chiranjeevi lakshmi sowbhagyavathi serial today episode: కొండదేవరను లక్కీ పిలుస్తుంది. తన తండ్రికి ప్రాజెక్ట్ వస్తుందా అని ప్రశ్నిస్తుంది. ఆయన ఇంటికి పరిశీలించి ప్రాజెక్ట్‌ కంటే ముందు ఇళ్లు కోల్పోయినది తిరిగి వస్తుందని, ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్నది ఇంట్లో అడుగుపెట్టబోతుందని అంటాడు. అరవింద ఆ మాటలు విని ఏంటని అడుగుతుంది. సంతోషం తిరిగి రాబోతుందని కొండ దేవర చెప్తారు. దాంతో అరవింద మా కోడలు వస్తుందేమో అని అనుకుంటున్నామని అంటారు. ఇక మనీషాతో నువ్వు ఊహించలేని కనీ వినీ ఎరుగని మార్పులు వస్తాయని అంటారు. ఇక దేవయాని వివేక్‌ని చూపించి పెళ్లి జరుగుతుందా అని అడుగుతుంది. 


కొండదేవర: అంగరంగ వైభవంగా జరుగుతుందే తల్లి. గొప్ప గొప్ప వాళ్ల మధ్య జరుగుతుంది. ఆ దేవతలు దిగి వచ్చి జరిపే పెళ్లే తల్లి. మంచి మనుషులు మంచి మనసులతో జరుగుతుందే తల్లి. అంతా మంచే జరుగుతుంది. అందరూ సంతోషపడే విషయమే జరుగుతుంది. ముఖ్యంగా తాళి కట్టేవాడి మనసు పులకరించేలా జరుగుతుంది.
దేవయాని: వీడు చెప్పేది వింతగా ఉంది.
కొండదేవర: మిత్రతో.. అన్నింటి కన్నా గొప్ప మార్పులు నీ జీవితంలోనే జరగబోతున్నాయి నాయనా. అనుకోని మనుషులు ఎదురవుతున్నారు. అంచనా వేయలేని సంఘటనలు చూడబోతున్నారు. కాలగర్భంలో కలిసిపోయిన నిజాలు తెలుస్తాయి. అడ్డుతెరలు తొలిగిపోతాయి. రాబోయేవన్ని నీకు మంచివే.


జేఎమ్మార్ కూతురు సంయుక్త మీటింగ్ పెట్టబోతుందని ఫ్యామిలీ మొత్తాన్ని రమ్మన్నారని మిత్ర ఇంట్లో వాళ్లకి చెప్తాడు. లక్ష్మీ జున్నుని పడుకోపెడుతూ మాట్లాడుతుంది. రేపు సాయంత్రం ఐస్ క్రీమ్ కొనివ్వమని బయటకు వెళ్దామని అంటాడు. దానికి లక్ష్మీ అమ్మ రేపటి నుంచి బిజీగా ఉంటుందని నీతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేనని అర్జున్ బాబ నిన్ను చూసుకుంటాడని చెప్తుంది. ఇక ఉదయం మిత్ర కుటుంబంలోని అందరూ సంయుక్త పార్టీకి వస్తారు. దేవయాని మనీషా, సంయుక్త అమెరికాలో కలిసి చదువుకున్నారని మంచి ఫ్రెండ్స్ అని మనీషాని ఇరికించేస్తుంది. అందరూ మనీషాతో నీ ఫ్రెండ్ గురించి చెప్పలేదని అంటుంది. మనీషా కవర్ చేస్తుంది. ఇక ప్రాజెక్ట్ కోసం మిత్ర ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదని మనీషా వల్ల ఈజీ అయిపోతాయని మిత్ర తండ్రి అంటాడు. మనీషా దేవయానితో సంయుక్త తనని చూసి ఈ అమ్మాయి ఎవరు అని అడిగితే పరిస్థితి ఏంటని మనీషా అడుతుంది. దానికి దేవయాని తోచిన అబద్ధాలు చెప్పేద్దామని అంటుంది. 


జాను కూడా అక్కడికి వస్తుంది. లక్కీ జానుని విష్ చేస్తుంది. పెద్ద పెద్ద వాళ్ల ఫంక్షన్‌కి ఇలాంటి చిల్లర గాళ్లు వచ్చారు. ఎవరి పిలిచారు అని అంటుంది. మనీషా కూడా పిలవకపోయినా వచ్చేస్తారని అంటుంది. ఇక దేవయాని తన కొడుకు వివేక్‌ పిలిచాడేమో అని అడుగుతుంది. దాంతో అర్జున్ ఎంట్రీ ఇచ్చి జున్ను కోసం వచ్చిందని చెప్తాడు. ఇక దేవయాని ఆయా అని జానుని అవమానిస్తుంది. ఇక మిత్ర అర్జున్‌తో జున్ను వాళ్ల అమ్మ ఎవరికీ కనిపించదా నలుగురిలోకి ఎప్పుడూ రాను అంటుందా ఎందుకు అని ప్రశ్నిస్తాడు. దానికి అర్జున్‌ మిత్రతో వేరే వాళ్ల పర్సనల్‌లోకి అంతగా రావొద్దని అంటాడు. జున్ను తల్లి ఎంట్రీ అదిరిపోతుందని త్వరలోనే ఎంట్రీ ఇస్తుందని అందరూ షాక్ అయిపోతారని అంటాడు. బిల్డప్ బాగుందని మిత్ర అంటాడు. ఇక లక్కీ జున్నుని తీసుకొని వెళ్తుంది. అరవింద అర్జున్‌తో మిత్రను తప్పుగా అర్థం చేసుకోవద్దని అంటుంది. మిత్ర తండ్రి మిత్రతో అర్జున్‌తో అలా మాట్లాడినందుకు తిడతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మిత్ర, అర్జున్‌ల చేతులు కలిపిన జేఎమ్మార్.. సంయుక్తగా లక్ష్మీ ఎంట్రీ ఫిక్స్!