Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode దేవయాని, మనీషా మాట్లాడుకుంటారు. కంపెనీ సరయు చేతిలో పెట్టడం బాలేదని దేవయాని మనీషాతో అంటుంది. ఛైర్మన్ పదవి మన ఫ్యామిలీని దాటి పోకూడదని అంటుంది. దానికి మనీషా ఎక్కడికీ పోవని సరయు పరాయిది కాదని నేను చెప్పినట్లు ఆడుతున్న కీలు బొమ్మ అని చెప్తుంది మనీషా.
మనీషా: రేపు ఓటింగ్‌లో మిత్ర ఓడిపోయి ఛైర్మన్ పదవి పోయి ఆ లక్ష్మీని మెడ పట్టుకొని గెంటేస్తాడు. కంపెనీని మళ్లీ పువ్వుల్లో పెట్టి మిత్రకు ఇస్తాను. ఛైర్మన్ పదవి ఇచ్చి పట్టాభిషేకం చేస్తా అలా నేను పట్టపురాణిని అవుతా. అది నా ప్లాన్.
దేవయాని: అంతా బాగుంది కానీ చివరి నిమిషంలో లక్ష్మీ ఏమైనా చేస్తే.
మనీషా: అంత లేదు ఆంటీ లక్ష్మీ ఏం చేయలేదు. రేపు లక్ష్మీని గెలిపించాలి అంటే ఆ దేవుడు దిగిరావాలి.
దేవయాని: రేపు లక్ష్మీ ఓడిపోవడం తథ్యం నీ గెలుపు ఖాయం
లక్కీ, జున్ను ఇద్దరూ రామ కోటి రాయడం చూసి దేవయాని, అరవిందలు ఇంత పొద్దున్న పూజ గదిలో ఏం చేస్తున్నారని అడుగుతారు. దానికి ఇద్దరూ రాత్రి నుంచి రామ కోటి రాస్తున్నామని చెప్తారు. ఇద్దరూ షాక్ అయి రాత్రి నుంచి రాస్తున్నారా ఎందుకు అని అడిగితే.. మన కంపెనీ కోసం అని ఆంజనేయ స్వామి రాయమని చెప్పారని అంటారు. కంపెనీ కోసం మీరు కష్టపడుతున్నారా అని అంటారు. ఇక పిల్లలు ఇద్దరూ ఎప్పటిలా నాన్నే కంపెనీ ఛైర్మన్ అవుతారని ఆంజనేయ స్వామి కాపాడుతారని చెప్తారు. ఇక పిల్లలు ఇద్దరూ రామ కోటి రాసే బయటకు వస్తామని అంటారు. ఇద్దరూ రామ కోటి పూర్తి చేసి దేవుడి దగ్గర పెట్టి తల్లిదండ్రులు కలవాలని కోరుకుంటారు.
మరోవైపు మిత్ర ఆలోచిస్తూ ఉంటాడు. మనీషా మిత్ర దగ్గరకు వెళ్లి ఆల్‌మోస్ట్ మనకు ఓటమే అని అక్కడికి ఇప్పుడు వెళ్లి ఇన్‌సల్ట్ అవ్వొద్దని ఈ కంపెనీ కాకపోతే మరో కంపెనీ అని చెప్తుంది. మిత్ర ఏం మాట్లాడకుండా కిందకి వెళ్తాడు. మిత్ర వెంట మనీషా వస్తుంది. అందరూ హాల్‌లో ఉంటారు. మిత్రని ఇంకా రెడీ అవ్వలేదని అడుగుతారు. ఎందుకు రావాలి దురాశావాదులు అక్కడ ఉన్నారని అలాంటి కంపెనీ ఉంటే ఎంత పోతే ఎంత మనం వాళ్ల మంచి కోరితే వాళ్లు మన చెడు కోరుతున్నారు నేను రాను అని మిత్ర అంటాడు. ఇంట్లో అందరూ మిత్రని ఓటింగ్ దగ్గరకు వెళ్లమని చెప్తారు. మిత్ర వెళ్లను అంటాడు. మనీషా, దేవయానిలు కూడా మిత్రని వెళ్లనివ్వమని అంటారు. వెళ్లకపోతే పరువు పోతుందని అందరూ అంటారు. మిత్ర వివేక్ దగ్గర ఫైల్ తీసుకొని సంతకం పెట్టి వాళ్లకి కావాల్సిన ఇదే అని ఇచ్చేయ్ అంటాడు. ఇక మిత్ర వెళ్లిపోతాడు. లక్ష్మీ తాను వెళ్తానని అంటుంది. మిత్ర పరువు కోసం నేను వెళ్తానంటుంది. లక్ష్మీ వెంట వివేక్ కూడా వెళ్తాడు.
మరోవైపు అందరూ ఆఫీస్ చేరుకుంటారు. మీడియా మొత్తం సరయు కొత్త ఛైర్మన్ అని న్యూస్ కవర్ చేస్తారు. ఇక మిత్ర వాళ్లు వస్తున్నారా అని అడిగితే మిత్ర తరుఫున లక్ష్మీ వస్తుందని చెప్తారు. లక్ష్మీ, వివేక్ కాన్ఫరెన్స్ హాల్‌కి చేరుకుంటారు. సరయు లక్ష్మీని చూసి వెల్ కమ్ అంటుంది. లక్ష్మీ వాళ్లు వెళ్లి కూర్చొంటారు. ఓటింగ్ మొదలు పెడదామని సరయు అంటే లక్ష్మీ ఆగమని అంటుంది. షేర్ హోల్డర్స్‌తో మాట్లాడుతుంది. ఎన్నో ఏళ్లుగా ఈ కంపెనీలో ఉన్నారు మా మామయ్య, మిత్ర గారితో మీకు మంచి అనుబంధం ఉంది ఎన్నో ఏళ్లుగా మీతో ఉన్న వాళ్లని దృష్టి పెట్టుకొని ఓటింగ్ చేయమని అంటుంది. దాంతో వాళ్లు మీ వాళ్ల వల్ల మేం లాభ పడింది ఏం లేదు అంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: సత్య మీద సంజయ్ కళ్లు, వంకర మాటలు.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి భర్తకి కంప్లైంట్ ఇచ్చిన సత్య!