Brahmamudi Serial Today Episode: కళ్యాన్‌ వచ్చి ఇప్పుడు పెద్దమ్మా పెద్దనాన్నా కేక్‌ కట్‌ చేస్తారు అని చెప్పగానే కేక్‌ వస్తుంది. ఇంతలో రుద్రాణి శాంతను అందరికీ జ్యూస్‌ తీసుకురమ్మని చెప్తుంది. జ్యూస్‌ తీసుకుని వస్తున్న శాంతను చూసిన సుభాష్‌, కావ్య, రాజ్‌ షాక్‌ అవుతారు. సుభాష్‌, అపర్ణకు గిఫ్టుగా ఇచ్చిన శారీ శాంత కట్టుకుని వస్తుంది.


రుద్రాణి: ఏంటే ఇది ఇంత ఖరీదైన చీర నీకు ఎక్కడి నుంచి వచ్చింది. ఇది పదివేలకు తక్కు వ ఉండదే..


శాంత: ఇవాళ పెళ్లిరోజు అని అమ్మగారే ఈ చీర పెట్టి డబ్బులు కూడా ఇచ్చారమ్మ..


రుద్రాణి: ఓ అమ్మగారు ఇచ్చారా? ఇంత కాస్లీ చీర ఇచ్చారా? వావ్‌ వదిన నీది చాలా ఖరీదైన మనసు వదిన. ఇంతకముందు ఇంత ఖరీదైన చీర ఎప్పుడు ఇచ్చినట్లు లేదే? శాంతకు డబ్బులిచ్చి ఇష్టమైన చీర కొనుక్కోమని చెప్పేదానివి కదా?


అపర్ణ: ఇప్పుడిచ్చాను నీకేమైనా అభ్యంతరమా రుద్రాణి?


రుద్రాణి: అబ్బే నాకేందుకు ఉంటుంది. నీ దాన గుణం చూసి గర్వంగా ఉంది.


ఇందిరాదేవి: సరే సరే ఇక కేక్‌ కట్‌ చేద్దాం.. అపర్ణ, సుభాష్‌ ఇక కట్‌ చేయండి.


 అని చెప్పగానే అపర్ణ కేక్‌ కట్‌ చేయడానికి వెళ్తే.. సుభాష్‌ వెళ్లబోతుంటే రాజ్‌ తీసుకొస్తాడు. ఇద్దరూ కలిసి కేక్‌ కట్‌ చేయబోతుంటే. అందరూ సుభాష్‌, అపర్ణలను విష్‌ చేస్తారు. రుద్రాణి మాత్రం మాయ మ్యాటర్‌ గుర్తు చేస్తుంది. దీంతో అందరూ రుద్రాణిని తిడతారు. తర్వాత కేక్‌ కట్‌ చేస్తారు. తర్వాత సుభాష్‌, అపర్ణను ఏమైందని అడుగుతాడు. అపర్ణ  పలకదు.


సుభాష్‌: నిన్నే అపర్ణ


అపర్ణ: వింటున్నాను.


సుభాష్‌: జవాబు చెప్పవేంటి?


అపర్ణ: ప్రశ్నేంటి?


సుభాష్‌: నేను ఇచ్చిన చీర నువ్వు పని మనిషికి ఇవ్వడమేంటి?


అపర్ణ: కొన్ని చెప్పరు అర్థం చేసుకోవాలి.


సుభాష్‌: నీకు చీర నచ్చలేదా లేక నేను ఇవ్వడం నచ్చలేదా?


అపర్ణ: మీ నుంచి నేను ఏదైనా ఆశిస్తేనే కదా నచ్చడం నచ్చకపోవడం అనేది.


సుభాష్‌: ప్రపంచంలో ఎప్పటికీ ఎవ్వరినీ క్షమించని వారు ఉండరు అపర్ణ.


అపర్ణ: ప్రపంచం ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ మీరే నాకు ప్రపంచం అనుకున్నాను. నా ప్రపంచంలో మొదటి సారి మోసాన్ని చూశాను. అందుకే క్షమించదలుచుకోలేదు.


 అంటూ ఇద్దరూ గొడవపడతారు. అపర్ణ, సుభాష్‌ను తిడుతుంది. మీరేం చేసినా నేను సహించాలా అని ప్రశ్నిస్తుంది. దీంతో సుభాష్‌ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. బయట హాల్‌లో నిల్చుని చూస్తున్న రాజ్‌, కావ్యలను చూసి షాక్‌ అవుతాడు సుభాష్. మమ్మీ మీతో కలిసిపోలేదా డాడీ అని రాజ్ అడగ్గానే సుభాష్‌ మీకెందుకు డౌట్‌ వచ్చింది అంటాడు.  మీరేదో దాచిపెడుతున్నట్లు ఉందని రాజ్‌ అడగ్గానే.. ఇప్పటికే మీరు ఎన్నో చేశారు. నా కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుందని అక్కడి నుంచి వెళ్లిపోతాడు సుభాష్‌. కావ్య అపర్ణ దగ్గరకు వెళ్తుంది.


కావ్య: అత్తయ్యా మీరు ఎందుకు మధ్యలో వచ్చేశారు.


అపర్ణ: నాఇష్టం అడగడానికి నువ్వెవరు?


కావ్య: మీ కడుపున పుట్టిన కొడుకు భార్యని మీ కోడలిని


అపర్ణ: నేను నిన్ను ఇంటి కోడలుగా మాత్రమే ఒప్పుకున్నాను. నా వ్యక్తిగత విషయాలలో తలదూర్చమని చెప్పలేదు.


కావ్య: నేను మీ వ్యక్తిగత విషయం మాట్లాడటానికి వచ్చినట్లు చెప్పానా?


అపర్ణ: మరి లోపలికి ఎందుకు వచ్చావు.


కావ్య: మామయ్యగారు మీకు కొని పెట్టిన చీరను పనిమనిషికి ఇవ్వడం కూడా మీ వ్యక్తిగత విషయమేనా అత్తయ్యా


   అంటూ కావ్య అపర్ణను ప్రశ్నిస్తుంది. ఇక ఎప్పటికీ అంతేనా అంటూ అడగ్గానే ఎప్పటికీ ఇంతే ఇంతకు మించి ఇంకేం లేదు అంటుంది అపర్ణ. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: రాజ్‌తరుణ్‌ కేసులో ఊహించని ట్విస్ట్- చచ్చిపోతున్నానంటూ లావణ్య మెసేజ్‌తో పోలీసులు పరుగులు