'ఆదిపురుష్' (Adipurush Movie)లో దర్శకుడు ఓం రౌత్ ఏం చూపించారు? సినిమా ఎలా ఉండబోతుంది? వంటి అంశాల కంటే ఆల్రెడీ విడుదలైన టీజర్, ట్రైలర్స్ ఈ సినిమాను ఎప్పుడూ వార్తల్లో ఉండేలా చేశారు. సినిమా బయట జరిగిన అంశాలు మరింత వివాదాస్పదం అయ్యాయి. 


ప్రభాస్ గెటప్ నుంచి కృతి సనన్ ఎంపిక వరకు... డిజప్పాయింట్ చేసిన టీజర్ నుంచి అంచనాలు పెంచిన ఫస్ట్ ట్రైలర్, ఇప్పుడు యాక్షన్ ట్రైలర్ వరకు... సినిమాకు సంబంధించిన ప్రతిదీ వార్తల్లో నిలిచింది. టీజర్ విడుదలైన తర్వాత విజువల్స్ ఎఫెక్ట్స్ విషయంలో విమర్శలు రావడంతో ట్రైలర్ విడుదలకు వచ్చే సరికి తప్పుల్ని సరి చేసుకున్నారు. ఇప్పుడు ఆ అవకాశం లేదు. సినిమా ఓం రౌత్ చేతుల్లో లేదు. రన్ టైమ్ లాక్ చేసి సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేశారు. విదేశాలకు సైతం పంపేశారు. 


'ఆదిపురుష్'ను అందరూ చూడొచ్చు!
Adipurush Censor : 'ఆదిపురుష్' సెన్సార్ పూర్తి అయ్యింది. హిందీ సెన్సార్ బోర్డు ఈ సినిమాకు క్లీన్ 'యు' సర్టిఫికేట్ ఇచ్చింది. పిల్లలు, పెద్దలు... అందరూ పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) సినిమాను చూడొచ్చు అన్నమాట. సినిమా రన్ టైమ్ ఒక్క నిమిషం తక్కువ మూడు గంటలు. కంటెంట్ ఎంగేజింగ్‌గా ఉంటే... రన్ టైమ్ ఎక్కువైనా సరే ప్రేక్షకులు సినిమా చూస్తున్నారు. అందువల్ల, 'ఆదిపురుష్' చిత్ర బృందం మూడు గంటల సినిమాను చూపించడానికి మొగ్గు చూపించినట్టు ఉంది. 


సెన్సార్ రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఆదిపురుష్' చూసిన సెన్సార్ సభ్యులు దర్శక, నిర్మాతలను ప్రశంసించారని బీ టౌన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ తరం ప్రేక్షకులు సైతం హర్షించేలా సినిమా తీశారని చెప్పారట. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాల్లో ప్రభాస్ నటన, ఎమోషన్స్ అన్ని వర్గాలను ఆకట్టుకోవడం ఖాయమని యూనిట్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.      


అరణ్య కాండ, యుద్ధ కాండ...
రామాయణం నేపథ్యంలో 'ఆదిపురుష్' సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే, పూర్తి రామాయణాన్ని ఓం రౌత్ తీసుకోలేదు. అరణ్య కాండ, యుద్ధ కాండ... ఆ రెండిటిలో ముఖ్యమైన ఘట్టాలను తీసుకుని సినిమా తీశారు. జూన్ 16న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా త్రీడీలో విడుదల కానుంది.


Also Read : మొన్న 'రానా నాయుడు', నేడు 'సైతాన్' - స్పైసీగా తెలుగు వెబ్ సిరీస్‌లు, బూతులు & బోల్డ్ సీన్లు!



 
ఇటువంటి దర్శకుడిని 20 ఏళ్ళల్లో చూడలేదు! 
తన 20 ఏళ్ళ కెరీర్ లో ఓం రౌత్ లాంటి దర్శకుడు ఎవడినీ చూడలేదని ప్రభాస్ వ్యాఖ్యానించడం విశేషం. గత ఏడెనిమిది నెలలుగా ప్రతిరోజూ నిద్ర లేకుండా పని చేశారని ఆయన చెప్పారు. రోజుకు రెండు మూడు గంటలు మాత్రమే నిద్ర పోయారని, కుటుంబాలకు టైమ్ లేకుండా ఒక్కొక్కరూ పది రేట్లు పని చేశారని ఆయన చెప్పారు. గడిచిన ఎనిమిది నెలలు ఓం రౌత్ అండ్ టీమ్ ఒక యుద్ధం చేశారని, ఒక్కసారి వాళ్ళ ముఖాలు చూడమని ప్రభాస్ వ్యాఖ్యానించారు. 'ఆదిపురుష్'లో సీతా దేవిగా కృతి సనన్ నటించారు. లక్ష్మణుడి పాత్రను సన్నీ సింగ్, హనుమంతుని పాత్రను దేవదత్తా నాగే పోషించారు. లంకేశుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించారు.


Also Read తిరుమలలో ముద్దులు, కౌగిలింతలా? ఇది సీతారాములను అవమానించడమే! - 'ఆదిపురుష్' దర్శకుడు ఓం రౌత్, హీరోయిన్ కృతిపై విమర్శల వెల్లువ