Trinayani Today Episode: విశాలాక్షిని ఇంటి నుంచి పంపించడానికి జుట్టు కత్తిరించి గుండు చేయాలని సుమన, వల్లభలు పడుకున్న విశాలాక్షి దగ్గరకు వస్తారు. విశాలాక్షి పూర్తి మత్తులోకి జారుకునేలా చేయడానికి రుమాలు మీద పొడి వేసి విశాలాక్షి దగ్గరకు వెళ్తాడు. విశాలాక్షి చూసి భక్తితో నన్ను ముక్తురాలిని చేస్తే మురిసిపోతాను కానీ మత్తుతో నన్ను మత్తులోకి జార్చితే నేను ఎలా మర్చిపోతాను అని అనుకుంటుంది. ఇక వల్లభ విశాలాక్షి దగ్గరకు వచ్చి గారడి పాప అని పిలుస్తాడు. గుడ్ నైట్ అని మత్తు మందు రుమాలు ముక్కుకు పెడతాడు. విశాలాక్షి మత్తులోకి వెళ్తుంది. 


ఇక సుమన వచ్చి విశాలాక్షి జుట్టు కత్తిరించాలని కత్తెర జుట్టు మీద పెడుతుంది. జుట్టు పట్టుకున్న వల్లభ వేలు కట్ చేసేస్తుంది. వల్లభ అరుస్తాడు. అందరూ లైట్లు వేసి కిందకి వస్తారు. వల్లభ, సుమన దాక్కుంటారు. విశాలాక్షి పడుకుందని అనుకుంటారు. ఎవరో అంత గట్టిగా అరిచినా విశాలాక్షి లేవలేదు ఏంటని అనుకుంటారు. ఇక విక్రాంత్ ఆ అరుపు వల్లభది ఉందని అంటాడు. ఇక డమ్మక్క ఉలూచిని ఉయ్యాల్లో తీసుకుంటూ వస్తూ మీ వారు రాలేదు. సుమన రాలేదు అంటుంది. ఇద్దరిలో ఎవరో ఒకరు వెళ్లకపోతే బాగోదు అంటూ సుమన వెళ్తుంది. ఇక నయని వల్లభ ఎక్కడని అడుగుతుంది. అందరూ ఇంత గోల చేస్తున్నా విశాలాక్షి లేవడం లేదు అనుకొని అందరూ విశాలాక్షిని లేపడానికి ప్రయత్నిస్తారు. అయినా విశాలాక్షి లేవదు. 


విశాలాక్షి పక్కన జగ్గుతో నీళ్లు చూస్తారు. ఎవరు అలా పెట్టారని అనుకుంటారు. ఇక ఆ నీటిని హాసిని విశాలాక్షి ముఖాన కొట్టి లేపుతుంది. అయినా లేవదు. ఇంతలో వల్లభ చేతిని వెనక్కి పెట్టుకొని వస్తాడు. ఇక వల్లభని అరిచింది నువ్వా అని నయని అడిగితే తాను కాదు అని వల్లభ చెప్తాడు. ఇక వల్లభ చేయిని విశాల్ చూసి ఏమైందని అడుగుతాడు. చిన్న ప్రమాదం జరిగిందని వల్లభ చెప్తాడు. వల్లభ దొరికిపోతాడు అనుకున్న టైంలో సుమన కవర్ చేసి విశాలాక్షిని లేపమని అంటుంది. నయని లేపితే డమ్మక్క మనం ఎంత లేపినా అమ్మ లేవదు. మత్తు కమ్ముకుందని అంటుంది. మత్తు ఏంటి అని సుమన అంటుంది. ఇక విశాలాక్షికి మెలకువ వచ్చేది ఎలా అని విశాల్ అడిగితే దాని వల్లే సాధ్యం అని డమ్మక్క ఉలూచిని చూపిస్తుంది. ఉలూచిని తిలోత్తమ తీసుకొచ్చిన బుట్టలోనే తాను కూడా తీసుకొచ్చాను అని డమ్మక్క చెప్తుంది. 


సుమన: ఏంటి నా బిడ్డను బుట్టలో తీసుకొచ్చావా. 
డమ్మక్క: అవును. సుమన తొందర పడి పాపను ఎత్తుకోకు అమ్మకు మెలకువ వచ్చాక తనే నీ చేతికి ఇస్తుంది అప్పుడు తీసుకో. 
సుమన: ఏంటి నీ రుబాబు నా బిడ్డను నేను ఎత్తుకోకూడదా. అంటూ సుమన వెళ్తుంది. ఉలూచిని ముట్టుకోగానే మంటలు వస్తాయి. అందరూ షాక్ అవుతారు. 
నయని: మంటలు ఎగిసి ఆరిపోయావి ఏంటి. ఎందుకు ఇలా జరిగింది.
డమ్మక్క: ఉలూచి వేసుకున్న సాక్సుల వల్లే ఇలా జరిగింది. ఉలూచి ఏడుపు అమ్మ చెవిన పడితే అమ్మ లేస్తుంది. ఎందుకు అంటే బిడ్డ ఏడుపు తల్లి చూడలేదు కదా. అని డమ్మక్క ఉలూచి ఉన్న బుట్టుని తీసుకొచ్చి విశాలాక్షి పక్కన పెడుతుంది. 


విశాలాక్షి పక్కనకు రాగానే ఉలూచి పెద్దగా ఏడుస్తుంది. అప్పుడు విశాలాక్షి లేచి కూర్చొంటుంది. ఉలూచి ఎందుకు ఏడుస్తున్నావ్ అమ్మా అంటూ విశాలాక్షి ఎత్తుకుంటాను అని విశాలాక్షి అంటే సుమన మంటలు వస్తాయి అంటుంది. నేను ఎత్తుకుంటే రావు అని విశాలాక్షి అంటుంది. విశాలాక్షి ఎత్తుకోగానే ఏడుపు ఆపేస్తుంది. సాక్సుల వల్లే ఉలూచి బిడ్డగా కనిపిస్తుంది అని పాముగా మారదని చెప్తుంది. సుమన బాధ చూడలేక తానే సాక్సులు వేసి ఉలూచిని మామూలుగా చేశాను అని అంటుంది. కానీ నాకు నువ్వు ఏం చేశావు సుమన అని అంటుంది. ఇక సుమనకు పాపని తీసుకో అని విశాలాక్షి సుమనను పిలిచి పాపను ఇస్తుంది. సాక్సులు తీయొద్దని  డమ్మక్క చెప్తుంది. ఉన్నవాటితో తృప్తి పడమని విక్రాంత్ సుమనకు చెప్తాడు. ఇక వల్లభ దగ్గరకు తిలోత్తమ వస్తుంది. విశాలాక్షి తన చేతికి పసుపు రాసుకోమని ఇచ్చిందని సుమనకు పాముగా ఉన్న ఉలూచిని మళ్లీ పాపని ఇచ్చిందని చెప్తాడు. ఏదో మాయ జరుగుతుందని తిలోత్తమ అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: సత్యభామ సీరియల్: రేణుక ప్రెగ్నెంట్ అని తెలుసుకున్న రుద్ర, అబార్షన్‌కి రెడీగా ఉండని ఆర్డర్.. హర్ష ఆలోచనల్లో నందిని..!