Love Horoscope Today 13th December 2022: ఈ రోజు ఏ రాశివారి ప్రేమ జీవితం ఎలా ఉందో చూద్దాం...


మేష రాశి
ఈ రాశివారికి ప్రియమైనవారితో వివాదం ఉండవచ్చు. మీరు ఏదో విషయంలో అపార్థం చేసుకుంటారు. పనికి-బంధాలకు మధ్య సమతుల్యత పాటిస్తే ప్రశాంతంగా ఉంటుంది. 


వృషభ రాశి
సమస్యలో ఉన్న తమ భాగస్వామికి అండగా నిలుస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో ఉన్న చిన్న వివాదాలు తొలగిపోతాయి. 


మిథున రాశి
పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త వహించండి..అనవసర వ్యక్తుల కోసం ఖర్చు చేయవద్దు. మీ ప్రియమైనవారితో సంతోషకరమైన క్షణాలు గడుపుతారు. వివాహితుల మధ్య అనవసర వివాదాలు ఉండవచ్చు.


కర్కాటక రాశి 
ఈ రోజు మీరు మీ భాగస్వామితో చెప్పాలనుకున్న విషయాలు సూటిగా చెబుతారు. మీ బంధంలో నిజాయితీ కారణంగా పరస్పరం నమ్మకం పెరుగుతుంది. కుటుంబ జీవితంలో భాగస్వామి కోసం డబ్బు ఖర్చు చేస్తారు. వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు తప్పవు


సింహ రాశి
ఈ రోజు మీ మనస్సు దృష్టి మళ్లుతుంది. మాట తూలడం వల్ల అకరాణంగా గొడవ జరిగే అవకాశం ఉంది. మీ ప్రియమైన వారి కోపం పోగొట్టేందుకు బహుమతి ఇవ్వండి. 


కన్యా రాశి 
ఈ రోజంతా మీకు ప్రేమ మయం. ప్రేమ భాగస్వామి  లేదా జీవిత భాగస్వామితో ట్రిప్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.  వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. 


తులా రాశి 
ఈరోజంతా సంతోషంగా ఉంటారు. కుటుంబంలో అందరూ మిమ్మల్ని అభిమానిస్తారు. అవివాహితులు తమ లైప్ పార్టర్ ని వెతుక్కునేందుకు ఇదే సరైన సమయం. ఒకరి ఆకర్షణకు లోనవుతారు. వైవాహిక జీవితం బావుంటుంది


వృశ్చిక రాశి 
మీ ప్రేమ జీవితంలో పరస్పర విభేదాలు ఉంటాయి. అయితే కొంత సమయం తరువాత పరిస్థితి సాధారణ స్థితికి వస్తుంది. మీరు మీ ప్రేమ భాగస్వామికి మంచి బహుమతి ఇవ్వవచ్చు. ఒక నిర్దిష్ట అంశంపై జీవిత భాగస్వామితో వివాదం ఉంటుంది.


ధనుస్సు రాశి
ఈ రాశివారికి సోమరితనం పెరుగుతుంది..ఫలితంగా ఇంట్లో చిన్న చిన్న ఇబ్బందులు తప్పవు. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు. ప్రేమికులకు సాధారణంగా ఉంటుంది. 


మకర రాశి 
మీ ప్రేమను వ్యక్తపరిచేందుకు ఇదే సరైన సమయం. మీ ప్రేమ జీవితంలో పెద్ద మార్పు రాబోతోంది. వైవాహిక జీవితంలో పరస్పర విభేదాలకు అవకాశం ఉంది. అవివాహితుల వివాహాల్లో జాప్యం జరుగుతుంది.


కుంభ రాశి
ఈ రాశివారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రేమికులతో ఏదైనా వివాదం ఉండవచ్చు. అవివాహిత వ్యక్తులు కొత్త బంధంలోకి అడుగుపెట్టేందుకు ఇదే మంచి సమయం


మీన రాశి 
ఒంటరి పక్షులు జంటగా మారుతారు. బంధంలో మీ బాధ్యత పెరుగుతుంది. ప్రేమికులు పెళ్లిదిశగా అడుగేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించండి.


2023 లో మేష రాశివారి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి


2023లో వృషభ రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి


2023 మిథున రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి


2023 మిథున రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి