chiranjeevi lakshmi sowbhagyavathi serial today episode: అర్జున్ ఇంటికి వచ్చిన దేవయాని, మనీషాలు వసుధారకు జున్ను తల్లి ఫొటో చూపించమని అడుగుతారు. వసుధార జున్ను ఫొటో తీసుకొని వచ్చి ఆమె ఫొటో దొరకలేదు అని ఇంకోసారి చూపిస్తాను అని అంటుంది. ఇక మిత్ర, లక్ష్మీ ఒకే కారులో వెళ్తారు. మిత్ర జాను దగ్గరకు ఎందుకు వెళ్లావని అడుగుతాడు. దానికి లక్ష్మీ పనిమీద వెళ్లి డల్‌గా ఉన్న జానుని చూసి మాట్లాడటానికి ఉండాలి అని అంటుంది. 


మిత్ర: జానుని ఓదార్చడానికి వెళ్లినందుకు థ్యాంక్స్. తను అక్క అనే ఓ భ్రమలో పడిపోయింది. అక్క అనే ఓ మహమ్మారి తనని పట్టి పీడిస్తుంది. అందుకే జాను సరైన నిర్ణయం తీసుకోలేకపోతుంది. తన జీవితాన్ని సరైన దారిలో పెట్టుకోలేకపోతుంది.
లక్ష్మి: మీరు ఏమీ అనుకోకపోతే మీకు తన అక్క మీద ఎందుకు అంత కోపం, ద్వేషం?
మిత్ర: కోపం, ద్వేషం లాంటి మాటలు సరిపోవు తను అంటే నాకు అసహ్యం. తను తన స్వార్థం చేసుకునే రకం. హఠాత్తుగా తను అంతలా స్వార్థంగా ఎలా మారిపోయిందో నాకు అర్థం కాలేదు.
 
ఇక మిత్ర కారుకి అర్జున్ కారు ఎదురుగా వచ్చి ఢీ కొడతారు. ఇద్దరూ తిట్టుకుంటారు. ఇక లక్ష్మి అర్జున్‌ని చూసి కంగారు పడుతుంది. అర్జున్ కూడా చూసి ఎవరు తను నన్ను చూసి కంగారు పడుతుందని అనుకుంటుంది. అర్జున్ మిత్ర కొత్త కొత్త మనుషులతో పరిచయాలు అవుతున్నాయి అని అంటాడు. దానికి మిత్ర తను నాకు కావాల్సిన అమ్మాయి అని చెప్తాడు. దాంతో అర్జున్ వెళ్లిపోతాడు. ఇక అర్జున్ మిత్రతో ఉన్న అమ్మాయి ఎవరు. గతంలో లక్ష్మి కూడా బుర్కా వేసుకొని తనకు ఎదురు పడిందని.. లక్ష్మి ఎందుకు మిత్రతో ఉంది అని వాళ్లిద్దరికీ ముందే పరిచయం ఉందా అని ఆలోచిస్తాడు. లక్ష్మి మిత్ర కారు దిగిపోయి నడుచుకుంటూ వెళ్తుంది. అర్జున్ లక్ష్మిని చూసి వెనకే ఫాలో అవుతాడు. అది గమనించిన అర్జున్ లక్ష్మి అని తనతో మాట్లాడుతాడు. తీరా చూస్తే అది వేరే ఆమె. 


వివేక్: ఏమైంది పెద్దమ్మ అంత పరధ్యానంగా ఆలోచిస్తున్నావ్.
అరవింద: ఒక సమస్యరా. ఆ సమస్య నా మనసుని తొలచేస్తుంది. అసలు లక్ష్మి బతికే ఉందా. లేక బతికే ఉంది అని భ్రమ పడుతున్నానా. ఈ సందేహం నన్ను బాగా వెంటాడుతుందిరా.
వివేక్: వదిన బతికే ఉంటే మనతోనే ఉండేది కదరా.
అరవింద: లక్ష్మి నిజంగానే బతికి ఉంటే తన ఇక్కడికి రావడానికి అంతులేని సమస్యలు ఉన్నాయి. వివేక్ నువ్వు భర్త కోసం త్యాగం చేసిన భార్యని చూసుంటావ్. పిల్లల కోసం ప్రాణాలు ఇచ్చిన తల్లులను చూసుంటావ్. కానీ అత్తగారి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన కోడలురా లక్ష్మి. 
వివేక్: ఏం త్యాగం పెద్దమ్మ.
అరవింద: లక్ష్మి గురించి తెలియాలి అంటే నీకు తన చుట్టూ ఉన్న కథ కూడా తెలియాలి. అసలేం జరిగింది అంటే..


గతంలో మనీషాకు యాక్సిడెంట్ అయినప్పుడు హాస్పిటల్‌లో ఉంటే అక్కడికి లక్ష్మి వెళ్తుంది. లక్ష్మితో మనీషా ఆవేశంగా తన తల్లిని కోల్పోవడానికి, తన జీవితం నాశనం అవ్వడానికి కారణం అయిన ఏ ఒక్కర్ని నేను వదలను  అని అందులో మొదటిది అరవింద ఆంటీనే అని మనీషా ఆవేశంగా చెప్తుంది. దాంతో లక్ష్మి నీకు ఏం కావాలి అని అడుగుతుంది. అప్పుడు మనీషా లక్ష్మిని మిత్ర జీవితం నుంచి, నందన్ కుటుంబం నుంచి శాశ్వతంగా వెళ్లిపోవాలి అని కండీషన్ పెడుతుంది. దాంతో లక్ష్మి వెళ్లిపోతుంది. ఆ విషయం అరవిందకు లక్ష్మి షేర్లు రాసిచ్చిన వ్యక్తి చెప్తాడు. 


వివేక్: వదిన నీకోసం ఇంత పెద్ద త్యాగం చేసిందా. మన కుటుంబం కోసం తన జీవితాన్ని నాశనం చేసుకుందా. మరి ఇదంతా అన్నయ్యకు ఎందుకు చెప్పలేదు. 
అరవింద: ఏమని చెప్పాలిరా. లక్ష్మిని మిత్ర ఎంత అభిమానించాడో, ఎంత ప్రేమించాడో నీకు తెలీదా. లక్ష్మిని ద్వేషిస్తున్నాడు కాబట్టే వాడు ఇంకా ప్రాణాలతో ఉన్నాడు. అందుకే వాడికి లక్ష్మి గురించి చెప్పలేదు. 
వివేక్: ఇంత జరిగినా మనీషాని ఎందుకు భరిస్తున్నావ్.
అరవింద: మనీషా గురించి చెప్తే లక్ష్మి గురించి చెప్పాల్సి వస్తుంది. మనీషా స్వార్థానికి లక్ష్మి బలైపోయిందని మిత్రకు తెలిసినా మిత్ర మనకు దక్కడు. అందుకే మనీషాని భరిస్తున్నా. 


మిత్ర తన గదిలో ఉన్న పర్స్ తీస్తాడు. అందులో లక్ష్మి ఫొటో తీసి చూస్తాడు. లక్ష్మిని తను ఎంత ప్రేమించాడో అన్ని గుర్తు చేసుకుంటాడు. ఇద్దరు సరదాగా గడిపిన క్షణాలు గర్తు చేసుకుంటాడు. నన్ను నమ్మకద్రోహం చేశావని గట్టి నమ్మకం అని ఇప్పుడు నిన్ను ఎంత ద్వేషిస్తున్నానో ఒకప్పుడు అంత కంటే ఎక్కువ ప్రేమించాను అని అనుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: 'త్రినయని' సీరియల్: లలితాదేవి వింత ప్రవర్తనకు బిత్తరపోయిన నయని, విశాల్.. అసలు ఆవిడ లలితాదేవేనా!