Karthika Deepam 2 Serial October 24th: కార్తీకదీపం 2 సీరియల్: నాన్న అని పిలిచిన శౌర్య.. దీప, కార్తీక్‌లో శౌర్య ఫ్యామిలీ ఫొటో.. పిచ్చిదానిలా అయిపోతున్న జ్యోత్స్న!  

Karthika Deepam 2 Serial Episode దీప, కార్తీక్‌లను ఒకటి చేయాలని కాంచన శౌర్యతో చెప్తే శౌర్య వాళ్లని తీసుకొచ్చి పక్కపక్కన కూర్చొపెట్టి ఫ్యామిలీ ఫొటో తీయించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Continues below advertisement

Karthika Deepam Idi Nava Vasantham Serial Episode శౌర్య కార్తీక్‌ని నాన్న అని పిలుస్తుంది. కార్తీక్ పట్టించుకోడు. తర్వాత కార్తీక్ అని పిలిస్తే వెంటనే ఏంటి రౌడీ అని అడుగుతాడు. దాంతో శౌర్య నాన్న అని పిలిస్తే పలక లేదు కార్తీక్ అంటే పలికావు నీకు నేను నాన్న అని పిలవడం ఇష్టం లేదా అని అడుగుతుంది. దానికి కార్తీక్ మనసులో ఓ నేను ఇప్పుడు నీకు నాన్నకి కదా పిలుపు కొత్తగా ఉందని అనుకుంటారు. ఇక శౌర్య కార్తీక్‌ని నాన్న అని పిలవొచ్చా అని అడుగుతుంది. దానికి కార్తీక్ పిలవొచ్చని చెప్తాడు. శౌర్య నాన్న అని పిలవగానే దగ్గరకు తీసుకొని హత్తుకుంటాడు. దూరం నుంచి కాంచన, అనసూయ చూస్తారు.

Continues below advertisement

అనసూయ: అక్కడ తల్లిని మనం కదిలించామ్ ఇక్కడ కూతురు తండ్రిని కదిలించింది.
కాంచన: కదిలిస్తే సరిపోదు అనసూయ వాళ్లని మనమే కలపాలి. 
శౌర్య: నిన్ను నాన్న అనిపిలిస్తే చాలా హ్యాపీగా ఉంది.
కాంచన: మనసులో నాకు నీ సంతోషం తప్పు ఇంకేం వద్దు కార్తీక్
అనసూయ: మనసులో ఒక తండ్రి కూడా కూతురిని ఇలా చూడడేమో బాబు నీ దగ్గర ఉంటే తను ఆరోగ్యంగా ఉంటుంది.
కార్తీక్: నాన్నకి వర్క్ ఉంది నువ్వు వెళ్లు రౌడీ.
శౌర్య: సరే నాన్న నీకు ఏమైనా కావాలా నాన్న.. నీకు ఏమైనా కావాలి అంటే చెప్పు నాన్న.

అనసూయ, కాంచనలు శౌర్యని పిలిచి మీ అమ్మానాన్నలు కూడా సంతోషంగా ఉండాలి కదా ఇద్దరూ పక్కపక్కన ఉండి నువ్వు ఇద్దరినీ హగ్ చేసుకుంటే ఎలా ఉంటుందో చెప్పు అంటుంది. దానికి శౌర్య నాకు అర్థమైంది అని కార్తీక్‌ దగ్గరకు వెళ్లి నాన్న రా అని పిలుస్తుంది. సోఫాలో కూర్చొపెడుతుంది. ఇక దీప దగ్గరకు వెళ్లి దీపని తీసుకొచ్చి కార్తీక్ పక్కన కూర్చొపెడుతుంది. కార్తీక్ దీపల వెనక చేతులు వేసుకొని ఫోటో తీయమని కాంచనకు చెప్తుంది. ఫోటోలు చూసి శౌర్య ముచ్చట పడుతుంది. ఇంతలో కాశీ, స్వప్న, దాసులు అక్కడికి వస్తారు. శౌర్యతో మీ నాన్నకే కాదమ్మా ఆ ఫోటీ ఈ తాతయ్యకి చూపించు అని అంటాడు. 

దాసు: జరిగింది విన్నాం చాలా సంతోషంగా ఉంది. కార్తీక్ నాకు మేనల్లుడు దీప బాబాయ్ అని పిలిచి ఎప్పుడో వరస అయింది. పైగా మీరిద్దరూ మంచి వాళ్లు ఇద్దరూ మంచి వాళ్లు ఒకటి అవ్వడం చాలా సంతోషంగా ఉంది.
కాంచన: చాలా బాగా చెప్పారు అన్నయ్య.

స్వప్న అన్న వదినలకు కంగ్రాట్స్ చెప్తుంది. స్వీట్ తినిపించి కాశీ కంగ్రాట్స్ చెప్తాడు. మీకు ఈ విషయం ఎవరు చెప్పారని అంటే పారిజాతం చెప్పిందని అంటాడు. ఇక దీప  పని ఉందని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక దీప కోసం శౌర్య స్వీట్ తీసుకెళ్తుంది. ఇక అందరూ సరదాగా జోకులు వేసుకొని నవ్వుకుంటారు. దీప కిచెన్‌లోకి వెళ్లి ఇలా జరిగిందేంటని నేను బాధ పడుతుంటే శుభవార్త అని లడ్డులు తీసుకొచ్చారు అనుకుంటుంది. శౌర్య వస్తే నన్ను ఎందుకు అలా కూర్చొపెట్టావని అడిగితే అమ్మానాన్నలు ఒకేదగ్గర ఉండాలి కదా అంటుంది.

ఇక కార్తక్ అక్కడికి వచ్చి మనల్ని ప్రేమించే వాళ్లని బాధ పెట్టకూడదని అంటాడు. దీప స్వీట్‌ తీసుకుంటుంది. నీ బాధని మర్చిపోవడానికి నీ చుట్టూ చాలా ప్రేమలు ఉన్నాయి దీప కాస్త నువ్వే అర్థం చేసుకొని ఆలోచించని కార్తీక్ చెప్తాడు. ఇక శౌర్య కాశీతో ఆడుకోవడానికి పిలుస్తుంది. స్వప్న, అనసూయలు దీపకు సాయం చేయడానికి వెళ్తారు. ఇక కార్తీక్ వచ్చి కాంచన పక్కన కూర్చొని మనసులో నీకు ఒక్క మాట చెప్పకుండా పెళ్లి చేసుకున్నా కనీసం ఎందుకు ఇలా చేశావ్ రా అని అడగకుండా కొడుకు కోడలిని అర్థం చేసుకున్నావని అనుకుంటాడు.

ఇక దాసు ఫోన్ మాట్లాడటానికి వెళ్తే శౌర్య బాలు వాళ్ల బ్యాగ్ దగ్గర పడుతుంది. అందులో కుబేర ఫొటో ఉంటుంది. అది దాసు చూసే టైంకి అనసూయ వచ్చి మా తమ్ముడి ఫొటో అని తీసుకెళ్లిపోతుంది. మరోవైపు జ్యోత్స్న వైట్ పేపర్ మీద కోపం తగ్గేలా గీతలు తీస్తూ ఉంటుంది. సుమిత్ర, దశరథ్ అక్కడికి వస్తారు. నీ పెళ్లి గురించి మాట్లాడాలి అంటే నా పెళ్లి నేను పుట్టకముందే బావతో అయిపోయింది కదా అంటుంది. నీ మనసులో అలాంటి ఆలోచన పుట్టించినందకు క్షమించమని అడుగుతారు. దానికి జ్యోత్స్న క్షమించడం అంటే బావని నా మనసు నుంచి తీసేసి మీరు చూపించిన సంబంధం చేసుకొని హ్యాపీగా ఉండటమే అంటుంది. ఇప్పుడు మీరు వచ్చింది కూడా అందుకే కదా అంటుంది. ఇప్పుడు మిమల్ని క్షమిస్తే నీకు మంచి సంబంధం చూశాం తాత ఫ్రెండ్ విశ్వనాథం ఫ్రెండ్ మనవడితో నీ పెళ్లి అని అంటారు అంతే కదా అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  

Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: జున్ను, లక్కీలకు ప్రత్యక్షమైన ఆంజనేయస్వామి.. కంపెనీ కోసం పాట్లు!

Continues below advertisement
Sponsored Links by Taboola