Bonalu Festival 2024 In ETV Show: బోనాలు అంటే తెలంగాణ, తెలంగాణ అంటే బోనాలు. ప్రతి ఏడాది హైదరాబాద్ సహా తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో జరిగే బోనాలు జాతర కోసం దేశ విదేశాల నుంచి ఈ గడ్డ మీద జన్మించిన ప్రజలతో సహా ఇతరులూ తరలి వస్తారు. గోల్కొండలో ఆదివారం (జూన్ 7న) బోనాలు షురూ అయ్యాయి. ప్రముఖ టెలివిజన్ నెట్వర్క్ ఈటీవీ సైతం 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో బోనాలను ఘనంగా సెలబ్రేట్ చేసింది.
మధు ప్రియతో పాటు జానపద గాయకులు!
Singer Madhu Priya In Sridevi Drama Company: సింగర్ మధు ప్రియ అంటే తెలంగాణ జానపదం గుర్తుకు వస్తుంది. ఆ అమ్మాయిని 'శ్రీదేవి డ్రామా కంపెనీ' టీమ్ తీసుకు వచ్చారు. ఆమెతో పాటు మరికొందరు జానపద గాయకులను సైతం తీసుకు వచ్చారు. వాళ్ళు పాడిన పాటలు ప్రోగ్రాంలో హైలైట్ కానున్నాయి.
ఆటో రామ్ ప్రసాద్ స్పెషల్ పెర్ఫార్మన్స్!
బోనాలు జాతర అంటే జనాలకు ముందుగా గుర్తుకు వచ్చే మరొక వ్యక్తి పోతురాజు. ఆ వేషధారణలో తెలుగు టీవీలో స్టార్ కమెడియన్ 'ఆటో' రామ్ ప్రసాద్ (Auto Ram Prasad) పెర్ఫార్మన్స్ ఇచ్చారు. అతడితో పాటు మహేశ్వరి, మరొక నటి సైతం అమ్మవారి వేషధారణలో పెర్ఫార్మన్స్ చేశారు.
Also Read: అమర్ దీప్ చౌదరి... ఏమంటున్నావ్ రా, బాతు పేరుతో ప్రేమ లేఖలో ఆ బూతులేంటి?
'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో పేక మేడలు టీమ్!
Sridevi Drama Company Latest Episode Promo: 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో బోనాలు జాతర స్పెషల్ ఎపిసోడ్‌లో 'పేక మేడలు' టీమ్ కూడా సందడి చేసింది. ఆ చిత్రాన్ని 'బాహుబలి','ఎవ్వరికీ చెప్పొద్దు' ఫేమ్ రాకేష్ వర్రే ప్రొడ్యూస్ చేశారు. 'ఆడదాని ఒంటి మీద చెయ్యి వేస్తే నరకాల్సింది వేళ్ళు కాదు, తల' అంటూ 'బాహుబలి'లో రాకేష్ వర్రే శిరస్సును ప్రభాస్ చేధించే సీన్ ఉంటుంది కదా! దాన్ని 'శ్రీదేవి డ్రామా కంపెనీ' స్టేజి మీద రీ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. కాకపోతే ఇక్కడ ప్రభాస్ రోల్ నాటీ నరేష్ చెయ్యడం కామెడీ. అతడు ఆ డైలాగ్ చెప్పి వెనక్కి తిరిగే సరికి రాకేష్ వర్రే ఉండటంతో షోలో ఒక్కటే నవ్వులు.
Also Read: హైపర్ ఆది... నన్ను టచ్ చేయకు - శ్రీ సత్య కామెంట్స్, అతడి పరువు తీసి పారేసిన హన్సిక!
జూలై 11న బోనాలు ఎపిసోడ్ టెలికాస్ట్!
'శ్రీదేవి డ్రామా కంపెనీ - బోనాలు స్పెషల్' ఎపిసోడ్ జూలై 11న ఈటీవీ ఛానల్ లో టెలికాస్ట్ కానుంది. ఆ రోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ఏరియాల్లో బోనాలు జరుగుతాయి. ఇక, షో యాంకర్ రష్మీ గౌతమ్ చేసిన కామెడీ కూడా ఆ ఎపిసోడ్ హైలైట్స్ లో ఒకటి కానుంది. 'మీ పేరు ఏంటి?' అని రామ్ ప్రసాద్ ని అడగటం, నరేష్ కు మద్దతుగా నూకరాజును క్వశ్చన్ చెయ్యడం ప్రోమోలో చూడొచ్చు.