chiranjeevi lakshmi sowbhagyavathi serial today episode: మనీషా, దేవయాని మిత్రని హాస్పిటల్‌లో చేర్పించి ఎవరో తెలుసుకోవడానికి సీసీటీవీ ఫుటేజ్‌ చూస్తారు. అయితే ఫుటేజ్‌లో లక్ష్మీ ముఖం కనిపించదు. లక్కీ జున్నును తన ఇంటి దగ్గర డ్రాప్ చేయిస్తుంది. లక్కీని ధైర్యం చెప్పినందుకు జున్నుకి థ్యాంక్స్ చెప్తుంది. మరోవైపు లక్ష్మి అర్జున్‌కి జ్యూస్ ఇస్తుంది. ఇంతలో లక్కీ, జున్నులు లోపలికి వస్తారు. 


అర్జున్‌: లక్ష్మి గారు లక్కీ మీతో బాగా కలిసిపోయినట్లు ఉంది.
లక్ష్మి: అవును అర్జున్‌గారు లక్కీ జున్నులానే అమ్మ అమ్మ అంటూ నాతోనే ఉంటుంది.
అర్జున్: లక్కీ వాళ్ల నాన్నలా కాదు అనుకుంటా అందరితో బాగా కలిసిపోతుంది. 
లక్ష్మి: అంటే వాళ్ల నాన్న సరదాగా కలిసిపోయే రకం కాదు అంటారా.


అర్జున్ లక్ష్మికి మిత్ర గురించి చెప్పబోతే లక్కీ ఆపి పిల్లల ఎదురుగా ఎలా మాట్లాడాలో తెలీదా అని అడుగుతుంది. ఇక జున్ను అర్జున్ చేతికున్న దెబ్బ గురించి అడుగుతాడు. ఇక లక్కీ తన తండ్రి కూడా హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారని చెప్తుంది. లక్ష్మీ డిటైల్స్ అడిగితే జున్ను ఆడుకుందామని చెప్తాడు. ఇక లక్కీ ఇంటికి వెళ్లిపోతుంది. ఉదయం లక్కీ కళ్లు మూసుకొని కిందకి దిగుతుంది. ఫాదర్స్ డే కాబట్టి లేవగానే తండ్రిని చూస్తాను అని అంటుంది. మనీషా, దేవయానిలు చూసి తిట్టుకుంటారు. లక్కీకి, మిత్రకు రక్త సంబంధం లేదని ఉంటే ఇంకెంతలా ప్రేమగా ఉంటారా అని అనుకుంటారు. ఇక లక్కీ తన తండ్రి దగ్గరకు వెళ్తుంది. లక్కీ కూడా లక్ష్మిలా తనకు ఓ శత్రువులా తయారైందని మనీషా అనుకుంటుంది. 


ఇక లక్కీ కళ్లు మూసుకొని నడిచి వస్తుంటుంది. ఇక అక్కడ ఓ మేకు ఉంటుంది. దేవయాని దాన్ని చూసి తీయడానికి వెళ్తే మనీషా ఆపేస్తుంది. రక్తం వస్తే ఇంకోసారి ఇలాంటి ఓవర్ యాక్షన్ చేయకుండా ఉంటుందని అంటుంది. లక్కీ మేకును కుమ్మే టైంకి భాస్కర్ వచ్చి లక్కీని ఆపుతాడు. లక్కీ మాటలకు భాస్కర్ నువ్వు కూడా అచ్చం మీ అమ్మలా మాట్లాడుతున్నావ్ అని అంటాడు. లక్కీ తన తల్లి గురించి భాస్కర్‌ని అడిగితే చెప్పొద్దని అరవింద సైగ చేస్తుంది. లక్కీకి ఎప్పుడూ ఇలాంటి విషయాలు చెప్పొద్దని అరవింద భాస్కర్‌కి చెప్తుంది. అరవింద మాటలు విన్న దేవయాని లక్కీకి తెలియని ఆ నిజాలు ఏంటో ఈ పిల్లని ఇక్కడికి తీసుకురావడం ఏంటో అంతా మన ఖర్మ అనుకొని వెళ్లిపోతుంది. 


లక్ష్మి దేవుడిని దండం పెట్టుకొని చేయని నేరానికి జున్నుని శిక్షిస్తున్నాను అని బాధపడుతుంది. తన తండ్రి అయిన మిత్ర ఆశీర్వాదం ఫాదర్స్ డే సందర్భంగా జున్నుకి అందిస్తాను అని లక్ష్మి అనుకుంటుంది. లక్కీ పడుకున్న తన తండ్రిని నిద్ర లేపుతుంది. తండ్రి ముఖం చూస్తూ హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అని చెప్తుంది. మిత్ర పాపను ఎత్తుకొని తిప్పుతూ థ్యాంక్స్ చెప్తాడు. మరోవైపు జున్ను ఫాదర్స్ ఉన్న వాళ్లకే సెలబ్రేషన్స్ ఉంటాయి కానీ ఫాదర్ లేని వాళ్లకి కాదు అని అంటాడు. తనకు తండ్రి లేడు అని బాధపడతాడు. అర్జున్ జున్ను దగ్గరకు తీసుకొని ఓదార్చాలని మాట్లాడుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: సత్యభామ సీరియల్: రేణుక ప్రెగ్నెంట్ అని తెలుసుకున్న రుద్ర, అబార్షన్‌కి రెడీగా ఉండని ఆర్డర్.. హర్ష ఆలోచనల్లో నందిని..!