాము అడ్డం వస్తుంది. దీంతో మీరా నెత్తి మీద ఉన్న మొక్కు కింద పడిపోతుంది. కళ్లకు ఉన్న గంతలు ఊడదీసుకుంటుంది. తర్వాత శారద నిష్టగా మొక్కు చెల్లిస్తుంది. అమ్మవారిని భక్తితో దర్శించుకుని తన మనసులోని బాధను చెప్పుకుంటుంది.
మరోవైపు హాస్పిటల్‌లో ఉన్న కేపీ స్పృహలోకి వస్తాడు. అందరూ హ్యాపీగా ఫీలవుతారు. తర్వాత కేపీని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తారు. ఇంటికి వెళ్లాక్ భూమి ఒక్కతే కేపీ దగ్గరకు వెళ్లి పాయిజన్ తీసుకోవాల్సిన అవసరం ఏంటని అడుగుతుంది. దీంతో అపూర్వ, శరత్ చంద్ర పెట్టిన షరత్తు గురించి చెప్తాడు కేపీ. దీంతో భూమి షాక్ అవుతుంది. శరత్ చంద్రకు తనపై ప్రేమ లేదా అని బాధపడుతుంది. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!