ఇంటికి వచ్చిన వేద, యష్ కి ఖుషి హారతి ఇచ్చి దిష్టి తీస్తుంది. మాలిని కొడుకుని ప్రేమగా దగ్గరకి తీసుకుంటుంది. ఈరోజు వేద లేకపోతే తను లేనని యష్ అంటాడు. ఖుషి వల్ల మీ జీవితంలోకి వచ్చాను అది తన అదృష్టమని వేద చెప్తుంది.


యష్: అది నీ అదృష్టం కాదు వేద నాది. భర్త కోసం సేవలు చేసే భార్యలు ఉండవచ్చు కానీ నువ్వు చేసిన సాయం నేను మాటల్లో చెప్పలేను


వేద: అది నా బాధ్యత


మాలిని: బాధ్యత, ప్రేమ ఏదైనా కొత్త పేరు ఉందంటే అది నువ్వేనమ్మా


తను ఇలా ఉండటానికి కుటుంబం ఎంతో అండగా నిలిచిందని చెప్తుంది. ఇక యష్ పని చేసుకుంటూ ఉండగా మల్లె పూలు పట్టుకుని వస్తుంది. భర్త చేతితో తలలో పెట్టించుకుని మురిసిపోతుంది.


వేద: ఏవండీ నాకు పుల్లటి మామిడి కాయలు తినాలని ఉంది


Also Read: అత్తకి చావు భయం చూపిస్తున్న తోడికోడళ్ళు- తులసిని లైన్లో పెట్టేందుకు నందు పాట్లు


యష్: నాకు అలానే ఉంది


వేద: పుల్లటి చింతకాయ చట్నీ కూడా తినాలని ఉంది


యష్: అవును ముద్దపప్పు వేసుకుని చింతకాయ పచ్చడి వేసుకుంటే సూపర్ గా ఉంటుంది


వేద: చెప్పేది సరిగా వినండి ఈ మధ్య గుడికి వెళ్ళాను. గుడిలో కళ్ళు తిరిగి పడిపోయాను


యష్: టెన్షన్ తో కళ్ళు తిరిగి పడిపోయి ఉంటావ్


వేద: అక్కడ ఒకావిడ నా నాడీ పట్టుకుని చూసి ఒక గుడ్ న్యూస్ చెప్పింది. నా కడుపులో ఒక నలుసు పడిందని చెప్పింది


యష్: అయ్యయ్యో ఒక ట్యాబ్లెట్ వేసుకోకపోయావా?


వేద: ఓరి మొగుడా నేను అమ్మని కాబోతున్నా అనేసరికి తనని ఎత్తుకుని సంతోషంగా గాల్లో తిప్పేస్తాడు.


యష్: ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు. అమ్మ వాళ్ళకి ఈ విషయం తెలిస్తే చాలా సంతోషిస్తారు


వేద: వద్దు సైంటిఫిక్ గా కన్ఫామ్ చేశాక అందరినీ కూర్చోబెట్టి ఈ విషయం చెప్దాము


నీలాంబరి లాయర్ ని పిలిపిస్తుంది. భ్రమరాంబిక, ఖైలాష్ ని పిలుస్తుంది.


లాయర్: అభిమన్యు తను తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించలేక తన ఆస్తిని నీలాంబరికి రాసి ఇచ్చిన హక్కు పత్రం


భ్రమరాంబిక: మోసం


నీలాంబరి: గన్ తీసి చూపిస్తుంది. దీనికి మాటలు రావు కేవలం ప్రాణాలు మాత్రమే తీస్తుంది


లాయర్: ఇక మీదట బ్యాంక్ లావాదేవీలు సకల ఆస్తులన్నీ నీలాంబరికి చెందుతాయి. సదరు వ్యక్తి తిరిగి వ్యక్తి తిరిగి వచ్చినా కూడా అతనికి ఎటువంటి హక్కులు ఉండవు


Also Read: గుండెల్ని పిండేసే ఎమోషనల్ సీన్ - కనికరించని రాజ్, కన్నీళ్ళతో అత్తింటిని వదిలిన కావ్య


భ్రమరాంబిక తలకి గన్ పెడుతుంది. మీలాంటి వాళ్ళకి నా ఇంట్లో స్థానం లేదు. ముష్టి ఎత్తుకుని బతుకుతారో ఏం చేస్తారో మీ ఇష్టం. మీ లగేజ్ సర్ది పెట్టాను ఇక బయటకి పోండి. హాస్పిటల్ కి తీసుకు వెళ్తాను రెడీ అవమని చెప్తాడు. కానీ వేద మాత్రం కుదరదు.. హాస్పిటల్ కి కలిసి వెళ్తే ఎక్కడికి ఎందుకు అని అడుగుతారు. అప్పుడు విషయం చెప్పాల్సి వస్తుందని తిడుతుంది. ఇద్దరూ కాసేపు దీని మీద డిస్కషన్ పెట్టేస్తారు. ఆఫీసుకి వెళ్లాలంటే తనకి ముద్దు పెట్టాలని సరసాలు మొదలు పెడతాడు. అప్పుడే డాక్టర్ యష్ కి ఫోన్ చేస్తుంది. వేద చెకప్ కి వచ్చింది దాని గురించి పర్సనల్ గా మాట్లాడాలని చెప్పేసరికి యష్ కంగారుపడతాడు.


డాక్టర్: చిన్న కాంప్లికేషన్ ఉంది. తన గర్భసంచి చాలా వీక్ గా ఉంది. ప్రెగ్నెన్సీ నిలవకపోవచ్చు