Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode లక్ష్మీ బయటకు వెళ్తానని మనీషాకి చెప్పి వెళ్లానని మిత్రతో చెప్తే మనీషా తనకు ఏం చెప్పలేదు అబద్ధం అని అంటుంది. గతంలో మిత్రని వదిలేసి వెళ్లిపోయి మిత్ర కోసమే వెళ్లానని లక్ష్మీ చెప్పిందని ఇప్పుడు లక్కీని కూడా వదిలేసి వెళ్లి లక్కీ కోసమే వెళ్లానని చెప్తుందని అంటుంది. మనుషులు జీవితాలతో ఆడుకోవడం లక్ష్మీకి అలవాటే అని దేవయాని అంటుంది. ఇంతలో జాను తన అక్క నిజమే చెప్తుందని అంటుంది. 


దేవయాని: మీ అక్క స్వార్థ పరురాలు.
వివేక్: వదిన స్వార్థపరురాలు అయితే తన జీవితం తాను చూసుకునేది మళ్లీ ఎందుకు వస్తుంది.
మిత్ర: అదే అడగాలి అనుకున్నానురా. వెళ్లినదానివి వెళ్లిపోకుండా మళ్లీ ఎందుకు తిరిగి వచ్చావ్. మా జీవితాల్ని ఏం చేయాలని వచ్చావ్. నీకు ఆల్రెడీ చెప్పాను నువ్వు చేసిన ద్రోహం తట్టుకోగలిగాను మళ్లీ అలా చేస్తే లక్కీ చిన్న పిల్ల తట్టుకోలేదు అని చెప్పాను. 
లక్ష్మీ: నేను ఏ తప్పు చేయలేదు మిత్రగారు నన్ను నమ్మండి ప్లీజ్
మిత్ర: నిన్ను నమ్మినందుకే ఇలా జరిగింది. పదే పదే ద్రోహం చేస్తున్నావ్. అబద్ధాలు నిజాలని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నావ్ నువ్వు ఏం మారలేదు నీ వల్ల నేను పదే పదే మోసపోతున్నాను. నీకు ఏమైనా కోపం ఉంటే నా మీద చూపించాలి ఆ పసి పిల్ల మీద కాదు.  నేను ఇలా బతకడం కూడా నీకు ఇష్టం లేదా. లేక లక్కీతో బతుకుతున్న నన్ను లక్కీతో పాటే చంపేయాలి అనుకున్నావా.  
లక్ష్మీ: మీరు నాకు భర్త అయితే లక్కీ నా కూతురు మిమల్ని ఎందుకు చంపుకుంటాను.
మిత్ర: భర్త కూతురు అని మాటల్లో కాదు చేతల్లో చూపించాలి. నిన్ను నమ్మిన ప్రతీ సారి నేను మోసపోతున్నా.
లక్ష్మీ: జున్ను మీద ఒట్టు వేసి చెప్తున్నా అండీ నేను లక్కీకి మంచి చేయాలి అనుకున్నా.
మిత్ర: ఓ అవునా అయితే లక్కీకి ఏం మంచి జరిగింది. ఈ పాటికి ఇంట్లో ఆడుకోవాల్సిన పిల్ల నీ వల్ల ఐసీయూలో ఉంది. ఇదే జున్నుకి ఇలా అయితే ఊరుకునేదానివా. లక్కీ మీద సవతి ప్రేమ చూపిస్తున్నావ్. 


ఇంతలో నర్స్ వచ్చి గొడవ వద్దని చెప్తుంది. మిత్ర లక్ష్మీని వెళ్లిపోమని చెప్తాడు. లక్ష్మీ లక్కీని చూస్తా అంటే వద్దని మిత్ర అంటాడు. వెళ్లకపోతే ఏం చేస్తానో నాకే తెలీదని అంటాడు. దాంతో లక్ష్మీ జున్నుని తీసుకొని అక్కడ నుంచి వెళ్లిపోతుంది. మిత్ర వాళ్లకు కాస్త దూరంలో కూర్చొంటుంది. మిత్ర ఏడుస్తూ కూర్చొంటాడు. ఇక డాక్టర్ పాప కోసం రక్తం కావాలని తమ దగ్గర లేదని ఏర్పాటు చేసుకోమని మిత్ర వాళ్లతో చెప్తాడు. పాపని దత్తత తీసుకున్నామని మా బ్లడ్ మ్యాచ్ అవ్వడం లేదని జాను అంటుంది. పాప తల్లి అయినా తండ్రి అయినా ఉంటే బ్లడ్ దొరికేదని డాక్టర్ అంటారు. ఇక మిత్ర, దేవయాని, వివేక్, మనీషాలు చెరో హాస్పిటల్‌కి బ్లడ్ కోసం వెళ్తారు. 


దేవయాని: ఎలా అయినా ఆ బ్లడ్ నువ్వే తీసుకురావాలి మనీషా అప్పుడు నువ్వు మిత్ర దగ్గర హైలెట్ అవుతావు ఈ  రోజు నీకు అన్నీ భలే కలిసొచ్చాయి మనీషా. 
మనీషా: డాక్టర్ పాప కోసం ఏ నెగిటివ్ రక్తం కావాలని చెప్పడం పాప తల్లిదండ్రులు ఎవరైనా ఉండి ఉంటే రక్తం మ్యాచ్ అయ్యుండేదని డాక్టర్ చెప్పడం గుర్తు చేసుకుంటుంది. మనం ఒక లాజిక్ మర్చిపోయాం ఆంటీ. లక్కీ బ్లడ్ గ్రూప్ తల్లిదండ్రుల్లో ఒకరి గ్రూప్తో మ్యాచ్ అవుతుంది కదా. మిత్రది మ్యాచ్ అవ్వలేదు అంటే లక్ష్మీది అవుతుంది కదా.
దేవయాని: కరెక్టే మనీషా మిత్రది మ్యాచ్ అవ్వలేదు అంటే లక్ష్మీది అవుతుంది. అంటే నీ కంటే ముందు లక్ష్మీ లక్కీకి బ్లడ్ ఇస్తుంది. మిత్ర దగ్గర మార్కులు కొట్టేస్తుంది.
మనీషా: అది సెకండరీ ఆంటీ లక్ష్మీ బ్లడ్ మ్యాచ్ అయితే తానే లక్కీ తల్లి అని తెలిసిపోతుంది కదా అప్పుడు నా పని అవుట్. మిత్ర లక్ష్మీ చేసిన అన్నీ తప్పులు క్షమించేస్తాడు. వాళ్లు ఒకటి అయిపోతారు నేను ఒంటరి అయిపోతా.
దేవయాని: లక్ష్మీకి లక్కీ బ్లడ్ గ్రూప్ తెలీదు కదా
మనీషా: లక్ష్మీకి తెలీదు కానీ జానుకి తెలుసు కదా. లక్కీ, లక్ష్మీల బ్లడ్ గ్రూప్ ఒకటని దానికి గుర్తొస్తే. 


మరోవైపు లక్ష్మీ, జున్నులు లక్కీ కోసం గుడికి వెళ్లి దేవుడికి దండం పెట్టుకుంటారు. లక్కీకి ఏం కాకూడదని  లక్కీకి ఏమైనా అయితే ఇంట్లో ఎవరూ తనని క్షమించరని లక్కీని కాపాడమని అంటుంది. జున్ను బయటకు వెళ్లి ఆంజనేయస్వామిని పిలిచి లక్కీని కాపాడమని వేడుకుంటాడు. తర్వాత జున్ను లక్కీ దగ్గరకు వెళ్లి స్వామి బొట్టు పెడతాడు. మరోవైపు డాక్టర్ జాను వాళ్ల దగ్గరకు వచ్చి త్వరగా బ్లడ్ తీసుకురమ్మని చెప్తాడు. ఇక జాను మరోసారి డాక్టర్‌కి బ్లడ్ గ్రూప్ అడిగి అది తన అక్క బ్లడ్ గ్రూపే అని చెప్తుంది. జున్నుకి లక్ష్మీ ఎక్కడుందని అడుగుతుంది. మరోవైపు వివేక్, మిత్రలు చాలా ప్రయత్నించి ఎక్కడా బ్లడ్ దొరకలేదని ఏం చేయాలో తెలియక డాక్టర్ దగ్గరకు బయల్దేరుతారు. ఇంతలో జాను ఎదురుగా వచ్చి ఆ బ్లడ్ గ్రూప్ ఇక్కడే ఉందని లక్ష్మీది అదే బ్లడ్ గ్రూప్ అని చెప్తుంది.  మనీషా, దేవయాని కూడా వస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: 'త్రినయని' సీరియల్: త్రినేత్రి శరీరంలోకి నయని ఆత్మ.. కళ్లెదుట భార్య రూపాన్ని చూసి బిత్తరపోయిన విశాల్!