జ్ఞానంబ, గోవిందరాజులు గుడికి వస్తారు. అక్కడ పూజారి వాళ్ళ బాధని చూసి మూడో కోడలు కడుపుతో ఉంది కదా తనకి సీమంతం చెయ్యండి మీ ఇంట్లో ఉన్న బాధ పోతుందని చెప్తాడు. సరే చేస్తామని గోవిందరాజులు అంటాడు. జానకి, రామా జెస్సిని తీసుకుని హాస్పిటల్ కి వస్తారు. టెస్టులు చేసిన డాక్టర్ జెస్సిని బయటకి పంపించి జానకి వాళ్ళతో మాట్లాడుతుంది. స్కానింగ్ మిగతా టెస్టులు అన్ని చేశాం కానీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి 4వ నేల గ్రోత్ కనిపించడం లేదని అంటుంది. గర్భం నిలబడే ఛాన్స్ చాలా తక్కువగా ఉన్నాయని డాక్టర్ చెప్తుంది. ఆ మాట విని ఇద్దరూ షాక్ అవుతారు.


జానకి: డెలివరీ తర్వాత బిడ్డ ప్రాబ్లం రికవరీ చేయవచ్చని చెప్పారు కదా


డాక్టర్: కండిషన్ చూస్తుంటే డెలివరీ అయ్యే అవకాశం లేదు, ఉండాల్సిన డెవలప్ మెంట్ అసలు లేదు హోప్ పెట్టుకోకపోవడమే మంచిది


జానకి: ఎలా అయినా ప్రాబ్లం సాల్వ్ చేసి బిడ్డని కాపాడండి


డాక్టర్: మా ప్రయత్నం మేం చేస్తాం కానీ మీరు మెంటల్ గా ప్రిపేర్ అవండి


Also Read: పరంధామయ్య నోటి దగ్గర ఫుడ్ లాగేసుకున్న లాస్య- తులసిని సర్ ప్రైజ్ చేసిన సామ్రాట్


బయట జెస్సి కడుపుని చూసుకుని పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచిస్తూ మురిసిపోతుంది. అప్పుడే జానకి వాళ్ళు వస్తారు. కడుపులో బిడ్డ ఎలా ఉందని ఆత్రంగా అడుగుతుంది. ఏం లేదు బాగానే ఉందని జానకి చెప్తుంది. రోజు రోజుకీ బిడ్డ మీద ఆశలు పెట్టుకుంటున్నా, త్వరగా అమ్మా అని పిలిపించుకోవాలని ఉందని జెస్సి సంతోషంగా చెప్తుంది. తన కడుపులో బిడ్డ గురించి నిజం తెలిస్తే అసలు తట్టుకోలేదని జానకి, రామా చాలా బాధపడతారు. ఈ సంగతి ముందు అమ్మకి చెప్దామని రామా అంటాడు. గర్భం పోయిన తర్వాత అమ్మకి తెలిస్తే అసలు తట్టుకోలేదు ముందే చెప్దామని అంటాడు.


జ్ఞానంబ వాళ్ళు ఇంటికి వచ్చి జెస్సిని పిలుస్తారు. లేరని హాస్పిటల్ కి వెళ్లారని చికిత చెప్తుంది. అప్పుడే రామా వాళ్ళు ఇంటికి వస్తారు. జ్ఞానంబ జెస్సికి బొట్టు పెట్టి సంతోషంగా ఉంటుంది. డాక్టర్ ఏమన్నారని అడుగుతుంది. రామా వాళ్ళు ఏం చెప్పాలో తెలియక మొహాలు చూసుకుంటారు. అంతా బాగానే ఉందని అబద్ధం చెప్తారు. బిడ్డ ఎదుగుదల చాలా బాగుందని జెస్సి సంతోషంగా చెప్తుంది. జెస్సికి నాలుగో నెల కదా సీమంతం చేద్దామని అనుకుంటున్నట్టు జ్ఞానంబ చెప్తుంది. అది విని తన అవకాశం పోగొట్టుకున్నా అని మల్లిక ఏడుస్తుంది. ఇప్పుడేందుకు తర్వాత చేసుకుందామని జానకి అంటుంది. ‘మల్లిక అజాగ్రత్తగా ఉండటం వల్ల కడుపు పోగొట్టుకుంది, కడుపుతో ఉన్న ఇద్దరు ఒక ఇంట్లో ఉండకూడదు అంటారు, అందుకేనేమో ఒకరు పోగొట్టుకున్నారు. ఆ బాధ ఇంట్లో అందరితో పాటు జెస్సికి కూడా ఉంది, ఆ బాధ పోవాలనే సీమంతం చేద్దాం. రేపే సీమంతం’ అని చెప్పేసి జ్ఞానంబ వెళ్ళిపోతుంది.


Also Read: 'పెళ్ళైన కొత్తలో' సినిమాలా ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్‌- వేద, యష్‌ని కలిపేందుకు వెకేషన్ ప్లాన్


 జ్ఞానంబ మాటలు రామా, జానకి తలుచుకుని చాలా బాధపడతారు. ఇప్పుడు అందరి ఆశలు జెస్సీకి పుట్టబోయే బిడ్డ మీద ఉన్నాయ్ అసలు విషయం ఇంట్లో తెలిస్తే అమ్మ పరిస్థితి ఏమవుతుందో అని రామా కంగారుపడతాడు. జానకి ధైర్యం చెప్పేందుకు చూస్తుంది. ఈ నిజం అత్తయ్యకి, జెస్సికి తెలియకూడదని అంటుంది. జ్ఞానంబ జెస్సి వాళ్ళ తల్లిదండ్రులకి ఫోన్ చేసి తనకి సీమంతం చెయ్యాలని అనుకుంటునట్టు చెప్తుంది. ఆ మాట విని జెస్సి తండ్రి పీటర్ చాలా సంతోషిస్తాడు.