Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథున వద్దు అన్నా దేవా నేత్రకు సాయం చేయడానికి వెళ్తాడు. నేత్ర దేవాతో నువ్వు అదృష్టవంతుడివి మీకు అందమైన భార్య వచ్చింది అని అంటుంది. మీకు పెళ్లి అయి ఎన్ని నెలలు అవుతుంది అంటూ నేత్ర చాలా ప్రశ్నలు వేస్తే దేవా నేత్రతో అసలు తను నా భార్యనే కాదు యాక్సిడెంటల్‌గా తన మెడలో తాళి కట్టాను అని దేవా అంటాడు.
నేత్ర తనలో తాను ఇద్దరి మధ్య గ్యాప్ ఉంది మనకు ఛాన్స్ ఉంది అనుకుంటుంది. మరోవైపు మిథున దేవా షర్ట్ ఇస్త్రీ చేస్తూ నేను వెళ్లొద్దని చెప్తున్నా వెళ్తావా రా చెప్తా నీకు వాత పెట్టకపోతే నా పేరు మిథునే కాదు అని అంటుంది. దేవా వచ్చి బండి తాళం అడుగుతాడు. మిథున ఎదురింటి అమ్మాయికి అడగమని అంటుంది. దేవా కోప్పడితే ఐరెన్ బాక్స్ దేవా ముఖానికి దగ్గరగా పెట్టి మాట్లాడుతుంది. ఏయ్ కాలుతుందే అని దేవా అంటే నాకు ఇంతకంటే ఎక్కువ కాలుతుంది వెళ్లొద్దు అని సైగ చేసిన పెద్ద హీరోలా వెళ్తావా అని అంటుంది. మీ అన్నలు పెళ్లాల మాటలు విని ఊరుకుంటే నువ్వు ఏంటి నా మాట వినకుండా వెళ్లావు ఇంకోసారి పెళ్లాం మాట వినకుండా వెళ్తావా చెప్పు చెప్పు అని మీదకు వెళ్తుంది. దేవా చేయి పట్టుకోవడంతో ఇద్దరూ ఒకర్ని ఒకరు చూసుకుంటారు. తర్వాత దేవా వెళ్లిపోతాడు. దేవా వెళ్లి షర్ట్ తీసుకొని రెడీ అయి మిథునని చూస్తూ వెళ్తుంటే మిథున దేవా చేయి పట్టుకొని ఆపుతుంది. ఇంకోసారి నా మాట కాదని వెళ్తే ఈ సారి నిజంగానే వాత పెడతాను అని అంటుంది.
దేవా మిథునతో నేను వెళ్తే నీకేంటే ప్రాబ్లమ్ అని అంటే భర్త వేరే అమ్మాయితో మాట్లాడితే ఏ అమ్మాయికైనా నచ్చదు కదా అని అంటుంది. దాంతో దేవా దొరికావే నేను ఆ అమ్మాయితో మాట్లాడితే నీకు నచ్చదు కదా కచ్చితంగా మాట్లాడుతా అని చెప్పి గ్యారేజ్‌కి వెళ్లిపోతాడు. దేవా ఫ్రెండ్స్ దేవాకి కంగ్రాట్స్ చెప్తారు. వదిన మెడలో నల్లపూసలు వేశావంటే ఓ ఇంటి వాడివి అయిపోయావని అంటారు. నీది వదినది జన్మ జన్మల బంధం హనీమూన్‌కి వెళ్లండి అన్నీ సెట్ అయిపోతాయి అని అంటే దేవా ఫ్రెండ్స్‌ని కొట్టడానికి వెళ్తాడు.
దేవా గ్యారేజ్ దగ్గరకు మిథున తండ్రి హరివర్దన్ వస్తాడు. దేవా కిందకి వెళ్తాడు. జడ్జి దేవాతో నీకు వారం టైం ఉందిరా అది కూడా నేనే నీకు ఫిక్స్ చేశాను. ఈ వారంలో నీకు నచ్చిన చోట తిరిగి నచ్చిన ఫుడ్ తిను ఎంజాయ్ చేయ్ అందుకు డబ్బులు కూడా నేనే ఇస్తా. తర్వాత నీకు ఈ అవకాశం ఉండదు. నా కూతురి కోసం నేనేం చేస్తాను నీకు ఈ పాటికి క్లారిటీ వచ్చేసుంటుంది కదా అంటే దేవా చంపేస్తారు అని అంటాడు. నీకు నా ఆస్తి కావాలి అంటే ఎంత అయినా ఇచ్చేదాన్ని కానీ నువ్వు నా కూతురి మెడలో తాళి కట్టావ్ నా కూతురు నాదగ్గరకు రాకుండా అడ్డు పడుతున్నావ్ అందుకే నీ అడ్డు తొలగించుకుంటా అంటాడు.
దేవా ఆయనతో అయిపోయిందా సార్ ఇప్పుడు నేను చెప్పొచ్చా నేను రౌడీనే కానీ సంస్కారంతో పెరిగాను. డబ్బు కోసం నేను మీ అమ్మాయి మెడలో ఆ తాడు కట్టలేదు. ఆ రోజు జరిగిన గొడవలో మీ అమ్మాయి నోరు మూయించడానికి అలా చేశాను. నేను చేసింది తప్పే మీరేం శిక్ష వేసినా భరిస్తాను అంటాడు. నాకు మీ ఆస్తి అవసరం లేదు ప్రాణభయం లేదు మీ అమ్మాయి అంటే అస్సలు ఇష్టం లేదు.. నల్లపూసలు కూడా నేను విసిరితే వెళ్లి తన మెడలో పడ్డాయి. మీ అమ్మాయి మీ ఇంటికి రావాలి అంటే ఏం చేయాలి అంటే అది చేస్తా.. తను ఎంతలా మా ఇంట్లో ఉన్న నా మనసు మారదు.. సార్ మన ఇద్దరిదీ ఒకే పరిస్థితి మీరు అటు నుంచి మీ అమ్మాయిని తెచ్చుకోవాలి అని చూస్తున్నారు. నేను ఇటు నుంచి పంపాలి అని చూస్తున్నా అంటాడు. మన ఇద్దరి ఆలోచన ఒకటే కానీ దారులు వేరు. మీ దగ్గర ఏమైనా ప్లాన్స్ ఉంటే చేయండి లేదంటే నాకు ఏదైనా ప్లాన్ చెప్పండి నేను చేస్తా అంటాడు.
దేవా ఇంట్లో భోజనాలకు ఏర్పాటు చేస్తారు. శారద అందరికీ భోజనాలకు పిలుస్తుంది. రంగం పక్కనే కాంతం కూర్చొంటే నీకు ఎన్ని సార్లు చెప్పాలి మగవాళ్లు తినేటప్పుడు తినకూడదు తర్వాత తినాలి అంటే ఆకలి అత్తయ్య అని అంటుంది. రంగం కూడా కాంతానికి సపోర్ట్ చేస్తాడు. నీ ఇద్దరి తోటికోడళ్లు పని చేస్తుంటే నువ్వు ఏం చేయకుండా ఉండటానికి సిగ్గులేదా అని అంటుంది. నాకు తెలిసి ఈ ఇంటికి ఇద్దరే కోడళ్లు అత్తయ్యగారు అని కాంతం అంటే నువ్వు కోడలివి కాదా అని శారద అంటుంది. కాంతం షాక్ అయిపోతుంది. ఇక సత్యమూర్తి వస్తే ప్రమోదిని వడ్డిస్తుంది. దేవా రావడంతో మిథున మీరు అందరితో కలిసి తినండి రండి అంటుంది. దేవా కోపంగా చూస్తాడు.
దేవా తల్లితో అమ్మ నీకు నేనంటే నిజంగా ఇష్టం ఉంటే తనని ఇంట్లో నుంచి పంపేయ్ అంటాడు. తను నీ భార్యరా అని శారద అంటే నేను ప్రాణాలతో ఉండాలి అంటే తనని పంపేయ్ అంటాడు. మొన్న వీళ్ల అన్నయ్య నన్ను చంపాలని చూశాడు. ఇప్పుడు వీళ్ల నాన్న వచ్చి ఏకంగా ప్రాణాలు తీసేస్తా అని నాకే చెప్పాడు అంటాడు. శారద ఇప్పుడు అవన్నీ ఎందుకు అంటే నాకు ఏమైనా అయినా పర్లేదు కానీ తను ఇక్కడే ఉండాలి అంతే కదా అంటాడు. కాంతం అత్తతో నేను ఇదే ప్రశ్న చాలా సార్లు అంటే నా నోరు మూయించారు ఇప్పుడు దేవా అడుగుతున్నాడు చెప్పు అంటుంది. తను ఇక్కడే ఉంటే నా ప్రాణాలకు ప్రమాదం ఉంది నీ కొడుకు ప్రాణాలతో ఉండాలా లేదా నువ్వే తేల్చుకో అంటాడు. నాకేం అయినా నాకు పర్లేదు నా మీద కోపంతో మీ వాళ్లు నా వాళ్లకి ఏమైనా చేస్తారనే భయం నాకు ఉంది అంటాడు. సత్యమూర్తి కలగజేసుకొని నాకు తెలిసి మొదటి సారి వీడు మంచిగా ఆలోచించాడు. కుటుంబం ప్రాణాల కోసం ఆలోచించాడు. ఒక కూతురివి అనుకొని చెప్తున్నా వెళ్లిపో అమ్మా నీ భవిష్యత్‌తో పాటు మా ప్రాణాలు ఉంటాయి అంటాడు. తెల్లారే సరికి నువ్వు మా కంటికి కనిపించకూడదు అని దేవా అంటాడు. ఇన్ని అన్నా నువ్వు ఉంటే సిగ్గు మానం మర్యాద వదిలేసినట్లే దున్నపోతు మీద వాన పడినట్లే అని కాంతం అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: రాఘవని కలిసి ఎమోషనలైన ఆనంద్.. లొకేషన్‌కి చేరుకున్న రాజు, రూపలు.. ఏం జరుగుతుంది?