Brahmamudi Serial Today Episode:  హాస్పిటల్‌ నుంచి ఇంటికి వచ్చిన అపర్ణను ఎదోలా డిస్టర్బ్‌ చేయాలని రుద్రాణి మాట్లాడుతుంది. దీంతో రుద్రాణిని కావ్య, స్వప్న  తిడతారు. రుద్రాణి వెళ్లిపోతుంది. తర్వాత రాజ్‌, అపర్ణను ఓదారుస్తాడు. ఇవన్నీ పట్టించుకోవద్దని చెప్తాడు. అపర్ణ తనను గదిలోకి తీసుకెళ్లమని అడగ్గానే రాజ్‌ అపర్ణను గదిలోకి తీసుకెళ్తాడు. తర్వాత కావ్య బట్టలు సర్దుతుంటే రాజ్‌ కోపంగా వస్తాడు.


రాజ్‌: ఏయ్‌ నిన్నే..


కావ్య: నాకో పేరు ఉంది అసలు పేరు కళావతి అలియాస్‌ కావ్య.


రాజ్: చూడు కావ్య అలియాస్‌ కళావతి. ఇకనుంచి నువ్వు ఈ పనులు ఆపేయాలి. ఇక అసలు మాయ ఎవరనేది వెతకడం ఆపేయాలి. అసలు మాయ కోసం వెళ్లి మాయలేడిని తీసుకొచ్చావు. నా అదృష్టం బాగుండి ఆ పెళ్లి ఆగిపోయింది లేదంటే నువ్వు దగ్గరుండి దాన్ని శోభనం గదిలోకి పంపేదానివి. అందుకే ఈ పనులు ఆపేయ్‌.


కావ్య: ఆపేయకపోతే.. మొదలు పెట్టిన తర్వాత ఏ పని మధ్యలో ఆపేయకూడదు.


రాజ్‌: ఏయ్‌ ఆపు ఇప్పటికే మా అమ్మ చావు అంచుల దాకా వెళ్లింది.  మళ్లీ తల్లిని తీసుకొస్తే మా అమ్మ పరిస్థితి ఏంటి?


కావ్య: సడెన్‌గా ఊడిపడి గొడవ చేస్తే.. అప్పుడైనా మీ అమ్మకు ప్రమాదమే కదా. దాన్ని పట్టుకుని శాశ్వతంగా పరిష్కారం చేసుకుంటే అంతా బాగుంటుంది. అత్తయ్య మామయ్య హ్యాపీగా ఉంటారు.


   అని చెప్పి కావ్య వెళ్లిపోతుంది. రాజ్‌ ఇరిటేటింగ్‌ గా ఫీలవుతాడు. మరోవైపు అపర్ణ ఒక్కతే రూంలో పడుకుని బాధగా ఆలోచిస్తుంది. కావ్యను తిట్టిన మాటలను గుర్తు చేసుకుంటుంది. కావ్యను తన మాటలతో బాధపెట్టానని ఏడుస్తుంది. ఇంతలో కావ్య కాఫీ తీసుకుని వస్తుంది.


అపర్ణ: ఆగు నువ్వు నాకు ఎదురుపడ్డానికి వీల్లేదు.


కావ్య: నేను మీకు నచ్చనని తెలుసు. మీరు నన్ను ఎప్పటికీ క్షమించలేరని తెలుసు. అది నా దురదృష్టం. అదంతా మీ ఇష్టం కానీ మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను మీ కొడుకు భార్యని.. మీ కోడలిని అత్తగారి ఆరోగ్యం బాగయ్యే వరకు కంటికి రెప్పలా కాపాడుకోవడం నా బాధ్యత.


అపర్ణ: వీల్లేదు నువ్వు నాకు ఎదురు పడ్డానికి వీల్లేదు.


కావ్య: ఎందుకు అత్తయ్యా..


అపర్ణ: ఎందుకంటే నేనే నీకు ఎదురుపడలేను కాబట్టి. నువ్వు నా ఎదురుగా నిలబడి ఈ ఇంటి కోసం ఎంత త్యాగం చేశానో తెలుసా అని నన్ను సవాల్‌ చేసినట్టు ఉంటుంది. నువ్వు  నాకు ఎదురుగా ఉంటే నేను నిన్ను ఎన్ని మాటలు అన్నానో అవన్నీ నాకు వినిపిస్తూ నా సంస్కారాన్ని ప్రశ్నిస్తుంటాయి. వద్దు వెళ్లిపో


కావ్య: మీ ముందు నేను ఎంత అత్తయ్యా.. నా ముందు మీరు ఎందుకలా?


అనగానే ఇక చాలు నేనెంత నేనెంత అటూ నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగిపోయావో నీకు తెలియదు.. నన్ను చూస్తుంటే వెటకారంగా ఉందా? నా మీద విజయం సాధించినందుకు గర్వంగా ఫీలవుతున్నావా? అంటూ బాధపడుతుంది అపర్ణ. దీంతో కావ్య తీసుకొచ్చిన కాఫీ అపర్ణ దగ్గర పెట్టి వెళ్లిపోతుంది. తర్వాత కనకం, కావ్యకు ఫోన్‌ చేస్తుంది. అపర్ణకు ఎలా ఉందని అడుగుతుంది. పూజకు మమ్మల్ని రమ్మని పిలిచారు. నేను అక్కడికి వస్తే లేనిపోని గొడవలు అవుతాయోమోనని అంటుంది కనకం. అదేం లేదని  మీరందరూ కలిసి రండి అని చెప్తుంది కావ్య. మరోవైపు గార్డెన్‌లో కూర్చున్న అపర్ణ దగ్గరకు రాజ్ వెళ్తాడు.  అపర్ణతో వాకింగ్‌ చేయిస్తాడు. ఇంతలో కావ్య సూప్‌ తీసుకొస్తుంది. కావ్య తీసుకొచ్చిన సూప్‌ నేను తాగనని అపర్ణ అనడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: ప్రశాంత్‌ నీల్‌, ఎన్టీఆర్ మూవీ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌! - మూవీ సెట్స్‌పైకి వచ్చేది అప్పుడే..