Kollywood Actor Suriya's Karuppu Teaser: కోలీవుడ్ స్టార్ సూర్య కొత్త మూవీ 'కరుప్పు' టీజర్ వచ్చేసింది. ఆయన బర్త్ డే సందర్భంగా మేకర్స్ స్పెషల్ సర్ ప్రైజ్ ఇస్తూ టీజర్ రిలీజ్ చేశారు. ఫుల్ మాస్ అవతారం ఆయన లుక్ యాక్షన్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది.
టీజర్ అదుర్స్
పవర్ ఫుల్ మాస్ లుక్‌లో సూర్య అదరగొట్టారు. 'కొబ్బరి కాయలు కొట్టుకుని కర్పూరం వెలిగిస్తే శాంతించే దేవుడు కాదు. మనసులో మొక్కుకుని మిరపకాయలు దంచితే రుద్రుడై దిగొచ్చే దేవుడు' అనే మాస్ డైలాగ్‌తో టీజర్ ప్రారంభం కాగా... వీరభద్రుడిలా బలమైన ఆయుధంతో సూర్య ఎంట్రీ అదిరిపోయింది.
'నా పేరు సూర్య... నాకు ఇంకో పేరు ఉంది' అంటూ వింటేజ్ మాస్ లుక్‌లో సూర్య చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. 'మేరా భాయ్... ఇది మన టైం కుమ్మి పడేద్దాం' అనే డైలాగే వేరే లెవల్. మూవీలో సూర్య లాయర్‌గా, విలేజ్‌లో ఊరి పెద్దగా మాస్ లుక్‌లో కనిపించనున్నట్లు టీజర్‌ను బట్టి అర్థమవుతోంది.
ఈ మూవీలో సూర్య సరసన బ్యూటీ త్రిష హీరోయిన్‌గా చేస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై సినిమా నిర్మిస్తుండగా... ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు. కోలీవుడ్ మ్యూజిక్ లెజెండ్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. సినిమా ఆడియో రైట్స్‌ను థింక్ మ్యూజిక్ బారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
గత కొంతకాలంగా సూర్య ఖాతాలో సరైన హిట్ పడలేదు. 'కంగువా' నిరాశపరచగా... ఆ తర్వాత వచ్చిన 'రెట్రో' కాస్త పర్వాలేదనిపించింది. తెలుగులో మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు సూర్య. ప్రస్తుతం 'కరుప్పు' అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 'కరుప్పు' అంటే తమిళంలో నలుపు అని అర్థం. టీజర్ చూస్తుంటే మాస్ లుక్స్, పవర్ ఫుల్ డైలాగ్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. మళ్లీ సూర్య కమ్ బ్యాక్ ఇవ్వడం ఖాయమంటూ ఆయన ఫ్యాన్స్ కామెంట్స్ చూస్తున్నారు. ఈ మూవీలో సూర్య డ్యూయల్ రోల్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
తెలుగులోనూ...
'కరుప్పు' సినిమాతో పాటే నేరుగా తెలుగులో డైరెక్టర్ వెంకీ అట్లూరితో సూర్య ఓ మూవీ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కూడా జరుగుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమా నిర్మిస్తున్నారు. సూర్య సరసన 'ప్రేమలు' ఫేం మమితా బైజు హీరోయిన్‌గా చేస్తున్నారు. వీరితో పాటు రవీనా టాండన్, రాధికా శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.