chiranjeevi lakshmi sowbhagyavathi serial today episode: జేఎమ్మార్‌తో లక్ష్మీ ఆయన ఇంటికి వచ్చి అక్కడ జేఎమ్మార్ ఫొటో చూసి షాక్ అయిపోతుంది. మీరే జేఎమ్మార్‌ గారా అని అడుగుతుంది. జేఎమ్మార్‌ అవునని చెప్పి లక్ష్మీని పక్కన కూర్చొపెట్టుకొని మాట్లాడుతారు. నీ రాకతో నా కథ మలుపు తిరుగుతుందని నువ్వు ఎదురు పడటంతో నా జీవితం మార్పు మొదలవుతుందని జేఎమ్మార్‌ని లక్ష్మీ ప్రశ్నింస్తుంది. కొద్ది సేపట్లో నీకే అర్థమవుతుందని జేఎమ్మార్‌ అంటారు. ఇక లక్ష్మీ జేఎమ్మార్‌ పీఏతో ఆయనకు గుండెనొప్పి వచ్చిందని సీపీఆర్ చేశానని డాక్టర్ని పిలిపించమని అంటుంది. 


మిత్ర: ఏంటి అర్జున్ చాలా కంగారుగా ఉన్నావ్. నన్ను చూసినప్పటి నుంచి ప్రాజెక్ట్ వస్తుందా లేదా అని ఆలోచిస్తున్నావా. లేకపోతే నీ వెనక ఓ ఉన్న అమ్మాయిని తీసుకొస్తే అదృష్టం కలిసి వస్తుందని అనుకుంటున్నావా.
అర్జున్: నాకు ఏమో కానీ నీకు మాత్రం నీ వెనక నీ భార్య ఉంటేనే అదృష్టం ఉండేది. అవును మిత్ర ఏ రోజు అయితే నీ భార్య నీకు దూరం అయిందో ఆ రోజే నీ సంతోషం దూరం అయిపోయింది.
మిత్ర: నేను సంతోషంగా లేను అని నీకు ఎవరు చెప్పారు. 
అర్జున్: నువ్వే ఆలోచించు నీ భార్య లేనప్పుడు సంతోషంగా ఉన్నావో భార్య ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నావో ఆలోచించు.
మిత్ర: తను నన్ను మోసం చేసింది అర్జున్. నా కుంటుంబాన్ని రోడ్డుమీదకు లాగేసింది. అది నీకు తెలీదు అనుకుంటా. 


జేఎమ్మార్‌ని డాక్టర్ చూసి మీ ఆరోగ్యం సరిగా లేదని మీ బిజినెస్‌లు వాటిని పక్కన పెట్టి ఆరోగ్యం చూసుకోండని అంటారు. ఇక లక్ష్మీ జేఎమ్మార్ గురించి నీరు తీసుకొని వెళ్తుంది. అర్జున్ లక్ష్మీని చూసి జేఎమ్మార్‌ ఇంట్లో ఇంత ఫ్రీగా తిరుగుతుంద లక్ష్మీకి జేఎమ్మార్‌కి సంబంధం ఏంటని అనుకుంటాడు. జేఎమ్మార్‌ గదిలో ఆలోచిస్తూ ఉంటే లక్ష్మీ వెళ్లి ట్యాబ్లెట్స్ ఇస్తుంది. జేఎమ్మార్‌ని అమెరికా వెళ్లిపోతే మంచిదని అంటుంది. 


జేఎమ్మార్‌: నా కథ నువ్వు ఏ విధంగా మలుపు తిప్పబోతున్నావో నువ్వు తెలుసుకోవాలి కదా అని అక్కడున్న ఓ ఫోటోని చూపిస్తారు. అది చూసి లక్ష్మీ షాక్ అయిపోతుంది. అచ్చం తనలా ఉన్న జేఎమ్మార్‌ కూతురి ఫొటో చూసి అలా ఉండిపోతుంది. ఈ అమ్మాయే నా కూతురు. లేకలేక పుట్టిన కూతురు. నా ముందు ఉన్న కొన్ని సమస్యల్ని పరిష్కరించడానికి ఆ దేవుడు నిన్ను పంపించాడు అనుకుంటానమ్మా.
లక్ష్మీ: మీకు సమస్యలా. అవి నేను పరిష్కరించాలా. పెద్ద వారు గొప్పవారు మీకు సమస్యలు ఏంటి. 
జేఎమ్మార్‌: నేను ఏదో చేయడానికి ఇక్కడికి వస్తే ఇంకేదో జరిగి నేనే అమెరికా వెళ్లిపోవాల్సి వస్తుంది. అమ్మా లక్ష్మీ నాకు ఓ సాయం చేస్తావా. నువ్వు సరిగ్గా నా కూతురి పోలికలతో ఉన్నావ్. నా కూతురే నా పక్కన ఉంటే నాకు ఎంతో సాయ పడేది. నా కూతురు చేయాల్సిన పని నువ్వు చేస్తావా అమ్మ. ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ పూర్తి చేయాలని నేను వచ్చాను. ఓ సమర్థవంతమైన కంపెనీకి ఆ బాధ్యతలు ఇవ్వాలి అనుకున్నా. నువ్వు ఆ బాధ్యతని నీ భుజాల మీద వేసుకుంటావా. ఆ ప్రాజెక్ట్  పూర్తి చేస్తావా. 
లక్ష్మీ: నాకు అంత సామర్థ్యం లేదు కదా. నన్ను నమ్మి నా మీద ఇంత బాధ్యత ఎలా పెట్టగలుగుతున్నారు.
జేఎమ్మార్‌: నీలో ఎన్నో ఉన్నతమైన లక్షణాలు నేను చూశాను. అసలు నేను పెద్ద జేఎమ్మార్‌ అని తెలీకుండా ఇవన్నీ చేశావు. అది చాలు. 


పీఏ జేఎమ్మార్‌ అమెరికా వెళ్లిపోతాడేమో అని డబ్బు నొక్కేయాలి అని ముందుగానే చెక్కుల మీద సంతకాలు పెట్టిస్తాడు. అది చూసి లక్ష్మీకి అనుమానం వస్తుంది. ఫౌండేషన్‌కి డొనేషన్ చేస్తున్నామని అవే ఈ చెక్‌లు అని పీఏ చెప్తే లక్ష్మీ ఫౌండేషన్ పేర్లు ఏంటని అడుగుతుంది. పీఏ ఇచ్చిన డిటైల్స్‌ని లక్ష్మీ నెట్‌లో చెర్చ్‌ చేసి ఆ పేర్ల మీద ఫౌండేషన్లు లేవని లేని ఫౌండేషన్లకు ప్రతి నెల డబ్బు పంపిస్తున్నారని తిడుతుంది. జేఎమ్మార్‌ కూడా పీఏని తిడతాడు. ఆయన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తారు. ఈ కారణంతో జేఎమ్మార్‌ లక్ష్మీని ఒప్పించే ప్రయత్నం చేస్తారు. ఈ ప్రపంచానికి తన కూతురు సంయుక్తలా పరిచయం చేస్తానని చెప్తారు. తన కూతురు గురించి ఎవరికీ తెలీదని ఒప్పుకోమని లక్ష్మీని అడుగుతారు. లక్ష్మీ ఒప్పుకోదు. అప్పుడే అర్జున్ వచ్చి నీ వల్ల అవుతుంది లక్ష్మీ అని ఎంట్రీ ఇస్తాడు. అర్జున్ జేఎమ్మార్‌కి తనని పరిచయం చేసుకుంటాడు. లక్ష్మీని పక్కకు తీసుకెళ్లి మాట్లాడుతాడు. మిత్ర కంపెనీ, తన కంపెనీలు ఎంత డెవలప్‌ అయ్యాయో చెప్తాడు. అందరి ముందుకు వస్తే తన గురించి మిత్రకు తెలిసిపోతుందని లక్ష్మీ భయపడుతుంది. దానికి అర్జున్ నువ్వు లక్ష్మీ అని ఎవరికీ తెలీదని జేఎమ్మార్‌ కూతురుగానే తెలుస్తుందని అంటాడు. అర్జున్ మాటలకు లక్ష్మీ ఆలోచనలో పడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.