Brahmamudi Today Episode ఇంట్లో అందరూ వారికి ఏం ఏం కావాలో లిస్ట్ రాసి అపర్ణకి ఇవ్వడానికి వస్తారు. రుద్రాణి లిస్ట్ చూసిన అపర్ణ ఎక్కువ తల నొప్పి మాత్రలు రాయడం చూసి ఇన్ని ఎందుకు రాశావ్ అంటే అవసరం అలాంటింది. నాకోడలు నాకు తలనొప్పి తెప్పిస్తుంది అంటుంది. ఇక చిట్టీ కూడా తన లిస్ట్‌ని అపర్ణకు ఇస్తుంది. ఇక ధాన్యలక్ష్మి తన లిస్ట్ తీసుకొని వచ్చి ఇప్పుడు ఈవిడ గారి ముందు నేను ఒక మెట్టు దిగాలా ఇదంతా నా కర్మ అని తనలో తాను అనుకుంటుంది. తన భర్తకు ఆ లిస్ట్ ఇవ్వమని అడుగుతుంది. ప్రకాశం ఇవ్వను అనేస్తాడు. 


అపర్ణ: మనసులో.. ఇప్పుడు నీకు అహం అడ్డొస్తుందా ఇస్తాను ఉండు నీకు దిమ్మతిరిగిపోయే షాక్.. అప్పుడే వస్తున్న కావ్యని పిలిచి.. ఇటురా కావ్య.. నీకేం అక్కర్లేదా.. 
కావ్య: నాకు అంత పెద్ద లిస్ట్ ఏం అక్కర్లేదు అత్తయ్య. మీ అబ్బాయికి కావాల్సిన లిస్ట్ లోనే నాకు కావాల్సిన చిన్న చిన్న ఐటెమ్స్ రాసేశాను. 
అపర్ణ: సరే ఇవాళ్టి నుంచి నువ్వు ఒక పని చేయాలి. ఈ రోజు నుంచి ఇంటి బాధ్యతలు అన్నీ నువ్వే తీసుకోవాలి. 
కావ్య: అత్తయ్య నేనా..
అపర్ణ: నువ్వే ఇంటికి సంబంధించినవి ఏవైనా నువ్వే తెప్పించాలి. ఆ పనులు అన్నీ నువ్వే చూసుకోవాలి. నేను ఇంత కాలం చూసుకున్నాను. ఇక నుంచి దుగ్గిరాల వంశంలో పెద్ద కోడలిగా ఈ బాధ్యతలు నీకే అప్పగిస్తున్నాను. 
కావ్య: కానీ అత్తయ్య నేను ఆఫీస్‌కు వెళ్తాన్నా కదా నేను అక్కడుంటే ఇక్కడ ఏదైనా అవసరం వస్తే అందరూ ఇబ్బంది పడతారు కదా..
అపర్ణ: ఇబ్బంది పడే అంత కొంపలు మునిగే అవసరాలు ఏవీ ఇంట్లో రావులే. ఇది ఇంటి లాకర్ తాళాలు.. 
కావ్య: అత్తయ్య ఇంత పెద్ద బాధ్యత..
అపర్ణ:  నేనేం నీకు రిక్వెస్ట్ చేయడం లేదు. మా అత్తగారి దగ్గర పర్మిషన్ తీసుకున్నాను. నీ అత్తగా నీకు బాధ్యత చెప్తున్నాను. ఇది నా ఆజ్ఞ తీసుకో. 
చిట్టీ: తీసుకో కావ్య మంచి రోజు మంచి పని ఇవి ఒట్టి తాళాలు కాదు ఈ ఇంటి గౌరవం గుర్తులు.. ఇన్నాళ్లకు నీకు ఆ గౌరవం దక్కింది. 
అపర్ణ: ఎవరికి ఏ అవసరం వచ్చినా నీ దగ్గరకే రావాలి.. తీసుకో.. ఇది నీ హక్కు తీసుకో.. 
కల్యాణ్: ఆల్‌ది బెస్ట్ వదినా యూ డిజర్వ్ ఇట్. ఇది నా లిస్ట్. అనామిక నీ లిస్ట్ ఇచ్చేశావా..
అనామిక: నాకు కావాల్సిన లిస్ట్ నా పుట్టింటి నుంచి తెప్పించుకున్నానులేండి.
అపర్ణ: పుట్టింటి నుంచి తెప్పించుకున్నావా.. మీ పుట్టింటి ఐశ్వర్యం ఆడంబరాన్ని మెట్టింటిలో కూడా వెలగబెడతాను అంటే కుదరదు. 
రుద్రాణి: పుట్టింటిలో గతి లేని వారు ఎలాగూ తెచ్చుకోలేరు తను తెచ్చుకుంటే తప్పు ఏంటి వదినా.
కావ్య: కవి గారు అనామిక పుట్టింటి నుంచి తెప్పించుకున్నవన్నీ తిరిగి వాళ్ల ఇంటికే పంపించండి. ఈ ఇంట్లో అనామికకు కావాల్సినవి ఏమైనా ఉంటే లిస్ట్ రాసివ్వమనండి. ఇక కావ్యను ఇరికించేందుకు రుద్రాణి, అనామిక చేతులు కలుపుతారు. 


మరోవైపు అప్పు పోలీస్ ట్రైనింగ్‌కు జాయిన్ అవుతుంది. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి 5 లక్షలు ఇస్తే ఉద్యోగం గ్యారెంటీ అని అంటాడు. వాడికి అప్పు వద్దు అని తిడుతుంది. ఇక అనామిక తల తుడుచుకుంటుంటే కాల్యాణ్ దగ్గరకు వెళ్తే అనామిక తోసేస్తుంది. ఆఫీస్‌కు వెళ్లాలి అని తన మాటలతో మాయ చేస్తుంది. 


రాజ్‌: కావ్య, రాజ్ ఇద్దరూ ఆఫీస్‌కు రెడీ అవుతుంటారు. ఇంతలో శ్వేత ఫోన్ చేస్తుంది. కావ్య వినేలా.. హాయ్ శ్వేత ఎలా ఉన్నావ్. నువ్వు టెన్షన్ పడుతుంటే నేను తట్టుకోలేను.
శ్వేత: అని చెప్తావు కానీ ఇచ్చినమాట మర్చిపోయావ్. ఈరోజు నా భర్త వస్తున్నాడు. విడాకుల పేపర్స్ మీద నీకు తెలుసు కదా. వాడు వస్తే ఏం చేస్తాడా అని నాకు భయంగా ఉంది. పక్కనే నువ్వు ఉండాలి అని చెప్పాను కదా.
రాజ్: అందుకే కదా నీ కోసం త్వరత్వరగా రెడీ అయి వస్తున్నా..ముందు నీ దగ్గరకే వస్తున్నా ఆ తర్వాతే ఆఫీస్ వెళ్తా. ఈ రోజు నీకు ఎంత ఇంపార్టెంటో తెలిసి కూడా నెగ్లెట్ చేస్తానా చెప్పు. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా వచ్చేస్తున్నా.
కావ్య: ఆ ముఖ్యమైన పనేంటో నేను తెలుసుకోవాలి అలా తెలుసుకోవాలి అంటే నేను ఆయన గారి వెనకాలే వెళ్లాలి. ఇంతలో రుద్రాణి అక్కడికి వచ్చి లాకర్ తాళాలు చూస్తుంది. 
రుద్రాణి: స్వప్న టాబ్లెట్స్ అడిగాను కదా ఎక్కడ పెట్టావ్. 
కావ్య: అదేంటి మీ డ్రెస్సింగ్ టేబుల్ మీదే పెట్టాను కదా అని ఇందాక చెప్పాను కదా అని తాళాలు డెస్ట్ బిన్‌లో తోసేస్తుంది. ఇక ఏదో మర్చిపోయాను అని కావ్య అనుకుంటుంది. రుద్రాణి డైవర్ట్ చేస్తుంది. కావ్య వెళ్లిపోగానే రుద్రాణి ఆ తాళాలు తీసుకొని అనామిక దగ్గరకు వస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: గుంటూరు కారం : ఓటీటీలోకి వచ్చేసిన ‘గుంటూరు కారం’ - స్ట్రీమింగ్ ఎక్కడంటే?