వేద, యష్  ని దారిలో పెట్టాలంటే తన తల్లిదండ్రులే కరెక్ట్ అని సులోచన మాలినితో చెప్తుంది. అగ్రహారంలో ఉండే సులోచన తల్లిదండ్రులుగా మురళీ మోహన్, రాజ్యలక్ష్మి ఎంట్రీ ఇచ్చారు. ఇద్దరూ అన్యోన్యంగా ఉంటారు. వాళ్ళ గురించి చెప్పగానే మాలిని అర్జెంట్ గా వాళ్ళకి ఫోన్ చెయ్యమని చెప్తుంది. వేద జీవితం సరిగా లేదని, భార్యాభర్తల మధ్య సఖ్యత లేదని సులోచన చెప్తుంది. వాళ్ళిద్దరూ పేరుకే భార్యాభర్తలు కానీ సంసారం చేయడం లేదని అంటావ్ అంతే కదా మా దగ్గరకి పంపించు మేము చూసుకుంటామని అంటారు. మనవరాలిని, మనవడిని తమ దగ్గరకి పంపిస్తే ఒక్కటి చేసి పంపిస్తామని సులోచన తండ్రి అంటాడు. అక్కడికి పంపిస్తే వాళ్ళు చూసుకుంటామని అన్నారు కానీ వీళ్ళు వెళ్ళడానికి ఎలా ఒప్పించడం అని సులోచన, మాలిని ఆలోచిస్తూ ఉంటారు. 


Also Read: రామా, జానకికి షాకింగ్ న్యూస్ చెప్పిన డాక్టర్- జెస్సీకి సీమంతం, సంతోషంలో జ్ఞానంబ


తను ఒప్పిస్తానని ఖుషి అంటుంది. యష్ వర్క్ లో ఉండగా ఖుషిని పంపిస్తారు. అమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరుకి వెళ్దామని అనుకుందంట వెళ్లలేకపోతున్నందుకు ఫీల్ అవుతుంది. వాళ్ళు పెద్దవాళ్ళు రాలేకపోయారని మిమ్మల్ని వెకేషన్ లాగా వెళ్ళమ్అంటే వెళ్ళను అన్నావంట కదా. పాపం అమ్మ నిన్ను వాళ్ళ అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్ళి చూపించాలని ఆశ పడుతుంది. ప్లీజ్ నాన్న అమ్మ కోసం ఒప్పుకో’ అని ఖుషి బతిమలాడుతుంది. ‘నా కోసం ఎంతో చేసింది వేద, అమ్మమ్మ ఊరు నాతో కలిసి వెళ్లాలని ఆశ పడుతుంది, ఇది కూడా తీర్చకపోతే ఎలా’ అని యష్ మనసులో అనుకుని ఊరు వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. ఖుషి చాలా హ్యపీగా ఫీల్ అవుతుంది. వాళ్ళ మాటలు విని సులోచన, మాలిని కూడా సంతోషిస్తారు. కూతురితో అడిగించపోతే నేరుగా అడగొచ్చుగా అని యష్ మురిపెంగా తిడతాడు.


ఖుషి సంతోషంగా వేద దగ్గరకి వచ్చి నాన్న నీతో రావడానికి ఒప్పుకున్నారని చెప్తుంది. ఆ మాట విని వేద హ్యాపీగా ఉంటుంది. తమ ప్లాన్ వర్కౌట్ అయినందుకు సులోచన వాళ్ళు సంతోషంగా ఉంటారు. మురళీమోహన్ భార్య రాజ్యలక్ష్మి కి జడ వేయడం చూసి ఇదేం విడ్డూరం అని వాళ్ళ ఇంట్లో ఉన్న పని వాళ్ళు అడుగుతారు. జడ వేయడానికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉందని చెప్తాడు. ట్యాబ్లెట్స్ వేసుకోమంటే వేసుకోలేదు అందుకే తన మీద జడాస్త్రం ప్రయోగించిందని చెప్తాడు. భార్యాభర్తలు ఇద్దరు కాదు ఒక్కరే అని చక్కగా చెప్తారు. భార్యాభర్తల బంధం గురించి చాలా గొప్పగా చెప్తారు. వేద, యష్ ఊరు వెళ్ళడం గురించి ఆలోచిస్తూ ఉంటారు. టూర్ కి వెళ్ళడం తనకంటే యష్ కె అవసరమని వేద అనుకుంటుంది. అటు యష్ కూడా ఇలాగే అనుకుంటాడు. కోర్టు, కేసులు అంటూ చాలా టెన్షన్ పెట్టాను దాని నుంచి రిలీఫ్ కావాలి, అందుకోసమైన వెకేషన్ కి వెళ్లాలని అనుకుంటాడు. కొత్త ప్లేస్ కి వెళ్తే ఫుల్ గా ఎంజాయ్ చేస్తారని వేద యష్ గురించి ఆలోచిస్తూ ఉంటే యష్ వేద సంతోషం గురించి ఆలోచిస్తాడు.


Also Read: పరంధామయ్య నోటి దగ్గర ఫుడ్ లాగేసుకున్న లాస్య- తులసిని సర్ ప్రైజ్ చేసిన సామ్రాట్