Nindu Noorella Saavasam Serial Today Episode: భాగీ వాళ్లను గుడికి తీసుకెళ్లిన మనోహరి ఎవ్వరికి కనిపించకుండా చిత్రను పక్కకు తీసుకెళ్తుంది. మనోహరిని చూసిన చిత్ర కోపంగా వాళ్లను ఎందుకు గుడికి తీసుకొచ్చావు అని మనోహరిని తిడుతుంది.
మను: నేనెందుకు తీసుకొచ్చాను గుడికి వెళ్తున్నాము మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేయ్ అని వాళ్లే వచ్చారు. అసలు నువ్వు పెళ్లి చేసుకోకుండా ఏం చేస్తున్నావు
చిత్ర: ఏంటి చేసుకునేది
అంటూ గుడిలో జరిగిన లవర్స్ గొడవ, వినోద్ రియాక్ట్ అయిన తీరు గురించి చెప్తుంది.
మను: నేను చెప్పాను కదా వినోద్ పేరెంట్స్‌కు తెలియకుండా పెళ్లి చేసుకోడు అని వాళ్లకు నిజం తెలిస్తే వాళ్లు నిన్ను ఇంట్లోకి కూడా రానివ్వరు. అమర్ నీ గతాన్ని వెతుక్కుంటూ వెళ్లాడు. ఇక్కడ సమస్యలే తప్పా సమాధానాలు ఎక్కడున్నాయో నాకు తెలియడం లేదు
చిత్ర: అవి తెలియకే కదా నేను నీకు ఫోన్ చేసింది. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు మను ఫ్లీజ్
మనోహరి: సమస్యను ఇంతదాకా తీసుకొచ్చావు ఇప్పుడు ఏం చేద్దాం అంటే నాకు మాత్రం ఏం అర్థం అవుతుంది చెప్పు. నాకు ఏం అర్థం కావడం లేదు. అదిగో ఆ రాక్షసి ఇటే వచ్చేస్తుంది పద వెళ్దాం…
చిత్ర: సరే కానీ మను ఏదైనా ఐడియా చెప్పు
అమర్ మనోహరి కాల్ చేస్తాడు. మను భయంగా చూస్తుంది.
చిత్ర: మను కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయ్
మను: అలాగే.. హలో ఆ చెప్పు అమర్
అమర్: గుడిలోనే ఉన్నావా మనోహరి
మను: అవును అమర్ ఏమైంది
అమర్: చిత్ర ఒక ప్రాడ్ మనోహరి తన మాట, మంచి అంతా ఒక అబద్దం ఆ అబద్దాన్ని చూపించే వినోద్ తనని ప్రేమించేలా చేసింది. ఇప్పుడు ఇంకో మోసంతో వినోద్‌కు భార్య అవ్వాలని చూస్తుంది. వినోద్‌కు నిజం చెప్పడానికి చిత్రను దత్తత తీసుకున్న తల్లిదండ్రులను తీసుకుని వస్తున్నాను
మను: ఏంటి అమర్ ఏంటి నువ్వు చెప్పేది నిజమా
అమర్: అవును మనోహరి చిత్ర వినోద్‌కు సరైంది కాదు. నేను వచ్చే వరకు చిత్రకు డౌటు రాకుండా తనతో మాట్లాడుతూ ఉండు. ఎలాగోలా ఆ పెళ్లి జరగకుండా చూసుకో..
మను: సరే అమర్ నేను చూసుకుంటాను. చిత్ర ఇంత మోసగత్తే అని నాకు కూడా తెలియదు. సరే అమర్ నువ్వు రా నేను మేనేజ్ చేస్తాను
అమర్: పది నిమిషాల్లో అక్కడ ఉంటాను
మను: విన్నావు కదా చిత్ర నువ్వు ఇక్కడి నుంచి పారిపోవడానికి పది నిమిషాలే టైం ఉంది. అమర్ ఇక్కడికి రాక ముందే పారిపో
చిత్ర: ఎక్కడికి వెళ్లాలి మను మళ్లీ ఐదుకు పదికి అడుక్కోవాలా..? దొంగతనాలు చేయాలా..? ఏది ఏం జరిగినా వినోద్‌ను నేను పెళ్లి చేసుకుని తీరాలి
మను: ఏయ్ నీకు పిచ్చి పట్టిందా..? అమర్ తన కుటుంబం జోలికి వస్తే వదలడని చెప్పాను కదా
చిత్ర: అదే నా ధైర్యం కూడా నేను చిత్రగా ఉంటేనే కదా ప్రాబ్లమ్ చిత్ర వైఫ్ ఆప్ వినోద్ అయితే బావగారు నన్నేం చేయలేరు. వినోద్ ఎదురుగా నిజం చెప్పలేరు. ఇప్పుడు నా గతం నన్ను వెతక్కుంటూ వచ్చేలోపు నేను వినోద్‌తో తాళి కట్టించుకోవాలి
ఇంతలో అక్కడకు వినోద్ వస్తాడు.
వినోద్: చిత్ర నువ్వు ఇక్కడ ఉన్నావా..? మనోహరి గారు మీరు ఎప్పుడు వచ్చారు
మను: ఇప్పుడే వచ్చాను వినోద్.. నేనే కాదు భాగీ, ఆంటీ, అంకుల్ కూడా వచ్చారు. భాగీకి నువ్వు ఇక్కడికి వచ్చావని తెలిసి నిన్ను డిస్టర్బ్ చేయాలని వాళ్లను తీసుకుని ఇక్కడకు వచ్చింది
అని మనోహరి చెప్పగానే వినోద్ కోపంగా భాగీని తిడతాడు. చిత్ర వెంటనే వినోద్ ను తీసుకుని లోపలికి వెళ్తుంది. చిత్ర కంగారుగా ఉండటం చూసిన వినోద్ ఏమైందని అడుగుతాడు. చిత్ర వెంటనే తన దగ్గర ఉన్న తాళి తీసి వెంటనే నన్ను పెళ్లి చేసుకో వినోద్ లేకపోతే నన్ను మర్చిపో అంటూ బ్లాక్‌మెయిల్ చేస్తుంది. దీంతో వినోద్ తాళి తీసుకుని చిత్ర మెడలో కట్టబోతుంటే.. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!