Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode రాజేశ్వరి దేవి పిల్లలు ఇద్దరినీ చూసి కవల పిల్లల్లా ఉన్నారని అంటే జున్ను ఒక్కడే కొడుకని లక్కీ అనాథ అని దత్తత తీసుకున్నారని చెప్తుంది. అందరూ దేవయాని మీద కస్సుబుస్సులాడుతారు. ఇక మనీషా గురించి అడిగితే మిత్రకు కాబోయే భార్యని అని చెప్తుంది. రాజేశ్వరి షాక్ అవుతుంది. మనీషా స్టోరీ విన్న రాజేశ్వరి మనీషాకి వేరే సంబంధం చూసి పెళ్లి చేయమని అంటుంది. మంచి సంబంధాలు వెతకమని మిత్రతో చెప్తుంది. సరే అని మిత్ర అంటాడు.


మిత్ర మనీషాతో తాను లక్ష్మీని అన్యాయం చేయాలని లేదని లక్ష్మీ మాత్రమే భార్యగా కావాలని మనీషాతో చెప్తాడు. నన్ను వద్దని అనుకుంటున్నావా  అని మనీషా అంటే మంచి స్నేహితుడిగా అండగా ఉంటానని మంచి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తానని అంటాడు. దేవయాని వచ్చి మనీషాతో మాట్లాడటంతో  మిత్రని వదలని చెప్తుంది. లక్ష్మీ వంట చేస్తుంటే రాజేశ్వరిదేవి, జాను, వివేక్ అక్కడికి వెళ్తారు మీరు రావడ వల్ల మా అక్క జీవితం మారబోతుందని జాను అంటుంది. ఇక జాను, వివేక్‌లు లక్ష్మీతో ఎల్లుండి మీ యానివర్సరీకి నీకు ప్రపోజ్ చేసి పూర్తి భార్యగా అంగీకరిస్తారని మనీషా బెడద ఇక ఉండదని అంటారు. లక్ష్మీ చాలా సంతోషపడుతుంది. 


మనీషా తన ఫ్రెండ్‌కి ఫోన్ చేసి రేపు గెట్ టు గెదర్ ఏర్పాటు చేయ్ అందరం ఫ్రెండ్స్ కలుద్దామని అంటుంది. వెంటనే గ్రూప్ క్రియేట్ చేయమని అంటుంది. ఈ రీ యూనియన్ ఎందుకు సడెన్‌గా అని దేవయాని అంటే రేపు మిత్రతో ఫస్ట్‌ నైట్ చేసుకోబోతున్నా అని మనీషా అంటుంది. దేవయాని షాక్ అయిపోతుంది. ఇంతలో రాజేశ్వరి దేవి అక్కడికి వచ్చి వాళ్లని ప్రశ్నిస్తుంది. ఏం లేదని కవర్ చేస్తారు. ఇక జయదేవ్‌ని దీక్షితులు గారు పిలిపించి జయదేవ్‌తో మీ ఇంట్లో రేపు చెడు జరగబోతుందని చెప్తాడు. జయదేవ్ చాలా టెన్షన్ పడతాడు. మరోవైపు మిత్ర రీ యూనియన్ గురించి ఎక్జైట్ అవుతాడు. వివేక్ ఇప్పుడు వద్దు అన్నయ్యా అని అంటాడు. అయినా మిత్ర వినడు. ఇక మిత్ర ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదని దీక్షితులు గారు మరీ మరీ చెప్పారని జయదేవ్‌తో తన శిష్యుడు చెప్తాడు.


మిత్ర మనీషాతో పాటు అందరికీ గెట్ టు గెదర్ గురించి చెప్తాడు. దాంతో మనీషా తనకు ఫ్రెండ్స్ అందరూ సెండ్‌ఆఫ్ ఇస్తారన్న మాట అని తాను అమెరికా వెళ్లిపోతానని ఇకపై అక్కడే ఉంటానని అంటుంది. మిత్ర చాలా బాధ పడతాడు. లక్ష్మీ మాత్రం మనీషాని అనుమానిస్తుంది. మనీషా మీద లక్ష్మీ, జాను వివేక్‌లకు అనుమానం వస్తుంది. ఇక గెట్ టు గెదర్ గురించి జయదేవ్‌కి తెలిస్తే మిత్ర రెండు రోజులు ఎక్కడికీ వెళ్లకూడదని గోల చేస్తాడు. ఇక రాజేశ్వరి అందరినీ కూర్చొమని దేవయానిని వడ్డించమని జంటల్ని ఒక్క దగ్గర కూర్చొపెడుతుంది. జయదేవ్ మిత్రతో రేపు ఫంక్షన్‌కి నీతో పాటు లక్ష్మీని తీసుకెళ్లమని అంటాడు. దేవయాని ఎందుకు అని అంటే మిత్ర కూడా లక్ష్మీని తీసుకెళ్తా అని అంటాడు. మనీషా టెన్షన్ పడుతుంది. ఇక మిత్రకి మళ్లీ గండం ఉందని జయదేవ్ లక్ష్మీతో చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 



Also Read: సత్యభామ సీరియల్: తల్లిదండ్రుల్ని దారుణంగా అవమానించిన సంధ్య.. సంజయ్, బిగ్‌డాడీల కొత్త ఆట షురూ!