Satyabhama Serial Today Episode గంగని సపోర్ట్ చేయడానికి నర్శింహ మహదేవయ్య ఇంటికి వస్తాడు. మీడియా నర్శింహని ప్రశ్నిస్తుంది. తానే కాబోయే ఎమ్మెల్యే అని మహదేవయ్యకి ఆ అర్హత లేదని మహదేవయ్య అన్యాయం చేసిన గంగకు తాను అండగా ఉంటానని గంగతో పాటు నిరాహార దీక్ష చేస్తానని అంటాడు. 


గంగ: అయ్యా  మహదేవయ్య మొదటి భార్యని ఏసీలో ఉంచి రెండో భార్య అయిన నన్నుఇలా ఎండలో ఉండే పరిస్థితి తీసుకొచ్చాడు. నా మొదటి కొడుకుని తాను కబ్జా చేసుకున్నాడు. తన వల్ల పుట్టిన రెండో కొడుకుని ఇలా గాలికి వదిలేశాడు. నాకు న్యాయం కావాలి. 


ఇక మహదేవయ్య పరువు తక్కువ పనులు అని టీవీలో న్యూస్ వస్తుంది. అందరూ న్యూస్ చూసి షాక్ అయిపోతారు. టీవీలో నర్శింహ రెచ్చిపోతాడు. క్రిష్ తండ్రితో నర్శింహ రెచ్చిపోతున్నాడు. నువ్వు ఊ ఉంటే వాడి పంచె ఊడగొట్టి పరుగులు పెట్టిస్తా అందరినీ ఇంటి ముందు నుంచి తరిమేస్తా అంటాడు. సత్య ఆపుతుంది. ఇంతలో పార్టీ ఇన్‌ఛార్జ్‌ మహదేవయ్యకి ఫోన్ చేసి ఆ గంగ దెబ్బకి నీ దిమాఖ్ పోయినట్లుంది. మొదటి భార్య పర్మిషన్ లేకుండా రెండో పెళ్లి చేసుకుంటే ఎమ్మెల్యే టికెట్ కష్టమని అంటాడు. దాంతో మహదేవయ్య గంగ ఎవరో నాకు తెలీదు అని నెత్తి నోరు కొట్టుకుంటాడు. 


మరోవైపు నందిని ఆవేశంలో వచ్చి భోజనానికి కూర్చొంటుంది. విశాలాక్షి హర్ష గురించి అడిగితే నందిని కోప్పడుతుంది. హర్ష వచ్చి నందిని పక్కన కూర్చొంటే నందిని లేచి సంధ్య పక్కకి వెళ్లిపోతుంది. ఏమైందని ఇంట్లో వాళ్లు అడుగుతారు. హర్ష తర్వాత తింటానని లేచి వెళ్లిపోబోతే విశాలాక్షి అడుగుతుంది. నందిని మైత్రి దగ్గరకు వెళ్లాడని చెప్పి కస్సుబుస్సులాడుతుంది. మరోవైపు మహదేవయ్య ఆకలి అని అరుస్తాడు. భైరవి ఏదో అంటే రేణుకతో పసుపు తాడు తీసుకురా దాన్ని పెళ్లి చేసుకుంటానని అంటాడు. భైరవి ఏడుస్తుంది. మరోవైపు మహిళా సంఘాలు మహదేవయ్య మీద రెచ్చిపోతాయి. మీడియాలో చాలా మంది మహదేవయ్యని తిడతారు. ఎమ్మెల్యే టికెట్ పోయే పరిస్థితి వచ్చిందని టీవీలో చూపిస్తారు.


మహదేవయ్య: గంగ గంగ గంగ అసలెవరీ గంగ నా ఇజ్జత్ మొత్తం తీసేసింది. ఎందుకురా అది నా వెంట పడుతుంది.
రేణుక: మామయ్య వేడి వేడిగా కాఫీ తీసుకురానా
మహదేవయ్య: కాస్త విషం తీసుకురా రేణుక తాగి చస్తా. అందరూ ఒకే సారి దాడి చేస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ కాపాడుకోవాలంటే ఏదో ఒకటి చేయాలి.
భైరవి: అయితే నాకు విడాకులు ఇచ్చేయయ్యా అప్పుడు నీకు ఆ గంగ ఒక్కర్తే భార్య అవుతుంది. ఆరాంగా ఎమ్మెల్యే టికెట్ నీకే వస్తుంది. నువ్వేంటి అయ్యా అలా చూస్తున్నావ్ నిజంగానే నాకు విడాకులు ఇస్తావేంటి.
సత్య: మామయ్య ఒక పని చేద్దాం. మహిళా సంఘాలు వాళ్లు రాగానే మామయ్య బయటకి వెళ్లి మాట్లాడాలి. క్రిష్ ఎలాగూ గంగ బిడ్డ కాదు కదా గంగకి క్రిష్‌కి డీఎన్‌ఏ టెస్ట్ చేయమని మామయ్య ఛాలెంజ్ చేయాలి. వాళ్లిద్దరి డీఎన్ఏ మ్యాచ్ కాదు కాబట్టి క్రిష్ ఆమె కొడుకు కాదని తెలుస్తుంది.
క్రిష్‌: అప్పుడు నా చేతిలో ఆ గంగకి ఉంటుంది చూడు.
మహదేవయ్య: సరే సరే
సత్య: నా ఉచ్చులో పడ్డారు మామయ్య ఇప్పుడు చూడండి


మరోవైపు మైత్రి దగ్గరకు వెళ్లినందుకు విశాలాక్షి, విశ్వనాథం హర్షని తిడతాడు. నందినిని ఇబ్బంది పెట్టొద్దని చెప్తారు. నందిని బాధకి అర్థముందని ఇక నుంచి కచ్చితంగా మైత్రికి దూరంగా ఉండమని చెప్తారు. ఇంతలో మైత్రి హర్షకి కాల్ చేస్తాడు. హర్ష కాల్ కట్ చేస్తాడు. మైత్రి తన ఫ్రెండ్‌తో చెప్పుకొని మొదటి సారి హర్ష నాతో ఇలా ప్రవర్తించాడు. నందినిని వదలను అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.



Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: విహారి, లక్ష్మీలకు సంబంధం ఉందని రచ్చ రచ్చ చేసిన పద్మాక్షి.. ఫుటేజ్‌లో అంబిక దొరికిపోతుందా!