Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode లక్ష్మీ తన అగ్రిమెంట్‌కి ఒప్పుకోకపోతే ఆస్తి పంచమని అంటుంది. దానికి వివేక్ కావాలనే ఆలా ఎలా కుదురుతుంది. ఆస్తి పంచాలి మాకు నష్టం వస్తే మీరు ఆదుకోవాలి అని అంటాడు. జాను, దేవయానిలు తలాడిస్తారు. ఇంతలో మిత్ర అలా కుదరదు ఆస్తి పంచుకున్న తర్వాత ఎవరు ఎలా పోయినా మరొకరికి సంబంధం లేదు అంటాడు. జయదేవ్ కూడా అదే అంటాడు. అయితే వివేక్ యాక్టింగ్, జాను, దేవయానిల భయాన్ని చూసి నవ్వుకుంటారు. 


జాను: సొంత అక్కాబావలు అయిండి మేం వీధిన పడితే వదిలేస్తారా. ఆదుకోరా ఇదెక్కడి న్యాయం. 
మనీషా: టాపిక్ ఎటూ వెళ్తుంది. ఆస్తి పంపకమే జరగలేదు ఇలా మాట్లాడుతున్నారేంటి.
లక్ష్మీ: సొంత వాళ్లు అయినా ఆస్తి పంచుకున్న తర్వాత ఎవరికి వారే.
వివేక్: నువ్వు అలా మాట్లాడకు వదిన నేను మరిదిని కాదు కొడుకుని అన్నావ్ ఇప్పుడు నాకు నష్టం వస్తుంది అంటే వదిలేస్తావా.
జాను: మన అమ్మానాన్న పోయిన తర్వాత నువ్వే కదా నన్ను చూసుకున్నావ్. ఇప్పుడు నాకు కష్టం వస్తే చూసుకోవా.
దేవయాని: ఏం జరిగినా మేం మీతోనే ఉన్నాం కదా బావగారు ఇప్పుడు మా చావు చావమంటారా.
జయదేవ్: నేనేం చేయలేను అంతా మా కోడలి ఇష్టమే.
లక్ష్మీ: నేను అయినా ఏం చేయగలను మామయ్య ఒకసారి ఆస్తి పంచుకున్న తర్వాత మళ్లీ ఆస్తి అడిగే వీలు ఉండదు కదా. మీ ఆస్తులు కావాలి అంటే తీసుకోండి ఇప్పుడే పంచేస్తాం. కానీ నష్టం వచ్చింది కష్టం వచ్చింది అంటే మాత్రం మేం బాధ్యులం కాం.
దేవయాని: ఇలాంటి చెత్త అగ్రిమెంట్ మాకు వద్దు మేం సంతకాలు చేయం.
జాను: మనం కష్టాల్లో ఉంటే సాయం చేయరు అంట ఆ పేపర్లు చింపేయండి అత్తయ్య. 
మనీషా: ఏంటి ఇలా జరుగుతుంది వీళ్లకి పిచ్చా ఎప్పుడో జరగబోయే దానికి ఇప్పుడు కంగారు పడుతున్నారు.
లక్ష్మీ: మరి ఇప్పుడేంటి ఆస్తులు కావాలా వద్దా.
వివేక్: కావాలి వదిన కానీ అంతకు ముందు నాకు ఎక్స్‌పీరియన్స్ కావాలి. అంత వరకు ఏదో కంపెనీనో ఫ్యాక్టరీనో నాకు ఇవ్వండి దాంతో ఎక్స్ పీరియన్స్ వస్తుంది.
దేవయాని: అవును అందులో వివేక్ బాగా పని చేసి ఎక్స్ పీరియన్స్ తెచ్చుకుంటాడు.
జాను: అవును అప్పుడు మాకు నష్టాలు రావు తర్వాత మేం ఆస్తి పంచుకుంటాం.
మనీషా: వీళ్లు నిజంగానే పిచ్చోళ్లులా ఉన్నారే.
లక్ష్మీ: సరే మీ ఇష్టప్రకారమే చేద్దాం ముందు వివేక్‌కి ఒక ఫ్యాక్టరీని ఇస్తాం తర్వాత లాభాలు వస్తే అప్పుడు మీ ఆస్తి మీరు తీసుకోండి.
దేవయాని: అవును ఆ ఫ్యాక్టరీలో వివేక్ మీ కంటే ఎక్కువ లాభాలు తీసుకొస్తాడు. 
లక్ష్మీ: మామయ్య మిత్ర గారు ఇప్పటికైతే ఈ ప్రాబ్లమ్ పరిష్కారం అయింది పదండి అవార్డు తీసుకోవడానికి వెళ్దాం.


మనీషా, దేవయాని, జానుల దగ్గరకు వెళ్లి ఇలా చేశారేంటి అని అడుగుతుంది. మేం వద్దని చెప్పి వచ్చామని అంటారు. ఇంత తింగరోళ్లు అని అనుకోలేదని మనీషా అనుకుంటుంది. లక్ష్మీ వలలో పడ్డారని అనుకుంటుంది. వివేక్ వచ్చి ఏంటి మనీషా మేం తెలివిగా ఆలోచించి రాబోయే నష్టాల నుంచి గట్టెక్కితే నువ్వు ఇలా మాట్లాడుతున్నావ్ మేం నష్టపోయి వీధిలో పడితే చూడాలి అనుకుంటున్నావ్  కదా అంటాడు. మనీషా మనసులో నువ్వు మీ వదినతో చేతులు కలిపావని అర్థమైంది అనుకుంటుంది. ఇక వివేక్ తల్లితో మనం బాగుపడటం మనీషాకి ఇష్టం లేనట్లుందని అంటాడు. జాను వాళ్లు వెళ్లిపోయిన తర్వాత వివేక్ మనీషాని చూసి అదంతా తమ ప్లాన్ అన్నట్లు వెటకారంగా చూసి నవ్వుతాడు.


మనీషా ప్లాన్ అంతా పోయిందనుకుంటుంది. ఇక మనీషా దగ్గరకు లక్ష్మీ వస్తుంది. చిటికేసి మరీ షాక్ అయ్యావా మనీషా అని అడుగుతుంది. వివేక్ తన భర్తకి తమ్ముడు అని అందరూ నా సొంత వాళ్లని వాళ్ల కోసం ఏమైనా చేస్తానని అంటుంది. నువ్వు మాత్రమే పరాయి దానివి అని మిత్రకి నీ గురించి తెలిసి మెడ పట్టుకొని గెంటేసే వరకు నిన్ను వదలను అని అంటుంది. మా ఫ్యామిలీ చాలా స్ట్రాంగ్ అని మమల్ని ఏం చేయలేవు అని అంటుంది. ఇక సరయుకి లక్ష్మీ కాల్ చేసి లక్ష్మీ చనిపోవాలని అంటుంది. దానికి సరయు కిడ్నాప్ అని ఇప్పుడు ఏంటి చావాలి అంటున్నావ్ అంటుంది. దానికి మనీషా లక్ష్మీ బతికి  ఉన్నంత వరకు నాకు ఓటమే అని లక్ష్మీ చనిపోవాలని రౌడీలకు చెప్పమని అంటుంది. సరయు రౌడీలకు కాల్ చేసి లక్ష్మీ మర్డర్ చేయమని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: అమ్మాయి గారు సీరియల్: అదిరిపోయిన ట్విస్ట్.. బంటీతోనే రాజు, రూపలు.. మందారం, రాఘవని చూసేసిన తల్లీకొడుకులు!