Nindu Noorella Saavasam Serial Today Episode:   రామ్మూర్తి చేత ప్రిన్సిపాల్‌  కారు క్లీన్‌ చేయిస్తుంటే..  పిల్లలు దూరం నుంచి గమనిస్తారు. ప్రన్సిపాల్‌ సంగతి చెబుదాం అని వెళ్లబోతుంటే.. ఆగండి ఆమెకు మాటలతో చెబితే సరిపోదు అంటూ వెళ్లి  అంజు ఫోన్‌ తీసుకొచ్చి వీడియో తీస్తుంది. తర్వాత ఫోన్‌ ఇచ్చేసి నలుగురు కలిసి ప్రిన్సిపాల్‌ దగ్గరకు వెళ్లి మేడం మీరు న్యూస్‌ చూస్తారా? అని అడగ్గానే చూస్తాను.. సోషల్‌ మీడియాలో ట్రోల్‌ అయ్యే న్యూస్‌ ఎక్కువ చూస్తాను అని చెప్తుంది. పిల్లలు సరే బాయ్‌ మేడం అంటూ వెళ్లిపోతారు. మరోవైపు గుప్త ఒక్కడే గార్డెన్‌ లో ఉండి తనలో తానే ఆరు గురించి మాట్లాడుకుంటుంటాడు.  అమర్‌ ఆఫీసుకు వెళ్తూ చెప్పగానే..


భాగీ: ఒక్క నిమిషం ఎన్ని సార్లు చెప్పాను.. వెళ్తున్నాను కాదు వెళ్లొస్తాను అని చెప్పమని.


అమర్‌: అది ఏదో పొరపాటులో చెప్పాను. ఇప్పుడు ఏంటి..?


భాగీ: ఆ అలవాటే మార్చుకోమని చెప్పేది. మీరు వెళ్తున్నాను అని చెప్పి వెళ్తున్నపప్టి నుంచి తిరిగి వచ్చే వరకు ఎంత టెన్షన్‌ గా ఉంటుందో తెలుసా..?


అమర్‌: సరే మళ్లీ అననులే..


భాగీ: ఇప్పుడు అన్నారుగా.. కూర్చోండి.. ఇప్పుడే వస్తాను..


అని భాగీ లోపలికి వెళ్తుంది. మరోవైపు రామ్మూర్తి గేటు ఓపెన్‌ చేసుకుని ఇంట్లోకి వస్తాడు. రామ్మూర్తిని చూసిన గుప్త ఇతను వచ్చాడేంటి అనుకుంటాడు. రామ్మూర్తి లోపలికి వస్తూ గార్డెన్‌ వైపు చూస్తూ మెల్లగా నడుచుకుంటూ లోపలికి వెళ్తుంటాడు. రాథోడ్‌ ఎదురు వచ్చి పలకరిస్తాడు.


రాథోడ్‌: ఏంటి సార్‌ పిలిస్తేనే రారు అలాంటిది పిలవకుండానే వచ్చారు. ఏంటి విషయాలు.


రామ్మూర్తి: నిన్నటి నుంచి మనసులో ఏదో అలజడి రాథోడ్‌. ఏదో జరిగిపోయింది. నా కూతురుకు ఏదో జరిగింది అని భయంగా ఉంది. అమ్మాయితో ఫోన్‌ లో మాట్లాడాను కానీ అమ్మాయిన ఒక్కసారి చూడాలని వచ్చాను.


రాథోడ్: ఏంటి సార్‌ మీరు మా సార్‌ ఉండగా.. మీ కూతురుకు ఏమైనా అవ్వనిస్తారా? ఒకవేళ ప్రమాదం వచ్చినా తన ప్రాణాలు అడ్డువేసి కాపాడతాడు.


రామ్మూర్తి: తెలుసు రాథోడ్‌.. కానీ ఈ సారి ఎంత నచ్చజెప్పుకున్నా మనసులో అలజడి తగ్గడం లేదు.


రాథోడ్: అయితే లోపలికి వచ్చి నీ కూతురు యోగక్షేమాలు తెలుసుకుందురు రండి.


అని ఇద్దరూ లోపలికి వెళ్లిపోతారు. పుట్టినప్పుడు కూతురు ముఖం కూడా చూడని తండ్రి ఇప్పుడు ఆ కూతురు లోకం విడిచి వెళ్లిన కూతురు ప్రమాదంలో ఉన్నందుకు ఆ తండ్రి మనసు విలవిలలాడుతున్నది అనుకుంటాడు గుప్త. భాగీకి అమ్మవారి దీక్ష చేపట్టమని ఎలా చెప్పాలి అని అయోమయంలో పడి.. ఈ సమస్యకు పరిష్కారం చూపమని యముణ్ని ప్రార్థిస్తాడు గుప్త. లోపలికి వచ్చిన రామ్మూర్తిని చూసి భాగీ హ్యాపీగా ఫీలవుతుంది.


భాగీ: నాన్నా ఎలా ఉన్నావు నాన్నా..


రామ్మూర్తి: నేను బాగున్నాను తల్లి.. నువ్వెలా ఉన్నావు అమ్మా..


శివరాం: ఏంటి బావగారు అంజు బర్తుడేకు వస్తామని మీరు రాలేదు. మీరు రాలేదు కాబట్టి మేం ఎవరం మీతో మాట్లాడము..


నిర్మల: మీరు వస్తారని పిల్లలు బాగా సంతోషపడ్డారు అన్నయ్య గారు. మీరు రాలేదని తెలిసి వాళ్లు చాలా బాధపడ్డారు.


రామ్మూర్తి: అంటే ఊరి నుంచి తెలిసిన వాళ్లు వచ్చారమ్మా వాళ్లను వదిలి రాలేకపోయాను. బాబుగారు రాలేకపోయినందుకు క్షమించండి.


అమర్‌: అయ్యో ఎందుకులేండి.. మీకు ఏదో ముఖ్యమైన పని ఉంటేనే రారని తెలుసు కదా?


 అని అందరూ మాట్లాడుకుంటుంటే ఇంతలో రాథోడ్‌ మీ కూతురును చూసుకున్నారు కదా సార్‌ ఇక హ్యాపీయేనా..? అంటాడు. ఏమైంది రాథోడ్‌ అంటూ అందరూ అడుగుతారు. రామ్మూర్తి ఎందుకు వచ్చింది చెప్తాడు రాథోడ్. దీంతో రామ్మూర్తి ఎమోషనల్‌ గా ఫీలవుతాడు. తర్వాత అమర్‌ వెళ్లిపోతాడు. రామ్మూర్తి, భాగీ గార్డెన్‌ లోకి వస్తారు.


భాగీ: ఎందుకు నాన్నా అలా ఉన్నారు. నాకు ఏమైనా అవుతుందని ఎందుకు భయపడుతున్నారు చెప్పండి నాన్నా.. అసలు ఏమైంది.


రామ్మూర్తి: అమ్మా భాగీ ఇక్కడ అంతా బాగానే ఉంది కదా? ఆ మనోహరి వల్ల నువ్వేమైనా బాధపడుతున్నావా అమ్మా.. అల్లుడు గారు నిన్ను ఏమైనా అంటున్నారా..?


భాగీ: నాన్నా నేను చాలా బాగున్నాను. ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. ఇక మనోహరి అంటావా? తన తిక్క నేను కుదుర్చుతాను.


రామ్మూర్తి: నిన్నటి నుంచి నా మనసు ఎందుకే ఒకటే కీడు శంకిస్తుంది అమ్మా..


భాగీ: ఎందుకో తెలియడం లేదు కానీ  నాక్కూడా చాలా భయంగా ఉంది నాన్నా.. ఎవరికో ఏదో అయినట్టు చాలా నిస్సహాయంగా ఉంది.



 అని ఇద్దరికీ ఒకేలా మనసుకు బాధగా ఉందిని ఎమోషనల్‌ అవుతారు. ఇంతలో భాగీ.. అక్క ఏదైనా ప్రమాదంలో ఉందేమో అంటుంది. మీకు నాకు తెలియకుండా ఒకటే సారి ఇలా అనిపిస్తుందంటే కచ్చితంగా అక్కకు ఏదో కష్టం వచ్చినట్టు అనిపిస్తుంది నాన్నా.. అనగానే రామ్మూర్తి ఏడుస్తాడు. కిందపడిపోతాడు. దీంతో గుప్త రక్తసంబంధమునకు ఇంత శక్తి ఉందా? అనిపిస్తుంది అనుకుంటాడు. ఇంతలో భాగీ ఎంత కష్టం వచ్చినా అక్కకు అమ్మవారే తోడుగా ఉంటుందని చెప్తావు కదా నాన్నా అందుకే ఇప్పుడు అమ్మవారి దీక్ష చేద్దామని అంటుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  



ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!