Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode తనని నువ్వు వదిలి వెళ్లిపోయావనే బాధ మిత్ర చెప్పాడని లక్ష్మీతో అందరూ చెప్తారు. కంపెనీ కాపాడాల్సిన బాధ్యత లక్ష్మీ మీదే పెడతారు. ఈ గండం నుంచి కూడా మిత్రను నువ్వే కాపాడాలని చెప్తారు. ఆ మాటలు విన్న మనీషా, దేవయానిలు అందరూ లక్ష్మీని మునగ చెట్టు ఎక్కిస్తున్నారని కంపెనీని కాపాడటం ఎవరి తరం కాదని లక్ష్మీని కాపాడాలి అంటే ఆ దేవుడే దిగి రావాలని ఇద్దరూ అనుకుంటారు.


లక్ష్మీ గదిలోకి వెళ్లి ఆలోచిస్తుంది. మిత్ర మాటలు తలచుకొని ఏడుస్తుంది. జున్ను, లక్కీలు లక్ష్మీని చూసి బాధగా అక్కడి నుంచి వెళ్లి మిత్రని చూస్తారు. మిత్ర కూడా కన్నీళ్లు పెట్టుకోవడంతో ఆరు బయటకు వెళ్లిపోతారు. అమ్మానాన్నలు డల్‌గా ఉన్నారని నాన్న నుంచి మన కంపెనీ లాగేసుకుంటారని అలా జరిగితే అమ్మానాన్నలతో పాటు మనం కూడా విడిపోతాం అని ఏడుస్తారు. దేవుడికి సాయం చేయమని అడుగుదామని అనుకొని శ్రీఆంజనేయం అని పిలుస్తారు. హనుమంతుడు పలకడం లేదని ప్రత్యక్షం కావడం లేదని జై శ్రీరామ్ అని తలచుకుంటారు. ఇంతలో రామ ధ్యానంలో ఉన్న హనుమంతుడు పిల్లలు తమని తలచుకోవడం గుర్తించి అక్కడ ప్రత్యక్షమవుతారు. పిల్లలు తమ ఎదురుగా ఆంజనేయ స్వామి ప్రత్యక్ష కావడంతో మేం రాముడిని పిలిస్తే తప్ప నువ్వు రావమని నీ వీక్ నెస్ తెలిసే రాముడిని పిలిచామని అంటారు.


నన్ను ఎందుకు పిలిచారు అని హనుమంతుడు అడిగితే మా అమ్మానాన్నల్ని కలుపుతావని, మా కంపెనీనీ కాపాడుతావని పిలిచామంటారు. దానికి అది నా పని కాదు అని హనుమంతుడు చెప్తే సీతా రాముల్ని కలిపిన నువ్వు మా అమ్మానాన్నల్ని కలపలేవా లంకని కాల్చిన నువ్వు మా కంపెనీనీ కాపాడలేవా అని అడుగుతాడు. ఇక హనుమంతుడు మానవరూపంలో ఉన్న మీరు ఏమైనా సాధించగలరు అని స్వామి అదృష్యం అవుతారు. అమ్మానాన్నల్ని మనమే కాపాడాలి కంపెనీనీ మనమే కాపాడుకోవాలని అనుకుంటారు.


సరయు కంపెనీ హోల్డర్స్ అందరికీ పార్టీ ఇస్తుంది. మరోవైపు లక్ష్మీ, మిత్రలు కంపెనీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. పిల్లలు కూడా ఏం చేయాలా అని తెగ ఆలోచించేస్తారు. ఆంజనేయ స్వామికి ఇష్టమైనపని మనం చేస్తే మనకు హనుమంతుడు సాయం చేస్తారని రాత్రి అంతా మేలుకొని రామ కోటి రాయాలని దేవుడి గదిలోకి వెళ్లి ఇద్దరూ రెండు పుస్తకాల్లో రామకోటి రాయడం ప్రారంభిస్తారు. ఇక లక్ష్మీ జయదేవ్ దగ్గరకు వచ్చి షేర్ హోల్డర్స్‌తో మాట్లాడమని అంటుంది. దాని వల్ల లాభం లేదని జయదేవ్ అంటాడు. కొంత మంది అయినా మీ వల్ల లాభం పొంది ఉంటారు కదా వాళ్లతో మాట్లాడమని లక్ష్మీ చెప్తుంది. జయదేవ్ కొంత మందితో మాట్లాడుతాడు. సరయు ఒక్కొక్కరికీ ఫోన్లు చేస్తున్నారని అంటుంది. దానికి మేనేజర్ ఈ గొర్రెలు మన మాట మాత్రమే వింటారని అంటాడు. ఇక దేవయాని మనీషా దగ్గరకు వచ్చి ఫోన్ల సంగతి చెప్తే అవన్నీ నాకు తెలుసని మనీషా అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 



Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: రాకేశ్‌, ప్రీతిల నిశ్చితార్థం పూర్తి.. 4 రోజుల్లో పెళ్లి.. ఏం చేయలేకపోయిన అత్తాకోడళ్లు!