Ennallo Vechina Hrudayam Serial Today March 3rd: 'ఎన్నాళ్లో వేచిన హృదయం' సీరియల్: కాలనాగు కాటుకి విరుగుడు ఈ భూమ్మీదే లేదా.. బాల కోసం ప్రాణత్యాగానికి సిద్ధమైన త్రిపుర! 

Ennallo Vechina Hrudayam Today Episode బాలకి కాలనాగు కాటేసిందని తెలుసుకున్న త్రిపుర ఎవరికీ తెలీకుండా ప్రకృతి వైద్యశాలకు వెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Continues below advertisement

Ennallo Vechina Hrudayam Serial Today Episode సుందరి పేరు మీద త్రిపుర పంపినట్లు గిరి బాలకి స్వీట్ బాక్స్ పంపిస్తాడు. అది త్రిపుర పంపిందని బాల సంతోషంతో నా సుందరి స్వీట్స్ పంపిందని అందరికీ సంతోషంగా చెప్పుకొని ఓపెన్ చేస్తాడు. ఆ బాక్స్‌లో స్వీట్స్ బదులు గిరి పెట్టించిన ఓ పాము బాలని కాటేస్తుంది. బాల కుప్పకూలిపోతాడు. అందరూ భయంతో బాలని పట్టుకొని విలవిల్లాడిపోతారు. 

Continues below advertisement

బాక్స్ పంపిన రౌడీ వస్తుంటే ఆడవాళ్లు ఆయన్ని ఆపి గిరికి ఆ త్రిపురతో పెళ్లి అవుతుందా ఎవరితో పారిపోయింది అంట కదా అంటారు. మరోవైపు గిరి తన మనుషులతో తాను పంపిన కాల నాగు వల్ల బాల పని అయిపోతుందని అనుకుంటాడు. నీకు చావు ముహూర్తం నాకు పెళ్లి ముహూర్తం ఒకే సారి కుదిరాయని ఎక్కడికి తీసుకెళ్లినా నువ్వు బతకవు అని గిరి అనుకుంటాడు. బాల నోటి నుంచి నురగ రావడంతో ప్రకృతి వైద్యశాలకు తీసుకెళ్తారు. మరోవైపు త్రిపురను రమాదేవి, ఊర్వశిలు పెళ్లి కూతురిలా రెడీ చేస్తారు. గాయత్రీ, త్రిపుర వదినలు రమాదేవి మీద సెటైర్లు వేస్తారు. ఇక గాయత్రీ తనకు పెళ్లి ఇష్టం లేదని వెళ్లిపోతుంది. రమాదేవి మనసులో నీ ప్రేమను నాశనం చేస్తా త్రిపురని పెళ్లి చేసి నరకంలోకి పంపుతా అని అనుకుంటుంది.

ఇక త్రిపురని తాతయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకోమని అంటే త్రిపుర కన్నీరు తాత కాళ్ల మీద పడటంతో తల్లి కోసం నరకానికి వెళ్తున్నావ్ అన్నీ తెలిసి ఏం చేయలేకపోతున్నా అని అనుకుంటాడు. ఇక త్రిపుర అన్న దగ్గరకు వెళ్లి ఆశీర్వాదం తీసుకుంటే నువ్వు తెలిసి నరకంలోకి వెళ్తుంటే నేను నిన్ను సంతోషంగా ఉండమని దీవించలేనని అక్షింతలు పక్కన పడేస్తాడు. మీ అన్నయ్య మాటే నా మాట అని వదిన వెళ్లిపోతుంది. ఇక రమాదేవి వచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని అంటుంది. ఇక పెళ్లికూతురిని వీధిలోని ఆడవాళ్లు వచ్చి ఆశీర్వదిస్తారు. పెళ్లి కూతిరిని చేసిన తర్వాత గుమ్మం దాటితే పెళ్లి పీటలే ఎక్కాలి అని గుమ్మంలోనే ఉండాలి అని రమాదేవి చెప్పి త్రిపుర బయటకు వెళ్లిపోగలదని గదికి తాళం వేస్తుంది. 

బాలని తీసుకొని ప్రకృతి వైద్యశాలకు వెళ్తారు. గురువుగారు బాలని పరీక్షించి తన కుటుంబంతో బాలని కాల నాగు కరిచిందని అది చాలా ప్రమాదం అని దాని విషానికి విరుగుడు లేదని విషం శరీరం మొత్తం పాకి ఒక్కో అవయవం పాకి చనిపోతారని అంటాడు. అందరూ ఏడుస్తారు. ఎలా అయినా బాలని బతికించమని చెప్తారు. ఇది ఘటన ఎలా జరిగింది అని గురువుగారు అడిగితే మొత్తం చెప్తారు. బాల చనిపోతాడు అనగానే నాగభూషణం, వాసుకి, ఫణిలు సంతోషపడతారు. బామ్మ దేశవిదేశాలకు ఫోన్ చేసి విరుగుడు ఉంటుందేమో కనుక్కోమని అంటుంది అందరూ ఫోన్లు చేస్తారు. మరోవైపు గురువుగారు త్రిపురకు కాల్ చేస్తారు. నీకు బాగా తెలిసిన బాలని కాలనాగు కాటేసిందని పరిస్థితి విషమంగా ఉందని చెప్తారు.

త్రిపుర చాలా కంగారు పడుతుంది. అలా ఎలా జరిగింది అని త్రిపుర అడిగితే ఎవరో సుందరి అనే పేరు మీద స్వీట్ బాక్స్ ఇచ్చారని బాక్స్ తెరవగానే పాము కాటేసిందని చెప్తారు. దాంతో త్రిపుర షాక్ అయిపోతుంది. వెంటనే వస్తానని చెప్తుంది. ఇది తన బావ పనే అని గుర్తిస్తుంది. బావ వల్లే తనకు ఈ పరిస్థితి వచ్చిందని ఎలా అయినా బాలని కాపాడుకోవాలని ఎవరికీ తెలీకుండా గదిలో కిటికీ తీసేసి అందులో నుంచి బయటకు వెళ్తుంది. ప్రకృతి వైద్యశాలకు పరుగులు తీస్తుంది. బాల దుస్థితి చూసి ఏడుస్తుంది. గురువుగారిని కలిస్తే విషం శరీరానికి పాకిందని బతకడం కష్టమని అంటారు. తన వాళ్లు దేశదేశాలు ఫోన్లు చేస్తున్నారు అని చెప్తారు. గ్రంధంలో ఒకే ఒక్క మార్గం ఉందని రాసుందని చెప్తారు.

నాగాంభరి పుష్పం ఈ విషానికి విరుగుడు అని.. అది అరుదైన పుష్పం అని 144 సంవత్సరాలకు ఒకసారి అది కూడా కుంభమేళ టైంలో సూర్యాస్తమయం టైంలో మాత్రమే దొరుకుతుందని అంటారు. నేను తీసుకొస్తానని త్రిపుర అంటే అది చాలా ప్రమాదకరం అని నీ ప్రాణాలకు కూడా ప్రమాదం వస్తుందని అంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: చెల్లిని చావగొట్టిన దీప.. కన్నకూతురి చెంప పగలగొట్టిన సుమిత్ర.. దీప విశ్వరూపం!

Continues below advertisement
Sponsored Links by Taboola