టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు తేజ. నితిన్ ని హీరోగా పరిచయం చేస్తూ 'జయం' అనే లవ్ స్టోరీ తో యావత్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. అప్పట్లో జయం సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమాతో డైరెక్టర్ తేజ కి ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ వచ్చేసింది. ఆ తర్వాత హీరోయిన్ కాజల్ అగర్వాల్ ని కూడా వెండితెరకు పరిచయం చేస్తూ కళ్యాణ్ రామ్ తో 'లక్ష్మీ కళ్యాణం' అనే సినిమా చేశాడు. అలా దర్శకుడిగా పలు సినిమాలు చేయగా వాటిలో ఎక్కువగా ఈయనకు అపజయాలే వరించాయి. ఇప్పటివరకు తేజ కెరియర్ లో హిట్స్ కంటే ఎక్కువ ప్లాప్సే ఉన్నాయి. ఇక ఈయన ఏదైనా సరే ముక్కు సూటిగా మాట్లాడుతూ, ఉన్నది ఉన్నట్లు చెప్తుంటాడు. అలాంటి ఈ ఈ డైరెక్టర్ కి తాజాగా ఓ టీవీ షోలో హీరో, హీరోయిన్లను కొట్టడంపై ప్రశ్న తలెత్తింది. అందుకు ఆయన ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


ఇటీవల తేజ లాంగ్ గ్యాప్ తర్వాత దగ్గుబాటి సురేష్ బాబు కొడుకు అభిరామ్ ను హీరోగా పరిచయం చేస్తూ 'అహింస' అనే సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. తాజాగా జూన్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా నెగిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాతో తేజ కెరియర్ లో మరో ప్లాప్ పడినట్లే అని అంటున్నారు సినీ జనాలు. అయితే తాజాగా అహింస సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మూవీ టీం ఎక్స్ ట్రా జబర్దస్త్ సోలో పాల్గొన్నారు. ఇక ఈ షోలో డైరెక్టర్ తేజ తో పాటు సదా, హీరో అభిరామ్ హాజరయ్యారు. అందుకు సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదల చేశారు. ఈ ప్రోమోలో  జబర్దస్త్ కమెడియన్ రాంప్రసాద్ ముందు అహింస టీం తో ఒక స్కిట్ చేశాడు. ఆ స్కిట్ లో దర్శకుడు తేజ హీరో అభిరామ్ పాల్గొని తమ డైలాగ్స్ తో నవ్వులు పూయించారు. అయితే ప్రోమో చివర్లో  రాంప్రసాద్, దర్శకుడు తేజ ని ఓ ప్రశ్న అడుగుతాడు.  "మీరు సెట్లో హీరోలను, హీరోయిన్లను కొడతారు. వాళ్లని ఏదో అంటారు అని ఎందుకు సార్ ఈ రూమర్" అని అడగగా దీనికి తేజ బదులిస్తూ.. "కేవలం హీరో, హీరోయిన్లనేనా" అంటూ షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు.  "ఓహో సెట్ సెట్ మొత్తం కొడతారా" అని భయపడుతూ తేజ దగ్గర కూర్చున్న రాంప్రసాద్ లేచి వెళ్ళిపోతాడు. అప్పుడు "ఎవరిని వద్దు సార్, నన్ను కొట్టండి" అని లేడీ గెటప్ లో శాంతి స్వరూప్ చెప్పడంతో ఈ ప్రోమో ఎండ్ అవుతుంది.


దీంతో ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక అహింస విషయానికి వస్తే.. దగ్గుపాటి అభిరామ్, గీతిక తివారి జంటగా నటించిన ఈ సినిమాని ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై పి కిరణ్ నిర్మించారు. సదా, కమల్ కామరాజు, దేవి ప్రసాద్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. జూన్ 2న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద 'అహింస' మరో ప్లాప్ గా మిగిలిపోయింది. సుమారు 7 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ ను జరుపుకున్న ఈ సినిమా నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది. థియేట్రికల్ వ్యాల్యూ ప్రకారం 'అహింస' మూవీకి రూ.5 కోట్ల మేర నష్టాలు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.



Also Read: 'ఆదిపురుష్' సెన్సార్ కంప్లీటెడ్ - రిపోర్ట్ ఎలా ఉందంటే?