సులోచనకి యాక్సిడెంట్ చేసినందుకు గాను ఆదిత్యని యష్ స్వయంగా జడ్జికి అప్పగిస్తాడు. దీంతో నేరం రుజువు అయినందున ఆదిత్యకి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తారు. పోలీసులు ఆదిని తీసుకుని వెళ్లిపోవడంతో మాళవిక కోపంగా వేద మీద విరుచుకుపడుతుంది.


మాళవిక: నువ్వు ఎప్పటికీ ఖుషికి అమ్మగా మాత్రమే మిగిలిపోతావ్, యశోధర్ కి భార్యవి కాలేవు. బిడ్డల్ని కనలేని నువ్వు ఒక ఆడదానివా, కాపురం చేయని మీరు భార్యాభర్తలా? అందరినీ మీరు మోసం చెయ్యొచ్చు ఏమో కానీ నన్ను చెయ్యలేరు. మీ ఇద్దరి బంధం బయటపెడతాను, యశోధర్ ని నీకు దక్కనివ్వను, తన లైఫ్ లో నుంచి నిన్ను వెళ్లగొట్టే రోజు దగ్గర్లోనే ఉందని ఛాలెంజ్ చేసి వెళ్ళిపోతుంది. ఈ మాటలన్నీ కూడా యష్, సులోచన, మాలిని వింటారు.


సులోచన, మాలిని కూతురు, అల్లుడు కాపురం చేయడం లేదనే విషయం గురించి ఒకరినొకరు దెప్పి పొడుచుకుంటారు. వేద మాళవిక మాటలు తలుచుకుని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ‘ఎవరో ఏదో అన్నారని నేను ఎందుకు ఫీల్ అవుతున్నా, మాళవిక అన్నదాంట్లో తప్పేముంది. యశోధర్, నేను పేరుకే భార్యాభర్తలం. మా మధ్య ఎలాంటి బంధం కానీ సంబంధం లేవు, దానికి సిద్ధపడే పెళ్లి చేసుకున్నాం. ఖుషికి అమ్మగా రావడం కోసం మాత్రమే ఈ ఒప్పందం పెళ్లి చేసుకున్నాం. దానికి ఎవరో ఏదో అన్నారని ఎందుకు నేను బాధపడుతున్నా. నీకు నువ్వు ప్రేమించే బిడ్డ ఖుషి ఉంది, ఇంకెందుకు బాధపడటం హ్యాపీగా ఉండాలి’ అని వేద అనుకుంటుంది.


Also Read: తులసి కోరిక తీర్చాలని డిసైడ్ అయిపోయిన సామ్రాట్- ఆవేశంతో రగిలిపోయిన ప్రేమ్


అటు యష్ కూడా మాళవిక మాటలు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ‘వేద నా కొడుకుని క్షమించింది, నేను తప్పులు చేస్తే క్షమించింది. నన్ను మంచి దారిలో నడిపించింది. ఒక మంచి పని చేసిన తృప్తి నేను పొందగలుగుతున్నా అంటే దానికి కారణం వేద. అయినా ఏ సంబంధం లేని వేద నాకోసం ఎందుకు ఇదంతా చెయ్యాలి. మాళవిక అన్న మాటల్లో నిజం ఉంది కదా, వేద కేవలం ఖుషికి అమ్మగా మిగిలిపోవాలా, నాకు భార్య అయ్యే అవకాశమే లేదా’? అని యష్ ఫీల్ అవుతాడు. వేద,యష్ తల్లిదండ్రులు కూడా దీని గురించి ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళిద్దరినీ ఎలాగైనా కలపాలని ఆలోచిస్తూ ఉంటారు. యష్ వాళ్ళని వెకేషన్ కి పంపించాలని మాలిని అనుకుంటుంది. కానీ యష్ మాత్రం మాలిని, రత్నం వెకేషన్ కి వెళ్ళమని అంటుంది. వెకేషన్ కి వెళ్లాలనే ఐడియా మాది కానీ మేము వెళ్ళడానికి కాదు నువ్వు వేద వెళ్ళడానికని రత్నం చెప్తాడు.


మాలిని వాళ్ళ ఐడియా బాగుంది కానీ ఆయన ఒప్పుకుంటారో లేదో అని వేద మనసులో అనుకుంటుంది. అటు యష్ వేద మొహం చూస్తే ఇష్టం లేనట్టు ఉంది కమిట్ అయితే ఎలా అని ఆఫీసులో ఆడిట్ ఉందని అబద్ధం చెప్తాడు. ఇద్దరూ కుదరదంటే కుదరదని అంటారు. అది విని రత్నం, మాలిని నీరసించిపోతారు. ఇక వీళ్ళ హనీ మూన్ జరిగినట్టే అని నీరుగారిపోతారు. వెకేషన్ ప్లాన్ ఏమైందని మాలినిని సులోచన అడుగుతుంది. ఇద్దరూ బిజీ అని చెప్పారని చెప్తుంది. అయితే అందుకు ఒకటే మార్గం మా అమ్మ వాళ్ళ ఊరు ఆగ్రహారంకి పంపించాలని అంటుంది. సులోచన వాళ్ళ తల్లిదండ్రులుగా మురళీ మోహన్, రాజ్యలక్ష్మి ఎంట్రీ ఇస్తారు.


Also Read: ఆదిత్యకి ఆరు నెలల జైలు శిక్ష- వేద జీవితాన్ని మార్చేందుకు వచ్చిన కొత్త క్యారెక్టర్లు


ఇద్దరూ అన్యోన్యంగా ఉంటారు. వయస్సు ఓల్డేజ్‌ అయినా మనసు మాత్రం టీనేజ్. ఈ సీన్ చూస్తే ‘పెళ్ళైన కొత్తలో’ సినిమాలో హీరోహీరోయిన్ లి కలపడానికి చేసే ప్రయత్నం లాగా ఉంది. భార్య రాణికి జడ వేస్తూ అన్యోన్య దాంపత్యం అంటే వాళ్ళదే  అన్నట్టు చూపించారు.