గృహహింస కేసు రీఓపెన్ చేయించిన విషయం లాస్యకి తెలుస్తుంది. ఏంటి నందుతో ఆడుకుందామని అనుకుంటే ఈ తులసి నాతో ఆడుకుంటుందని తిట్టుకుంటుంది. అప్పుడే లక్కీ లాస్యకి ఫోన్ చేసి సమ్మర్ హాలిడేస్ కదా ఇంటికి తీసుకెళ్లడానికి రావడం లేదా అని అడుగుతాడు. కాస్త బిజీగా ఉన్నాను తర్వాత చూద్దాంలే అంటే అందుకే నేను వేరే ఆప్షన్ వెతుక్కున్నాలే అంటాడు. తులసి ఆంటీ దగ్గరకి వెళ్తున్నానులే అంటే ఎప్పుడు కాల్ చేసిందని అడుగుతుంది. నాన్న గురించి అడిగిందని లక్కీ చెప్పేసరికి లాస్య అనుమానపడుతుంది. వెంటనే లాస్య మాజీ మొగుడు శేఖర్ కి ఫోన్ చేస్తుంది. కలవాలని తను వచ్చే వరకు ఎక్కడికి వెళ్లొద్దని అంటుంది. దీపక్, తులసి రోడ్డు మీద శేఖర్ కోసం వెతుకుతూ ఉంటారు. విక్రమ్ జరిగినవన్నీ గుర్తు చేసుకుని బాధపడుతూ ఉండగా తాతయ్య వస్తాడు.


Also Read: రాహుల్ ప్లాన్ తిప్పికొట్టి కావ్య తన అక్క పెళ్లి జరిపిస్తుందా?


దివ్య మంచితనం నీకు తెలుసు కదా? నీ ప్రేమ మీద నీకు నమ్మకం లేదా? అంటాడు. ఒక మనిషిని చంపేంత క్రూరత్వం తనలో ఉందా? తను ఎందుకు అసలు ఎలా చేస్తుంది. దివ్య నిన్ను నమ్మి ఈ ఇంట్లో అడుగు పెట్టింది నీడలా ఉంటూ తనకి తోడుగా ఉండాలి కానీ ప్రేమిస్తే గుడ్డిగా ప్రేమిస్తావ్ అనుమానిస్తే గుడ్డిగా అనుమానిస్తావని తిడతాడు. దివ్య అమ్మని నా కళ్ళ ముందే అవమానిస్తుంది చెప్తాడు. నీకు చదువులేదని తెలిసినా ప్రేమించింది. తనతో మనస్పూర్తిగా మాట్లాడు. అమ్మ అంటే ఉన్న ఇష్టాన్ని నీదగ్గర నీతోనే ఉంచుకో దివ్యతో దాన్ని చూడకు. వెళ్ళి తనతో మాట్లాడమని సలహా ఇస్తాడు. లాస్య నాటకం స్టార్ట్ చేస్తుంది. జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు ఏదైనా ఉందంటే అది నిన్ను వదులుకుని నందుని పెళ్లి చేసుకోవడమే తను నాకు నరకం చూపిస్తున్నాడని అతనితో ఏ మాత్రం కలిసి ఉండలేను డివోర్స్ ఇచ్చేస్తాను నీ దగ్గరకి వచ్చేస్తాను కాదనకు అని శేఖర్ భుజం మీద వాలి ఏడుస్తుంది.


శేఖర్: నువ్వు మనసు మార్చుకుని నా దగ్గరకి రాలేదు నందుకి డివోర్స్ ఇవ్వాలనే ఆలోచన కూడా నీకు లేదు. నువ్వు నాకు దూరమైన నీ ఇన్ఫర్మేషన్ అంతా నా దగ్గర ఉంది ముసుగు తీసి మాట్లాడు ఎందుకు వచ్చావ్ ఏం కావాలి అనగానే లాస్య మత్తు మందు ఖర్చిఫ్ పెట్టేస్తుంది.


లాస్య: నాకు వ్యతిరేకంగా నీతో సాక్ష్యం చెప్పించి నందుని విడిపించడం కోసం తులసి నీ దగ్గరకి వస్తుంది. ఈరోజే వాదనలు ఈ ఒక్కరోజు నిన్ను తులసికి దొరక్కుండా చేస్తే చాలని రౌడీలని పిలిచి దాచి పెట్టమని చెప్పేస్తుంది.


Also Read: యష్, వేద సంతోషం చూసి రగిలిపోతున్న మాళవిక- కూతురి జీవితం గురించి భయపడుతున్న సులోచన


విక్రమ్ రావడం చూసి రాజ్యలక్ష్మి బాధపడుతున్నట్టు నటిస్తుంది. ఏమైంది ఎందుకు డల్ గా ఉన్నావని అడుగుతాడు. ఇంట్లో జరుగుతున్న వాటికి భయపడి పంతుల్ని కలిశాను. ఇంటి పెద్ద కోడలు ఇంట్లో కాలు పెట్టిన ఘడియ బాగోలేదని చూస్తూ ఉంటే ఇంకా ఘోరాలు జరుగుతాయంట. వెంటనే శాంతి పూజలు చేయించకపోతే అక్కకి ప్రాణగండమని బసవయ్య చెప్తాడు. తను పూజ చేస్తానని అంటే చేయాల్సింది నువ్వు కాదు దివ్య చేయాలని అంటారు. తన వల్ల జరిగిన దోషాన్ని తనే పోగొట్టాలి దివ్యతో పూజ చేయించడం తన బాధ్యత అంటాడు.


నందుని కలవడానికి లాస్య జైలుకి వస్తుంది. తులసి కేసు రీ ఓపెన్ చేయించింది నాకు వ్యతిరేకంగా సాక్షి కూడా తీసుకొచ్చింది తను జడ్జి ముందు నోరు విప్పితే నువ్వు నిమిషాల్లో విడుదల అవుతావు. కానీ ఆ సాక్షి ప్రస్తుతం నా దగ్గర ఉన్నాడు ఎంత వెతికినా దొరకడు కోర్టులో తనకి మొట్టికాయలు తప్పవు. తులసిని నమ్ముకోకుండా నా చెయ్యి పట్టుకో ఎప్పటిలా హ్యపీగా ఉందామని ఆఫర్ ఇస్తుంది. ఇక భాగ్య తులసికి ఫోన్ చేసి శేఖర్ ని కిడ్నాప్ చేయించి దాచి పెట్టిందని చెప్తుంది.