Pawan Kalyan's Hari Hara Veera Mallu USA Premieres Report: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన 'హరిహర వీరమల్లు' ప్రీమియర్ షోలు ఇవాళ (జూలై 23) రాత్రి నుంచి మొదలు అవుతాయి. అమెరికాలో ఫస్ట్ షో ఎన్ని గంటలకు పడుతుంది? ఇండియాలో ఫస్ట్ షో ఎన్ని గంటలకు? ఈ సినిమా ప్రీమియర్ రిపోర్ట్స్, ట్విట్టర్ రివ్యూస్ ఎన్ని గంటలకు వస్తాయి? అంటే...
అమెరికా నుంచి కాదు...ఇండియా నుంచి ఫస్ట్ రివ్యూస్!ప్రతి సినిమాకూ అమెరికా నుంచి ప్రీమియర్ షోస్ రిపోర్ట్ రావడం కామన్. బట్, ఫర్ ఏ ఛేంజ్... 'హరి హర వీరమల్లు' ప్రీమియర్ షో రిపోర్ట్స్ ఇండియా నుంచి, ఆ మాటకు వస్తే ఏపీ నుంచి వస్తాయి. ఆంధ్రప్రదేశ్ అంతటా ఇవాళ రాత్రి (జూలై 23న) 9 గంటల నుంచి ప్రీమియర్ షోలు పడుతున్నాయ్. అక్కడి నుంచి రిపోర్ట్స్ వచ్చేస్తాయి.
అమెరికాలో కొన్ని ప్రాంతాలలో ఏపీలో కంటే ముందుగా ప్రీమియర్స్ షోలు ప్లాన్ చేశారు. అయితే అది కూడా ఇండియన్ టైమింగ్ ప్రకారం... రాత్రి 8.45 గంటలకు. అంటే ఓ పావుగంట ముందు అంతే! అయితే ఈ రోజు యూఎస్ నుంచి వచ్చే రివ్యూస్ కంటే తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే రివ్యూల కోసం ఆడియన్స్ ఎక్కువ ఎదురు చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. జూలై 24న ప్రపంచ వ్యాప్తంగా మార్నింగ్ షోస్ పడే సమయానికి రివ్యూలు వస్తాయి. పవన్ కళ్యాణ్ పబ్లిసిటీ కార్యక్రమాల్లో జాయిన్ కావడంతో సినిమా బజ్ మరింత పెరిగింది. ఆయన పార్టిసిపేషన్ సినిమాకు బూస్ట్ ఇచ్చిందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. వీరమల్లు రన్ టైమ్ ఎంత?Hari Hara Veera Mallu movie runtime: హరిహర వీరమల్లు రన్ టైమ్ రెండు గంటల 43 నిమిషాలు (2.43). అందులో ఫస్ట్ హాఫ్ లెంగ్త్ ఒక గంట 26 నిమిషాలు (1.26). సెకండ్ హాఫ్ రన్ టైమ్ ఒక గంట 18 నిమిషాలు (1.18). రీసెంట్ వార్ డ్రామా, హిస్టారికల్ ఫిలిమ్స్ రన్ టైమ్ ఆల్మోస్ట్ మూడు గంటలు ఉన్నాయి. కానీ, వీరమల్లు టీం మూడు గంటల కంటే పావుగంట తక్కువ ఉంది.
పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటించిన 'హరి హర వీరమల్లు' సినిమాలో ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ నటించారు. ఇంకా ఇతర కీలక పాత్రల్లో అనుపమ్ ఖేర్, సత్యరాజ్, సునీల్, జిష్షుసేన్ గుప్తా, నాజర్, నోరా ఫతేహి తదితరులు నటించారు. ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకులు. ఏయం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకం మీద ఏ దయాకర్ రావు నిర్మించారు. ఆస్కార్ పురస్కార గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.