Brahmamudi Serial Today Episode: హాస్పిటల్ లో ఉన్న సుభాష్ సూసైడ్ అటెంప్ట్ చేయడంతో కావ్య, రాజ్ అడ్డుపడతారు. డాక్టర్ వచ్చి ఫస్ట్ ఎయిడ్ చేసి వెళ్లిపోతాడు. ఇంట్లో వాళ్లను నేను ఫేస్ చేయలేకపోతున్నాను అందుకే తట్టుకోలేక ఇలా అని సుభాష్ చెప్పగానే మీరేం బాధపడకండి డాడీ అమ్మ ఈరోజు కాకపోయినా ఏదో ఒకరోజు మిమ్మల్ని క్షమిస్తుంది అని చెప్తాడు. తర్వాత కావ్య, అపర్ణ దగ్గరకు వెళ్తుంది.
కావ్య: అత్తయ్యా మీకేం కాదు ధైర్యంగా ఉండండి అత్తయ్యా..
అపర్ణ: నువ్వు నాకు ధైర్యం చెప్తున్నావా?
కావ్య: మనింట్లో నీకు ధైర్యం చెప్పగలిగే ఏకైక వ్యక్తిని నేనే ఆ అర్హత నాకు మాత్రమే ఉంది. కొన్నాళ్ల క్రితం ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లో నేను ఉన్నాను. కానీ నేను అప్పుడు మీలాగా తట్టుకోలేనంత బాధకు గురి కాలేదు. ఎందుకంటే ఆయన మీద నాకున్న నమ్మకం. ధైర్యంగా ఆ పరిస్థితిని తట్టుకుని నిలబడ్డాను.
అపర్ణ: నేను మూర్ఖంగా అపార్థం చేసుకున్నాను. ఆయన తప్పు చేశారని నా కన్నకొడుకు చెప్పినా.. ఆయన్ని కన్నవాళ్లు చెప్పినా నమ్మేదాన్ని కాదు. కానీ ఆయన నోటితో ఆయనే చెప్పారు ఆ బిడ్డకు తండ్రి ఆయనే అన్నారు. ఇంకా నేను తెలుసుకోవాల్సింది ఏముంది? ఇంకా నేను ఆ మనిషిని అర్థం చేసుకోవాల్సింది ఏముంది?
కావ్య: లేదు అత్తయ్యా మామయ్యగారు మిమ్మల్ని మోసం చేయలేదు. కానీ మామయ్యగారు మోసపోలేదని లేదు కదా? ఒక తల్లి పాలు తాగే పసివాణ్ని వదిలిపెట్టి ఉండలేదు. కానీ ఆ బిడ్డ తల్లి ఉండగలుగుతుంది. అలా దూరంగా ఉన్నందుకు నెలకు పది లక్షల రూపాయలు తీసుకుంటుంది. అందుకే నేను అనుమానిస్తున్నాను. ఏదో జరిగింది. అత్తయ్యా అది తెలుసుకునే లోపు మీరు ఓపిక పట్టండి.
అనగానే అపర్ణ నువ్వు నాకు చెప్పొద్దు.. నువ్వు చెప్పినా ఎప్పటికీ నేను నమ్మను అంటుంది. కావ్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు రుద్రాణి, రాహుల్ ఆలోచిస్తుంటారు.
రాహుల్: ఆ చిత్ర విషయంలో మన పేర్లు బయటపడలేదు అంటే సంతోషపడాలో లేక అత్తయ్య చనిపోలేదని బాధపడాలో తెలియటం లేదు మామ్.
రుద్రాణి: రేయ్ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అత్తయ్య చనిపోవడం ఏంటి?
రాహుల్: అదేంటి మామ్ ఏమీ తెలియనట్టు మాట్లాడతావు. ఒకవేళ అత్తయ్య చనిపోయి ఉంటే రాజ్, మామయ్య తలో దిక్కు కూర్చుని డిప్రెషన్ లోకి వెళ్లిపోయేవారు.
అని రాహుల్ అనగానే మా వదిన చనిపోవాలను కోరుకుంటావా? పాపం రాహుల్ అంటుంది రుద్రాణి. దీంతో రాహుల్ నువ్వు ఎంత మారిపోయావు మామ్ అనగానే రుద్రాణి సరేలే ఏం చేద్దాం.. ఏదో ఒక మంచి టైం చూసి మా వదినను సాగనంపేద్దాం అంటుంది. మరోవైపు హాస్పిటల్‌లో అపర్ణ రూంలోంచి బాధగా వచ్చిన కావ్యను రాత్రి నిద్రపోలేదా అని అడుగుతాడు సుభాష్.
కావ్య: లేదు మామయ్య అత్తయ్య దగ్గరే కూర్చున్నాను అక్కడే ఉన్నాను.
రాజ్: డాక్టర్ మా మమ్మీకి ఇప్పుడెలా ఉంది.
డాక్టర్: ఏమ్మా రాత్రి మీ అత్తయ్యకు ఏం మెడిసిన్ ఇచ్చావు
రాజ్: ఏమైంది డాక్టర్..
డాక్టర్: మేము ఇచ్చే ట్రీట్‌మెంట్ గుండె పనితనాన్ని మెరుగుపరచడానికి మాత్రమే కానీ మీ మిస్సెస్ రాత్రి మీ అమ్మగారితో మాట్లాడి ధైర్యం చెప్పి నార్మల్ స్టేజీకి తీసుకొచ్చింది.
అని డాక్టర్ చెప్పగానే ముగ్గురూ హ్యాపీగా ఫీలవుతారు. ఆవిడను చూసుకోవడానికి మీ ఇంటికి మా నర్సును పంపిద్దామనుకున్నాను కానీ కోడలు పక్కన ఉంటే ఆమె త్వరగా కోలుకుంటారు. అని అపర్ణను డిశ్చార్జ్ చేస్తారు. హాస్పిటల్ నుంచి ఇంటికొచ్చిన అపర్ణను అందరూ చిన్నపిల్లలా చూసుకోవాలని రాజ్ చెప్తాడు. దీంతో రుద్రాణి మళ్లీ బిడ్డ గురించి అడుగుతుంది. వదినకు ఈ వయసులో సవతిపోరు అవసరమా? అనడంతో అందరూ రుద్రాణిని తిడతారు. ఇంతలో రాజ్ కోపంగా కాశికో, రామేశ్వరానికో మూడు నెలల వరకు రాకుండా రుద్రాణిని అక్కడికి పంపించమని కళ్యాణ్‌కు చెప్తాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: 2025 సంక్రాంతి స్లాట్ కోసం పోటీపడుతున్న టాలీవుడ్ స్టార్స్.. ఏయే సినిమాలు పోటీలో ఉన్నాయంటే?