Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode Written Update : లక్ష్మీ గతంలో జరిగిన ప్రమాదం తలచుకొని టెన్షన్ పడుతుంది. ఇక పిల్లలు అందరూ సైలెంట్‌గా ఉన్నారని బోర్ కొడుతుందని అనుకుంటారు. ఇక డైవర్‌కి చెప్పి పాటలు పెట్టమని అడుగుతారు. అది విన్న దేవయాని ఇప్పుడు పాటలు ఎందుకురా అని జున్ను మీద అరుస్తుంది. అందరం కలిసి డ్యాన్స్ చేద్దమని అంటారు. ఇక మరోవైపు దీక్షితులు గారు మిత్ర కుటుంబానికి ఏం కాకూడదని హోమం చేస్తుంటారు. లక్ష్మీ గతంలో ఇదే సంభాషణ జరగడం ఇప్పుడు ఇలా అవ్వడంతో టెన్షన్ పడుతుంది. 


వివేక్ సాంగ్స్ పెట్టమని అంటే వద్దు అని పెద్దగా అరుస్తుంది. ఏమైందని అందరూ అనుకుంటారు. ఎవరూ నా మాట కాదనొద్దని చెప్తుంది. మరోవైపు జయదేవ్ ఓ చెక్ పోస్ట్‌ని చేరుకుంటాడు. బస్ గురించి అడుగుతాడు. తన ఫ్యామిలీ మొత్తం చింతపల్లి వెళ్తున్నారని ఎలా అయినా ఆపమని చెప్తాడు. దాంతో పోలీసులు బస్ వివరాలు అడిగి ఎలా అయినా ఆ బస్‌ని ఆపమని చెప్తారు. అయితే అక్కడున్న పోలీస్ వివరాలు రాసుకునే లోపు బస్ వెళ్లిపోతుంది. అయితే బస్ వెళ్లిపోయిందని పోలీస్ మళ్లీ కాల్ చేసి చెప్తారు. చేసేదేం లేక జయదేవ్ మళ్లీ బస్‌ని ఫాలో అవ్వాలని వెళ్తారు. 



లక్కీ, జున్నులకు ఎందుకు డల్‌గా ఉన్నారని మిత్ర అడుగుతాడు. పాటలు పెట్టాలా అని అడిగి నేను పెట్టిస్తానని అంటాడు. ఎవరు ఏమనుకున్నా మీరు ఎంజాయ్ చేయాల్సిందే అంటాడు. డ్రైవర్‌కి చెప్పి పాటలు పెట్టమంటాడు. లక్ష్మీ ఆపబోతే జాను లక్ష్మీని ఆపుతుంది. ఇక డ్రైవర్ పాటలు పెడితే పిల్లలు డ్యాన్స్ చేస్తారు. తర్వాత జాను, వివేక్ డ్యాన్స్ చేస్తారు. తర్వాత అందరూ డ్యాన్స్ చేస్తారు. లక్ష్మీ  మాత్రం చాలా టెన్షన్ పడుతుంది. రాత్రి అయిపోతుంది కొంత మంది పడుకుంటారు. మనీషా పెట్టిన లోకేషన్‌ను సరయు చూస్తూ ఉంటుంది. లక్ష్మీ ఒడిలో జున్ను  పడుకుంటే లక్ష్మీ బస్ గ్లాస్ మూయాని ప్రయత్నించి మూయలేకపోతే మిత్ర చూసి సాయం చేస్తాడు. ఇక బస్ రాత్రి ఓ చెక్ పోస్ట్ దగ్గరకు చేరుకుంటుంది. మిత్ర కిందకి దిగి పోలీసులతో మాట్లాడుతాడు. ఈ రూట్ మంచిది కాదని రాత్రి యాక్సిడెంట్స్ అవుతాయని ఆ రూట్‌లో వెళ్లడం మంచిది కాదని చెప్తారు. లక్ష్మీ మిత్రతో వెళ్లొద్దని అంటుంది. మిత్ర మాత్రం వెళ్దామంటాడు. డ్రైవర్ ఎక్కువ మంచు పడితే తనకు కనిపించదని చెప్పడంతో మిత్ర డ్రైవింగ్ చేస్తానంటాడు. మిత్ర డ్రైవింగ్ చేస్తుంటే లక్ష్మీ పక్కన కూర్చొని రూట్ చెప్తానని అంటుంది. లక్ష్మీని వెళ్లిపోమని మిత్ర అంటాడు. దాంతో మనీషా దేవయానితో ఊరు వెళ్లేలోపు ఏదో ఒకటి జరుగుతుందని అంటుంది. 


ఇంతలో లక్ష్మీకి జయదేవ్ కాల్ చేస్తాడు. మీ కోసం ఫాలో అవుతున్నానని మీకు ప్రమాదం జరగబోతుందని దీక్షితులు గారు చెప్పారని బస్ ఆపమని చెప్తారు. దాంతో లక్ష్మీ మిత్ర విషయం చెప్తే మిత్ర వినడు. లక్ష్మీని తిట్టి ఆగిపోదాం అంటావేంటి అని తిడతాడు. ఎంత చెప్పినా మిత్ర వినడు ఇంతలో నెలలు నిండిన ఓ గర్భవతిని ఇద్దరు కర్రకు కట్టి తీసుకురావడం చూసిన లక్ష్మీ ఆపి బస్ ఎక్కిస్తుంది. హాస్పిటల్‌లో డ్రాప్ చేసి వెళ్దామని చెప్తుంది. దాంతో మిత్ర బస్ రూట్ మారిపోతుంది. బస్ రూట్ మారిపోయిందని బాంబ్ పెట్టిన వైపు కాకుండా ఇంకోవైపు వెళ్తుందని సరయు టెన్సన్ పడుతుంది. తన వాళ్లకి ఫోన్ చేసి ఏం జరుగుతుందో తెలుసుకొని ప్లాన్ బీ అమలు చేయమని చెప్పమని మ్యానేజర్‌తో చెప్తుంది. ఇక జయదేవ్ చెక్‌ పోస్ట్ చేరుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: సత్యభామ సీరియల్: మీడియాలో మహదేవయ్య పరువు.. ఎమ్మెల్యే టికెట్ డౌటే.. డీఎన్ఏ టెస్ట్ సలహా ఇచ్చిన సత్య!