దేవిని ఎక్కడికి తీసుకెళ్లావ్, ఎందుకు తీసుకెళ్లావ్ అని మాధవ్ ని నిలదిస్తుంది జానకి. ఏంటమ్మా నన్ను అనుమానిస్తున్నావా అని మాధవ్ అనేసరికి అవును నీ పద్ధతులు, చేష్టలు మారాయి అనుమానించాల్సి వస్తోంది, ఇంతక ముందు గది దాటి బయటకి వచ్చే వాడివే కాదు ఇప్పుడు ఇంట్లో ఉండటమే మానేశావ్ పిల్లలతో కలిసి మాట్లాడేవాడివి ఇప్పుడు వాళ్ళని దగ్గరకి తీసుకోవడమే మానేశావ్ నీలో ఇన్ని మార్పులు కనిపిస్తుంటే అనుమానించక ఏం చెయ్యమంటావ్ అని జానకి సీరియస్ గా మాట్లాడుతుంది. నేను ఏదో ముఖ్యమైన పని మీద తిరుగుతూ ఇంట్లో ఉండటం లేదు దానికే అనుమానిస్తే ఎలా అని మాధవ్ అంటాడు. ఒక్కటి గుర్తు పెట్టుకో నువ్వు ఇప్పటికీ నిజం చెప్పడం లేదని నాకు తెలుసు, నువ్వు ఈ ఊరి ప్రెసిడెంట్ రామూర్తిగారి అబ్బాయివి నువ్వు ఏ చిన్న తప్పు చేసినా ఈ ఊరి ముందు మీ నాన్న తలదించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తుంది.


ఏంటి అమ్మకి నా మీద అనుమానం ఎందుకు వచ్చిందని అనుకుంటాడు మాధవ్. దేవి తన తండ్రి గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఏంటి బిడ్డ ఆలోచిస్తున్నావ్ అని రుక్మిణి అడుగుతుంది. వచ్చిన దగ్గర నుంచి అదోలా ఉన్నావ్ ఏం మాట్లాడటం లేదు ఎందుకు అలా ఉన్నావ్ అని అన్నం తినిపించబోతుంటే వద్దని మొహం పక్కకి తిప్పేస్తుంది. వచ్చిన దగ్గర నుంచి తిండి కూడా తినకుండా బాధపడుతున్నావంటే ఏదో జరిగింది ఏమైంది ఈ అమ్మకి కూడా చెప్పవా? అని అడుగుతుంది. తల్లిని కౌగలించుకుని దేవి వెక్కి వెక్కి ఏడుస్తూ నాయన కావాలి నాయన గుర్తొస్తున్నాడని చెప్తుంది.


Also Read: కార్తీక్ కి మోనిత గోరుముద్దలు, నువ్వు నా భార్యని కాదంటూ దీపని గుర్తుచేసుకున్న డాక్టర్ బాబు!


ఆదిత్య రుక్మిణి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. దేవిని ఇంక అక్కడే ఉంచితే చాలా నష్టపోవాల్సి వస్తుంది, వాడి నా బిడ్డ మనసు పాడు చెయ్యకముందే నేను దేవిని తెచ్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. నేను దేవికి తండ్రిని అని చెప్పడానికి ఈ ఫోటోనే సాక్ష్యం ఇది చూపించి వెంటనే దేవికి నిజం చెప్పి నా ఇంటికి తీసుకొచ్చుకుంటాను అని ఆదిత్య వాళ్ళ పెళ్లి ఫోటో చూస్తూ అనుకుంటాడు. రుక్మిణికి ఫోన్ చేసి దేవిని తీసుకుని రా నేనే నా బిడ్డకి తండ్రిని అని తెలియాలి తనని వెంటనే ఆఫీసు దగ్గరకి తీసుకుని రమ్మని చెప్తాడు. దేవి వచ్చి బయటకి వెళ్ళాలి రా అని రుక్మిణిని బలవంతంగా తీసుకుని వెళ్ళిపోతుంది. వెళ్ళు రాధ నీకోసం ఒక గుండె పగిలే బహుమతి వెయిట్ చేస్తూ ఉందని మాధవ్ అనుకుంటాడు.      


దేవి మల్లికార్జున్ దగ్గరకి రుక్మిణి తీసుకొచ్చి చూపిస్తూ చూడమ్మా నాయన చూడు మనం అగుపడలేదని బాధ్యలో పిచ్చోడిలెక్క ఎలా ఉన్నాడో చూడు అని అంటుంది. లే బిడ్డ.. అని రుక్మిణి ఏదో చెప్పబోతుంటే దేవి అడ్డుపడి నువ్వు ఏం చేప్తవో నాకు తెలుసు ఆయన మా నాయన కాదు అంటావ్ ఆయన అసలు ఎవరో తెలియదంటావ్ అని నాయన నాకు ముందే చెప్పాడు. ఒక్కసారి నాయన మొహం చూడు, నాయన్ని మార్చుకుందాం మారతాడు. తాగి తన్నకుండా మంచిగా చూసుకుంటే వస్తా అని చెప్పు రా అని దేవి అంటుంది. బిడ్డా ఆయన మీ నాయన కాదు ఆయనెవరో కూడా నాకు తెలియదు ఆయన మీ నాయన అంటే ఎట్లా నమ్మినావ్ అని రుక్మిణి అడుగుతుంది. అయితే మరి మా నాయన ఎవరో చెప్పమని అంటుంది.


Also Read:  తరగతి గది దాటి తరలిన కథ , ఐ లవ్ యూ రిషి సార్ నన్ను క్షమించండి నా ప్రేమని అంగీకరించండని చెప్పేసిన వసు


ఆదిత్య దేవిని రుక్మిణి తీసుకుని వస్తుందని ఎదురు చూస్తూ ఆనందపడతా ఉంటాడు. ఆ మాధవ్ సారు ఎంత పని చేశాడు ఎవడినో చూపించి నాయన అని చెప్పాడు అది దేవమ్మ నమ్మేసింది. ఈ విషయం పెనిమిటికి తెలిస్తే తట్టుకుంటాడా. ఇప్పుడు ఏం చెయ్యాలి, నా బిడ్డకి వాడు నాయన కాదని ఎట్లా చెప్పాలని ఆలోచిస్తుంది. వాడు మీ నాయన కాదని రుక్మిణి ఎంత చెప్పినా దేవి మాత్రం వినదు.