chiranjeevi lakshmi sowbhagyavathi serial today episode: అర్జున్ లక్ష్మీని సంయుక్తగా మారి జేఎమ్మార్‌కి అండగా ఉండటంతో పాటు నందన్ ఫ్యామిలీని కాపాడుకోమని చెప్తాడు. అర్జున్ మాటలకు లక్ష్మీ ఒప్పుకుంటుంది. అర్జున్ జేఎమ్మార్ దగ్గరకు వెళ్లి లక్ష్మీ సంయుక్తగా ప్రపంచానికి పరిచయం అవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్తుంది. ఇక జేఎమ్మార్ అనారోగ్యం కారణంగా తిరిగి అమెరికా వెళ్లిపోతున్నారని టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. నందన్ ఫ్యామిలీ ఆ న్యూస్ చూసి షాక్ అయిపోతుంది. ఆ ప్రాజెక్ట్ బాధ్యతలు ఆయన కూతురు సంయుక్తకి అప్పగించారని చెప్తారు. మిత్ర ప్రాజెక్ట్ మీద చాలా ఆశలు పెట్టుకున్నాడని మిత్రకే ఈ ప్రాజెక్ట్ రావాలని కోరుకుంటారు. మనీషా ఆ సంయుక్త అందంగా ఉండకూడదని మిత్రని బుట్టలో వేసుకోకూడదని అనుకుంటుంది. మనీషా భయానికి  దేవయాని కోప్పడుతుంది.


జేఎమ్మార్ అర్జున్, మిత్ర లాంటి బిజినెస్ మాన్‌లతో మాట్లాడుతారు. ది బ్యూటీఫుల్ ప్రాజెక్ట్ కోసం మాట్లాడుతారు. ఆయన ప్రాజెక్ట్ ఇవ్వడానికి ఎలాంటి వారిని ఇవ్వనున్నారో చెప్తారు. ఇక తాను అమెరికా వెళ్లిపోతున్నానని ఆయన కూతురు ఈ ప్రాజెక్ట్ బాధ్యతలు తన కూతురు చూసుకుంటుందని, ఆమె సరైన వారికి ఈ ప్రాజెక్ట్ అప్పగిస్తుందని చెప్తారు. జేఎమ్మార్ మాటల్ని లక్ష్మీ చాటుగా వింటుంది. ఇక జేఎమ్మార్ మిత్రని పిలుస్తారు. 


మిత్ర: సార్ నేను మీకు ముందే తెలుసా.
జేఎమ్మార్: తెలుసుకున్నాను. ఇక్కడ అర్జున్ ఎవరు.
అర్జున్: సార్ నేనే సార్. కానీ నా గురించి మీకు.
జేఎమ్మార్: మీ గురించి కూడా తెలుసుకున్నాను. అని ఇద్దరి చేతులు కలిపి ఆల్ ది బెస్ట్ చెప్తారు. మిత్ర షాక్ అయిపోతాడు. లక్ష్మీ మీద నుంచి చూసి సంతోషపడుతుంది. 
మిత్ర: డాడ్ జేఎమ్మార్ గారు నన్ను గుర్తు పట్టారు. నా పేరు పెట్టి పిలిచారు. నేను అయితే షాక్ అయిపోయా. ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు.
వివేక్: నీ గురించి ఆయనకు ముందే చెప్పుంటారు అంటావా అన్నయ్య.
మిత్ర: మన గురించి ఎవరు చెప్తారురా. జేఎమ్మార్ గారి మనసులో నేను ఉన్నాను. మరి ఆయన కూతురి మనసులో ఉన్నానో లేదో.. 
మనీషా: అదేంటి ఆంటీ మనసు అని మిత్ర ఇప్పుడే ఇలా మాట్లాడుతున్నాడు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు.
లక్కీ: నాన్న అయితే మీకు ఆ ప్రాజెక్ట్ వచ్చినట్లేనా. ఈ లక్కీ లక్ నీకు కచ్చితంగా ఉంటుంది నాన్న. నీకే ఆ ప్రాజక్ట్ వస్తుంది.  


అర్జున్: లక్ష్మీ దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావ్.
లక్ష్మీ: అర్జున్ గారు జేఎమ్మార్ లక్ష్యం నెరవేర్చడానికి నేను సంయుక్తలా రావడంతో అర్థముంది కానీ సంయుక్త రూపంలో నా కుటుంబాన్ని మోసం చేయడం ఇంకా తప్పుగానే అనిపిస్తుంది.
అర్జున్: మనం చూసే ప్రతీ దానికి రెండు కోణాలు ఉంటాయి. ఒకటి మంచిది రెండోది చెడు. నువ్వు ఎవరికీ హాని చేయడం లేదు. ద్రోహం చేయడం లేదు. నీ భర్తని కాపాడుకోవడానికి ఓ మార్గం చూసుకున్నావ్. నీ చెల్లికి మంచి భవిష్యత్ ఇవ్వడానికి ముందడుగు వేస్తున్నావ్. నీ భవిష్యత్ కోసం ఓ సాహసం చేస్తున్నావ్ అంతే.
లక్ష్మీ: చాలా థ్యాంక్స్ అర్జున్ గారు. నాకు మీరు ఎప్పుడూ తోడుగా ఉన్నారు. అర్జున్ అనే మంచి స్నేహితుడిని సంపాదించుకోవడం నా జీవితంలో జరిగిన ఓ గొప్ప విషయం. 
వసుంధర: అర్జున్ నిన్ను చూస్తే గర్వంగా ఉందిరా. ప్రేమించిన అమ్మాయి కోసం ఒకసారి జీవితం పోగొట్టుకున్నావు. అలాంటిది మరోసారి లక్ష్మీ విషయంలో జరిగితే ఏమైపోతావా అని భయపడ్డానురా. కానీ నువ్వు నీ గుండెకు తగిలిన గాయాన్ని దాచుకుంటున్నావ్. లోపల నీ బాధ దాచుకొని బయటకు నిబ్బరంగా ఉన్నావ్. అన్నీ మర్చిపోయి నువ్వు లక్ష్మీని ప్రోత్సహిస్తున్న విధానం చూస్తుంటే సంతోషంగా ఉందిరా.


మనీషా, దేవయానిలు మాట్లాడుకుంటారు. మిత్రకు ఏదో విధంగా నువ్వే ఆ ప్రాజెక్ట్ ఇప్పిస్తే మిత్ర నిన్ను బాగా నమ్ముతాడు పెళ్లి చేసుకుంటాడని. సంయుక్తని తమ దారికి తెచ్చుకోవాలని మనీషాతో చెప్తుంది. మనీషా సంయుక్తని తనవైపునకు లాక్కుంటానని చెప్తుంది. కొండదేవర మిత్ర ఇంటి ముందు నుంచి వెళ్తుంటే లక్కీ ఆయన్ను పిలుస్తుంది. జరగబోయేది చెప్తా అంటున్నారు ఒక విషయం అడగాలి అని అరవిందతో చెప్తుంది. ఇక ప్రాజెక్ట్ తన తండ్రికి వస్తుందా లేదా అని లక్కీ అడుగుతుంది. దాంతో ఆయన ప్రాజెక్ట్ కంటే ముందు ఈ ఇళ్లు కోల్పోయినది తిరిగి వస్తుందని ఇంట్లో అడుగుపెడుతుందని చెప్తారు. దాంతో అరవింద, తన భర్త బయటకు వస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: జేఎమ్మార్‌ కూతురు సంయుక్తగా ప్రపంచానికి పరిచయం కానున్న లక్ష్మీ.. అర్జున్ ఫుల్ సపోర్ట్!