Trinayani Today Episode పునర్జన్మలో ఉన్న గాయత్రీదేవి ఆత్మ గతంలో కనిపించి తర్వాత ఆ కనిపించలేదని ఈలోపు దురంధర ప్రెగ్నెంట్ అయింది అంటే గాయత్రీ దేవి ఆత్మ దురంధర గర్భంలో ప్రవేశించిందని సుమన అంటుంది. అందరూ షాక్ అయిపోతారు. పునర్జన్మలో పుట్టిన గాయత్రీదేవి మళ్లీ చనిపోయి మరోసారి జన్మ ఎత్తడానికి దురంధర గర్భంలో ప్రవేశించిందని అందుకే ఆత్మ కనిపించడం లేదని సుమన అంటుంది.  


విశాల్: మా అమ్మ ఎన్ని జన్మలెత్తినా నయని గర్భం తప్ప ఇంకెవరి గర్భం కోరుకోదు. 
తిలోత్తమ: అన్ని జన్మలు నయని కూడా పుట్టాలా విశాల్.
విక్రాంత్: పెద్దమ్మ ఆశయం నెరవేర్చడానికి నయని వదిన కూడా ఎన్ని జన్మలైనా ఎత్తుతుంది. 
సుమన: గాయత్రీ పాప మేడ మీదకు వెళ్లడంతో సుమన చూసి దురంధర పిన్ని గర్భంలోకి గాయత్రీ దేవి అత్తయ్య వచ్చారని అనడంతో పాప కూడా పేరు మీద ఉన్న ఆస్తిని ఇచ్చేడానికి మీదకు వెళ్తుందనుకుంటా. ఈ సారి పిన్ని మోసం చేయకుండా తీసుకోవచ్చు.
విక్రాంత్: అది అలా వాగుతుంటే నాకే కొట్టాలి అనిపిస్తుంది మీరు ఏమనడం లేదు ఏంటి వదినా.
నయని: బాబుగారు ఆలోచనలో పడిపోవడంతో ఆగిపోయారు. 
తిలోత్తమ: ఏం ఆలోచిస్తున్నావ్ నాన్న.
విశాల్: నన్ను కన్నతల్లి గాయత్రీ దేవి వస్తుంది అమ్మ. 
సుమన: ఎప్పుడు.
వల్లభ: దురంధర అత్తయ్య డెలివరీ అయినప్పుడు. 
విశాల్: చాలా కోపంగా.. ఏయ్ స్టాపిట్. ఫస్ట్ టైం మా అమ్మ ఇంకొద్ది క్షణాల్లో ఇక్కడికి రాబోతుందని నయని కంటే ముందే నాకు తెలుస్తుంది. 
విక్రాంత్: పెద్దమ్మ ఆత్మ వస్తే గనక దురంధర అత్తయ్య గర్భం ఆశ్రయించలేదని వీళ్లకి అర్థమవుతుంది. 
సుమన: ముందు రానివ్వండి.
దురంధర: మనం చూడలేం కదే.
వల్లభ: మా మమ్మీ చూస్తుంది.
తిలోత్తమ: నోర్‌ముయ్‌రా నేనే ఎలా చూస్తాను. ఆ శక్తి నయనికి మాత్రమే ఉంది. 
సుమన: వస్తే కదా పెద్దత్తయ్య.
విశాల్: వస్తుంది. మనసులో.. అమ్మ నువ్వు నయని ఎత్తుకొని ఉంటే కిందకు దిగగానే అనుకున్నా రావడానికే వెళ్లావని. 


ఇంట్లో పెద్దగా గాలి వీస్తుంది. మేడ మీద నుంచి చేతిలో పువ్వు పట్టుకొని గాయత్రీ దేవి ఆత్మ వస్తుంది. నయని చూస్తుంది. తిలోత్తమ కూడా చూస్తుంది. మిగతా అందరికీ గురువుగారు ఇచ్చిన మంత్ర పుష్పం ఒక్కటే మేడ మీద నుంచి వస్తున్నట్లు కనిపిస్తుంది. మంత్ర పుష్పాన్ని పట్టుకొని గాయత్రీ అమ్మగారు వచ్చారని నయని చెప్తుంది.  


విశాల్: ఎమోషనల్‌గా తన ఎదురుగా ఉన్న మంత్రపుష్పాన్ని చూస్తూ.. నయని మా అమ్మ ఇక్కడే ఉంది కదా. 
నయని: అవును బాబుగారు.
విశాల్: తిలోత్తమ అమ్మ మా అమ్మ స్వామిజీ వారు ఇచ్చిన మంత్ర పుష్పాన్ని పట్టుకొని నా కళ్లు ముందు నిల్చొంది తెలుసా. (గాయత్రీ దేవి ఆత్మ కూడా ఏడుస్తుంది.) 
తిలోత్తమ: ఆత్మ కనిపించినా కనిపించనట్లు నటిస్తూ.. అవునా.. అలాగా నాన్న. నయనికి మీ అమ్మ ఆత్మ స్వరూపం స్పష్టంగా కనిపిస్తుంది. మనం చూడలేని దురదృష్టవంతులం కదా.
గాయత్రీదేవి: నువ్వు నన్ను చూడగలవన్న సంగతి నా కోడలు నయనికి తెలుసు తిలోత్తమ. తను ఆ విషయం చెప్తే ఎక్కడ నీ బండారం బయట పడుతుందో అని కంగారు పడుతున్నావా.
నయని: మీరు లేరని నోరు పారేసుకొనే వాళ్లకి బుద్ధి చెప్పడానికే వచ్చారు కదా అమ్మగారు. 
గాయత్రీదేవి: నీ చెల్లిలి మాటలు పట్టించుకోకు నయని. నీ లక్ష్యం వేరు నీ గమ్యం వేరు. అలాంటి వాళ్లతో నీకు పోలిక ఏంటి. 
సుమన: ఏమంటుంది అక్క పెద్దత్తయ్య.
తిలోత్తమ: నోరు మూసుకొని ఉండమంటుంది. నువ్వు మాట్లాడకు సుమన.
విశాల్: అమ్మా.. నువ్వు నాకు కనిపించకపోవచ్చు. కానీ నువ్వు పట్టుకొని వచ్చిన పుష్పం నాకు కనిపిస్తుందమ్మా. అమ్మా.. నీ చేయి ఇక్కడే ఉంది కదమ్మా. ఇక్కడే నువ్వు నిల్చొన్నావు కదమ్మా. నిన్ను స్పర్శించే అవకాశం నాకు ఉండి ఉంటే నాకు ఈ జన్మకు అంత కన్నా ఏం కావాలి. 
గాయత్రీదేవి: నీ కూతురిగా నేను పుట్టాను కదా నాన్న. నన్ను ఎత్తుకొని నువ్వు నా ఆలనాపాలనా చూస్తావు కదా నాన్న. నయని గాయత్రీ దేవి మాటలు విశాల్‌కి చెప్తుంది. 
విశాల్: అమ్మా థ్యాంక్యూ సో మచ్. ఐ లవ్‌ యూ అమ్మ.
గాయత్రీదేవి: లవ్‌ యూ సో మచ్ నాన్న. నాన్న నువ్వు ఈ పుష్పం తీసుకొని నయనికి ఇవ్వు. నయని విశాల్‌కి చెప్తుంది. 


విశాల్ రెండు చేతులు చాచితే గాయత్రీ దేవి పువ్వు విశాల్ చేతిలో వేస్తుంది. విశాల్ చాలా సంతోషిస్తాడు. అందరూ షాక్ అయిపోతారు. విశాల్ నయని చేతుల్లో ఆ పువ్వు పెడతాడు. గాయత్రీదేవి ఆ పువ్వుని ఎక్కడ అంటే అక్కడ పెట్టొద్దని తన కొంగులో కట్టుకోమని చెప్తుంది. నయని అలాగే చేస్తుంది. 


గాయత్రీదేవి: తిలోత్తమ నువ్వు నన్ను పట్టుకోవాలి అన్న ప్రయత్నం ముమ్మరం చేశావని నాకు అర్థమైంది. కానీ నేను వాటిని తిప్పి కొట్టి నీ ఆయుష్షుని సమాప్తం చేయబోతున్నాను. ఇప్పటికిప్పుడు నిన్ను చంపేయాలి అన్నంత కసిగా ఉంది. కానీ నా కొడుకు ఆనందంగా ఉన్నాడని ఈ పూట నువ్వు బతికి పోయావ్. 
నయని: బాబు గారు అమ్మగారు వెళ్లిపోతున్నారు.
దురంధర: ఏయ్ సుమ్మి పెద్దొదిన నా కడుపులో లేదు అని ఇప్పటికైనా అర్థమై చచ్చిందా నీకు.


విశాల్ గాయత్రీ పాపని పట్టుకొని తన సంతోషాన్ని వ్యక్తం చేస్తాడు. హాసిని, పావనా మూర్తి అక్కడికి వస్తారు. మంత్ర పుష్పాన్ని తను గదిలో మర్చిపోయానని గాయత్రీ పాప కూడా అదే గదిలోకి వెళ్లిందని అమ్మగారు కూడా ఆ గదిలో నుంచే వచ్చిందని నయని అంటుంది. హాసిని పాప వెళ్తే అమ్మగారు వచ్చారని అంటుంది. నయనికి అనుమానం వస్తే విశాల్ కవర్ చేస్తాడు. మరోవైపు విక్రాంత్ బెడ్ మీద పడుకుంటే సుమన వచ్చి ఏమైందని అడుగుతుంది. విక్రాంత్ సంతోషంగా ఉందని చెప్తాడు. చాలా రోజుల తర్వాత విశాల్ అన్న ముఖంలో సంతోషం చూశానని విక్రాంత్ సుమనకు చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: సత్యభామ సీరియల్(Satyabhama Serial): వియ్యంకుడిని జైలులో ఉంచాలని మహదేవయ్య ప్లాన్.. బామ్మర్దిని అనుమానించిన క్రిష్, నిజం తెలుసుకుంటాడా! సత్యభామ సీరియల్ నిన్నటి ఎపిసోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.