Brahmamudi Serial Today Episode:  అందరూ డైనింగ్‌ టేబుల్‌ దగ్గర కూర్చుని ఉంటారు.. తినకుండా రాజ్‌ కోసం ఎదురుచూస్తుంటారు. ఇంతలో రుద్రాణి అందరి ముందుకు రాలేక రాజ్‌ రూంలోనే ఉండిపోయాడేమో అంటుంది. అందరూ నీ కొడుకులాగా దులిపేసుకోలేరు అంటాడు సుభాష్‌. ఇంతలో రాజ్‌ వచ్చి డైనింగ్‌ టేబుల్‌ దగ్గర కూర్చొని తనకు తానే వడ్డించుకుంటుంటే..


రుద్రాణి: తొందరగా వడ్డించుకో రాజ్‌ ఇలాంటి సమయంలోనే గబగబా తినాలి.  ఎందుకంటే బాబు లేస్తాడు. లేస్తే ఏడుస్తాడు. ఏడిస్తే ఎత్తుకోవడానికి వాడి కన్నతల్లి ఇక్కడ లేదుగా


అంటూ రుద్రాణి మాట్లాడుతుంటే  అపర్ణ లేచి వెళ్లబోతుంది. ఆపర్ణ చేయి పట్టుకుని రాజ్‌ అపుతాడు.


రాజ్‌: మమ్మీ భోం చేసి వెళ్లు..


అపర్ణ: రుద్రాణి మాటలతో నా కడుపు నిండిపోయింది. నీలాంటి వంశోద్దారకుణ్ని కన్నందుకు నాకింకా ఎన్ని అవమానాలు జరుగుతాయే తెలియక కడుపు రగిలిపోయి ఆకలి చచ్చిపోయింది.


రాజ్‌: మమ్మీ ఎవరి మీదో కోపం అన్నం మీద చూపించకూడదని నువ్వేగా చెప్పావు.


అపర్ణ: నేనింకా చాలా చెప్పాను తప్పు చేయకూడదని చెప్పాను. ఇంటి పరువు తీయకూడదని చెప్పాను. వంశ గౌరవం నిలబెట్టాలని చెప్పాను. నువ్వు తిను.


రాజ్‌: నేను భోజనం చేయడం  మీకెవ్వరికీ నచ్చకపోతే.. నావల్ల మీరెందుకు అన్నం మానేయాలి. నేనే వెళ్లిపోతాను.


రుద్రాణి: ఇప్పుడు కొడుకు తినకుండా పోయాడని మా వదిన కన్నపేగు కదిలిపోయి తను తినడం మానేస్తుందేమో?


అనగానే అపర్ణ తినకుండా వెళ్లిపోతుంది. దీంతో ఒకరి తర్వాత ఒకరు లేచి వెళ్లిపోతారు. ధాన్యలక్ష్మీ మాత్రం తనకు బాగా ఆకలేస్తుందని తినబోతే సుభాష్‌ తిడతాడు. దీంతో ధాన్యలక్ష్మీ, రుద్రాణి, రాహుల్‌, అనామిక కూడా తినకుండా వెళ్లిపోతారు. తర్వాత కావ్య ప్లేట్‌ లో భోజనం రాజ్‌కు తీసుకెళ్తుంటే అపర్ణ వచ్చి ఆపుతుంది. ఇలా చేయడం కరెక్టు కాదని కావ్య చెప్పి భోజనం తీసుకుని వెళ్తుంది.


రాజ్‌: నాకు ఆకలిగా లేదు.


కావ్య: ఇది పాత సినిమాల డైలాగ్‌


రాజ్‌: నీకు నా కథ సినిమాలా ఉందా?


కావ్య: ఆకలిగా లేదన్నమాట లక్షసార్లు విన్నట్టే ఉంది. ఓ బిడ్డను ఎత్తుకొచ్చి వీడు నా బిడ్డ అన్నాక ఏ పెళ్లానికైనా మొగుడి మీద సానుభూతి ఉంటుందా? నోరు మూసుకుని తినండి.


అని ప్లేట్‌ తీసి రాజ్‌ చేతిలో పెడుతుంది కావ్య. రాజ్‌ తింటుంటే కావ్య చూస్తుంది. రాజ్‌ తిన్నాక


కావ్య: ఇప్పుడు చెప్పండి ఇదంతా ఎందుకు చేస్తున్నారు. ఇంట్లో వాళ్లను ఎందుకు బాధపెడుతున్నారు.  


రాజ్‌: ఎవరిని బాధపెట్టాలన్న ఉద్దేశం నాకు లేదు.


కావ్య: మరి ఇందులో ఏదైనా లోక కళ్యాణం ఉందా?


రాజ్‌: నాకు ఇంకో దారి లేదు.


కావ్య:  మీ దారిలో మీకు  మీ కుటుంబం ఉంది. అది మర్చిపోతున్నారు.


రాజ్‌: అలాగని నా బాధ్యత నేను వదిలేసుకోలేను.


కావ్య: మీరిలా గదిలో కూర్చుని బాధపడుతూ ఇంట్లో వాళ్లను కూడా బాధపెడుతున్నారు. ఇవాళ ఎవరూ భోజనం  చేయలేదు దానికి కారణం మీరే కదా? కనీసం వాళ్ల గురించైనా ఆలోచించి నోరు తెరచి నిజం ఏంటో చెప్పండి.  


రాజ్‌: నిజం నిద్రపోతుంది.


కావ్య: అబద్దం ఆవలిస్తుందా.?


అనగానే రాజ్‌ కోపంగా నువ్వు నాతో మాట్లాడటానికే భోజనం తెచ్చావా అంటూ కోప్పడి గుడ్‌నైట్‌ అంటూ నిద్రపోతుంటే.. ఎన్నాళ్లీ నిజం నిద్రపోతూనే ఉంటుంది అంటూ కావ్య అడిగినా చెప్పకుండా నిద్రపోతాడు రాజ్‌. మరోవైపు ధాన్యలక్ష్మీ, రుద్రాణి, అనామికలు అందరూ ఆకలి వేస్తుందని బాధపడుతుంటారు. ఇంతలో రాహుల్‌ ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేశానని చెప్పడంతో అందరూ హ్యాపీగా ఫీలవుతారు. ఇంతలో డెలివరీ బాయ్‌ ఫుడ్‌ తీసుకుని వస్తాడు. బయట ఫోన్‌ మాట్లాడుతున్న సుభాష్‌ , డెలివరీ బాయ్‌ని ఎం తీసుకొస్తున్నావు అంటూ అడగ్గానే ఫుడ్‌ తీసుకొస్తున్నానని.. చెప్పగానే ఎవరు ఆర్డర్‌ చేశారని సుభాష్‌ అడుగుతాడు. రాహుల్‌ అని డెలివరీ బాయ్‌ చెప్పగానే రాహుల్‌ ఎవరూ ఈ ఇంట్లో లేరని ఆ ఫుడ్‌ నువ్వే తినమని సుభాష్‌ చెప్పి లోపలికి వెళ్తాడు. లోపల ఉన్న ఫుడ్‌ కూడా తీసుకువచ్చి డెలివరీ బాయ్‌కి ఇస్తాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: సెలబ్రిటీల హోలీ వేడుకలు చూద్దాం రండి - ఎవరెవరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారంటే..